బొమ్మిరెడ్డి నాగిరెడ్డి ప్రఖ్యాత సినిమా నిర్మాత. ఈయనను బి.నాగిరెడ్డి అని పిలుస్తారు. ఉత్తమ కళాత్మక విలువలను వ్యాపారానికి జోడించి మంచి సినిమాలు తీసిన నిర్మాత. బి.యన్.రెడ్డి కడప జిల్లాలోని ప్రొద్దుటూరు వద్ద పొట్టిపాడు గ్రామంలో అమ్మమ్మ వారింట్లో 02-12-1912న జన్మించాడు. ఈయన స్వస్థలం, సింహాద్రిపురం మండలంలోని ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై.కొత్తపల్లె) గ్రామం. బి.నాగిరెడ్డి అన్న బియన్ రెడ్డి. తండ్రి నరసింహారెడ్డి ఎర్రగడ్డలను(ఉల్లిపాయలు) విదేశాలకు ఎగుమతి చేసేవాడు. బి నాగిరెడ్డి1950లో చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించాడు.షావుకారు చలన చిత్రం…