రాయలసీమ కవితలు3-Rayalaseema kavitalu3

(రాయలసీమ పాట) పల్లవి కాలే కడుపుల చిరునామ….కరువు రక్కసికి వీలునామ…అతుకుల బతుకుల సరంజామ…రాయలేలిన ఈ సీమ….రాయలేని కన్నీటి సీమ ||కాలే|| చరణం 1 రతనాల రాశులెటు పోయెను…వ్యసనాల బతుకులే మిగిలిను…కోటి కష్టాల కడలిలో..తలమునకలై ఎదురీదినా…మెతుకుల కొరకు గతుకుల దెబ్బలు… ఎన్నెన్నొ తగులుతున్నా…ఆగిపోనీ జీవనపోరాటం …సాగుతున్న తీరని ఆరాటం …||కాలే|| చరణం 2: పసిడి పంట పండాలని..ఆలి పుస్తెలమ్మి పని చేసినా.ఎముకల సున్నం కరిగెను…. ఎండమావులే మిగిలెను.ముప్పై ఎకరాలున్నా గానీ….పూటగడవనీ దీనావస్థతలో…అలుపే ఎరుగని హలికుని శ్రమ దానం..అలుసౌతున్నది ఆ…