పర్యావరణ అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీచేయడం రాయలసీమ వాసులకు తీరని ద్రోహంగా పరిగణించాలి. ముందస్తు అనుమతులు లేకుండా పనులు మొదలు పెట్టడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొనడం విచారకరం. పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ వాసుల ఆశాకిరణం. తరతరాలుగా రాయలసీమ ప్రాంతంలో కరవు నెలకొని రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.…