Vallampati venkata subbaiah 1937వ సంవత్సరంలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య చిత్తూరు జిల్లారొంపిచర్లలో పుట్టారు. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ చేశారు. బోధనా రంగానికి అవసరమైన బి.ఇడ్, ని, ఇంగ్లీషు టీచింగ్ డిప్లమా (పిజిడిటిఇ)ని అందుకున్నారు. "The Role of Indian Sensibility in the Teaching of English Literature" అనే అంశంపై సీఫెల్ లో పరిశోధన చేసి M.Litt. పట్టా పొందారు. బెసెంట్ థియోసాఫికల్ కళాశాల,మదనపల్లిలో చాలాకాలం పాటు ఆంగ్లోపన్యాసకుడిగా పనిచేశారు. పుట్టింది రాయలసీమలోనే…
Tag: విమర్శ
రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
రాచపాళెం రాచపాళెం చంద్రశేఖరరెడ్డి చిత్తూరు జిల్లా కుంట్రపాకంలో మంగమ్మ, రామిరెడ్డి దంపతులకు 16.10.1948న జన్మించారు. ప్రాథమిక విద్య కుంట్రపాకంలోను, తర్వాత తిరుపతి, కె.వి. పురంలోను హైస్కూలువిద్యపూర్తి చేశారు. తిరుపతిలో బి.ఏ.,ఎం.ఏ., పిహెచ్.డి.పూర్తి చేశారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయప్రొఫెసర్గా 30.10.2008న పదవీ విరమణ చేశారు.సాహిత్య విమర్శను బాధ్యతగా నిర్వర్తిస్తున్న రాయలసీమ విమర్శకులల్లో రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ముఖ్యులు. ఎంత కఠినమైనదైనా సత్యాన్ని చెప్పడంలో నిర్భయంగా వ్యవహరించడం రాచపాళెం శైలీ స్వభావం. అవధానులకు పెట్టని కోటైనా రాయలసీమలో జన్మించి, అవధానాలు బూర్జువా…