కోలాట నృత్యాలు -kolatam(stick dance)

ఆంధ్ర ప్రజాజీవితంలో అన్ని జానపద కళారూపాలతో పాటు ఈ కోలాట నృత్యం కూడ తెలుగు జానపదుల జీవితాలతో పెనవేసుకుకుపోయింది. పెద్దల్నీ, పిల్లల్నీ అందర్నీ అలరించిన కళారూపం కోలాటం. కోలాట నృత్యాలు ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో రాత్రి పూట పొద్దుపోయే వరకూ చేస్తూ వుంటారు. భక్తిభావంతో దేవుని స్థంభాన్ని పట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందూ కోలాటాన్ని ప్రదర్శిస్తారు. ఈ కోలాట నృత్యాలను పెద్ద పెద్ద తిరుణాళ్ళ సమయంలోనూ, దేవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరంగంగా వీథుల్లోనూ ప్రదర్శిస్తారు.…

కొండారెడ్డి బురుజు నిర్మించిందెవరు ? Kondareddy buruju.

రాయలసీమ ముఖద్వారం……చరిత్రకు నిలువెత్తు దర్పణం….చారిత్రక నిర్మాణ వారసత్వం…..కొండారెడ్డి బురుజు…! ఈ బురుజు చాలా సినిమాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకించి కథానాయకుడు తన పొగరును పౌరుషాన్ని చూపెడుతూ తొడగొట్టి సవాల్ చేయాలి అంటే అందుకు కొండారెడ్డి బురుజు అడ్డా కావలసిందే. అప్పుడే సీన్ పండుతుంది. సినిమా జయాపజయాల మీద ప్రభావం చూపిస్తున్న ఈ బురుజుని ఎప్పుడు ఎవ్వరు నిర్మించారు అని చెప్పడానికి కచ్చితమైన శాసనాలు…లిఖిత ఆధారాలు లభ్యం కావడం లేదు.పరిశోధకులు నేటికిని అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ బురుజు నిర్మాణం విషయమై…

అయోధ్య కేసు కోసం లక్షలరూపాయలు డబ్బుఇచ్చిన రాయలసీమ వ్యక్తి ఎవరో తెలుసా?Rama janma bhumi .

అయోధ్యలో రామజన్మభూమి ఆలయనిర్మాణానికి శరవేగంగా పనులు ఆరంభమైయ్యాయి.  ఆలయం నిర్మించేందుకు అయిదు దశాబ్దాలుగా ఉద్యమం సాగుతూవస్తున్నది. ఈ కల 2020 ఆగస్టు 5వ తేదీనాటికి సాకారమయింది. ప్రపంచం యావత్తు కోట్లాది మంది తిలకిస్తుండగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ భూమిపూజ చేశారు. అయితే, ఈ సందర్భంలో గుర్తుంచుకోవలసిన వ్యక్తి తెలుగు నాట ఒకరున్నారు. రామమందిర ఉద్యమానికి ఆయన అండగా ఉన్నారు. రామమందిరం నిర్మించాలని కలలుగన్నారు. ఉద్యమానికి ఎంతగానో సహకరించారు.అతడు ఎవరో కాదు పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని…

ఎత్తిపోతల పథకం లో జ్యాప్యం రాయలసీమ కు శాపం . Rayalaseema water projects.

పర్యావరణ అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీచేయడం రాయలసీమ వాసులకు తీరని ద్రోహంగా పరిగణించాలి. ముందస్తు అనుమతులు లేకుండా పనులు మొదలు పెట్టడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొనడం విచారకరం. పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ వాసుల ఆశాకిరణం. తరతరాలుగా రాయలసీమ ప్రాంతంలో కరవు నెలకొని రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.…

పెనుకొండ వాసి పెయింటింగ్స్ సాలార్ జంగ్ మ్యూజియం చేరాయి.C.N.Venkatrao

సి.యన్.వెంకటరావు రాయలసీమ రమ్య చిత్రకారుడు సి.యన్.వెంకటరావు శ్రీ సి.యన్. వెంకటరావు అంధ్రప్రదేశ్ యందు సుప్రసిద్ధ చిత్రకారులు శ్రీ నారాయణరావు సత్యభామాబాయి అను పుణ్యదంపతులు వీరి తల్లిదండ్రులు. అనంతపురం జిల్లా పెనుగొండ లో నివశించారు. వేలూరు, నెల్లూరులందు విద్యాబ్యాసము.బాల్యము నుండి యే వీరికి చిత్రకళయందు అభిరుచి మెండు తత్పలితముగా అంజనేయుని చిత్రములను తరచుగా వేయుచుండెడివారు. చెన్నపట్టణము చిత్రకళా పాఠశాల యందు మూడు సంవత్సరాలు శిక్షణ పొంది యోగ్యతా పత్రము పొందిరి, అనంతరము అనంతపురమందలి పురపాలకోన్నత పాఠశాలయందు చిత్రకళాధ్యాపకులుగా చేరి…

శ్రీనెట్టికంటిఆంజనేయస్వామి క్షేత్రం ..kasapuram anjaneya swami temple.

కసాపురం గ్రామం లోని నెట్టికంటి దేవాలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ది చెందినది. ఇక్కడికి ప్రతి రోజు ఎంతో మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రధాన ఆలయానికి దగ్గరలోనే గుట్టపైన బాల ఆంజనేయ స్వామి వెలసినాడు.నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తరువాత బాల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ప్రధాన ఆలయం నుండి కొద్ది దూరంలో చిన్న గుట్ట పైన కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం…

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం మొదటి సభ్యులు ఎవరో తెలుసా ?Hindupur parlament constituency frist member.

అంతంత మాత్రమే రవాణ సౌకర్యమున్న మారుమూల కుగ్రామంలో జన్మించి ఆ కాలంలోనే ఉన్నత చదువులుచదివి ఉన్నత స్థాయికి చేరుకొని సౌమ్యుడు గా పేదల పక్షపాతి గా పేరుగడించారు.రైతుల సమస్యలపై , రాయలసీమ సమస్యలపై తనదైన శైలిలో పోరాటం సాగించారు. యువకుల్లో నవచైతన్యం నింపారు. ప్రజాచైతన్యం కోసం తన కలాన్ని కదిలించారు. పాత్రికేయులు గా పనిచేశారు. హిందూపురం పార్లమెంట్ మెట్ట మెదటి పార్లమెంట్ సభ్యులు గా ఎన్నికయ్యారు.కదిరి గళాన్ని డిల్లీలో వినిపించిన మొదటి వ్యక్తి కడపల వెంకటరామకృష్ణారెడ్డి. కె.వి.రామకృష్ణారెడ్డి…

హేతువాది, సంఘసంస్కర్త యోగి వేమన- veemana

బంగారు లేడి ఉండదని తెలియని రాముడు దేవుడెలాగయ్యాడు? కనక మృగము భువిని కద్దులేదనకుండతరుణి విడిచిపోయె దాశరధియుతెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?విశ్వదాభిరామ వినుర వేమ. విగ్రహారాధనను విమర్శిస్తూ…. పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టిచెలగి శిలల సేవ జేయనేల?శిలల సేవ జేయ ఫలమేమికలుగురా?విశ్వధాభిరామ వినురవేమ. కులవిచక్షణలోని డొల్లతనం గురించి…. మాలవానినంటి మరి నీటమునిగితేకాటికేగునపుడు కాల్చు మాలఅప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?విశ్వదాభిరామ వినుర వేమ. ఆ కాలం పరిస్థితులను బట్టి చూస్తే…వేమన గొప్ప హేతువాది అని గ్రహింపవచ్చు. సమాజంలో ఎంతో దృఢంగా పాతుకుపోయిన ఆచారాలను, భావాలను…

పాత్రికేయులకు ఆదర్శం విద్వాన్ విశ్వం-vidwan viswam.

మృదువుగా మాట్లాడుతూ విరుద్ధమైన అభిప్రాయం చెప్పడంలో తనది అందెవేసిన చేయి….ఆధునికతను ఆహ్వానిస్తూనే సంప్రదాయంలోని ఘనతను వ్యక్తపరచిన మహాత్ముడు… జీవితంలో సాహిత్యం, పత్రికా వ్యాసంగం ఉద్యమం ముప్పేటగా సాగించిన మహోన్నతుడు…. రాయలసీమ జనజీవితాన్ని ప్రతిబింబించిన తొలి కావ్యం పెన్నేటి పాటను అందిచిన రచయిత… మాణిక్యాల మూట…. విద్వాన్ విశ్వం విశ్వం పేరు వినగానే తెలుగువారికి 'పెన్నేటి పాట తో పాటు గుర్తుకు వచ్చేది. మాణిక్యవీణ'. తెలుగు పత్రికారంగంలో రచనకు వన్నె, వాసి సంతరించి పెట్టారాయన. తెలుపు నలుపు, అవీ-ఇవీ…

మంగళంపల్లి బాల మురళీ కృష్ణ, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి కి ప్రత్యేక సంగీత బాణీలను నేర్పించిన సంగీత విద్వాంసుడు సంధ్యావందనం-sandyavandanam.

దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు సంధ్యావందనం శ్రీనివాసరావు. కర్నాటక సంగీతంలో మహా విద్వాంసుడు. సంగీత కళానిధి సంధ్యావందనం శ్రీనివాసరావు ఆకాశవాణిలో భక్తిరంజని కార్యక్రమం సంధ్యావందనం హయాంలోనే ప్రారంభించబడింది.అప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలిండియా రేడియోలో సంధ్యావందనం వద్ద ప్రమోషన్‌ అసిస్టెంట్‌గా ఉండేవారు. ముత్తుస్వామి దీక్షితార్‌ కీర్తనలు ఆలపించడంలో సంధ్యావందనం శ్రీనివాసరావు ప్రసిద్ధులు. సంగీత కళారత్న సంగీత కళాచార్య ఆయన బిరుదులు. అనంతపురం జిల్లా పెనుకొండలో 1918, ఆగష్టు 21న సంధ్యావందనం శ్రీనివాసరావు జన్మించారు. తండ్రి నారాయణరావు, తల్లి…