పెనుకొండ వాసి పెయింటింగ్స్ సాలార్ జంగ్ మ్యూజియం చేరాయి.C.N.Venkatrao

సి.యన్.వెంకటరావు రాయలసీమ రమ్య చిత్రకారుడు సి.యన్.వెంకటరావు శ్రీ సి.యన్. వెంకటరావు అంధ్రప్రదేశ్ యందు సుప్రసిద్ధ చిత్రకారులు శ్రీ నారాయణరావు సత్యభామాబాయి అను పుణ్యదంపతులు వీరి తల్లిదండ్రులు. అనంతపురం జిల్లా పెనుగొండ లో నివశించారు. వేలూరు, నెల్లూరులందు విద్యాబ్యాసము.బాల్యము నుండి యే వీరికి చిత్రకళయందు అభిరుచి మెండు తత్పలితముగా అంజనేయుని చిత్రములను తరచుగా వేయుచుండెడివారు. చెన్నపట్టణము చిత్రకళా పాఠశాల యందు మూడు సంవత్సరాలు శిక్షణ పొంది యోగ్యతా పత్రము పొందిరి, అనంతరము అనంతపురమందలి పురపాలకోన్నత పాఠశాలయందు చిత్రకళాధ్యాపకులుగా చేరి…