నవాబుల ఆర్భాటానికీ సాక్ష్యం బనగానపల్లె బంగ్లా- Banaganapalli bangla.

Banaganapalli nawab bangla. నవాబుల దర్పానికి, ఆర్భాటానికీ సాక్ష్యం బనగానపల్లె నవాబు బంగ్లా. ఈ బంగ్లా బనగానపల్లె నుంచి యాగంటి పుణ్యక్షేత్రం పోయే దారిలో ఓ చిన్న గుట్ట మీద ఉంది. దాదాపు 400 సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా చెప్పుకొనే ఈ బంగ్లా బయటకు ఇప్పటికీ ఆకర్షణీయమైన కట్టడంగా కనిపిస్తోంది. వన్నెతగ్గలేదు. అయితే లోపలికి వెళ్ళి పరిశీలిస్తే పైభాగం దాదాపు శిథిలావస్థకు చేరింది. స్లాబ్ కు వేసిన ఇనప గరండాలు తుప్పుపట్టి క్షీణించడంతో స్లాబ్ సగానికి పైనే…