ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలో రొద్దం ( Roddam) ఒక మండలం. దీని పిన్ కోడ్ 515123. పెనుగొండ నుండి పది మైళ్ళ దూరంలో ఉన్న రొద్దం గ్రామం జిల్లాలోనే అత్యంత ప్రాచీన గ్రామాలలో ఒకటి. ఇది క్రీ.శ 4వ శతాబ్దము నుండి 7వ శతాబ్దము మధ్యకాలంలో స్థాపించబడినదని అంచనా. ఇక్కడ పెన్నానది ఒడ్డున స్థానికులు రుద్ర పాదం అని పిలిచే ఒక శిలపైన కట్టిన గుడి ఉన్నది. పశ్చిమ చాళుక్యుల కాలంలో రొద్ద (రొద్దం) నొళంబవాడికి ప్రాంతీయ రాజధానిగా ఉన్నది.…