తొలితరం కమ్యూనిస్టు యోధుడు పూలకుంట సంజీవులు-communist Pulakunta Sanjeevulu

అనంతపురం జిల్లా తొలితరం కమ్యూనిస్టు అర్గనైజర్లలో పూలకుంట సంజీవులు గారు ఒకరు ఆయనిది అరకొర ప్రాథమిక విద్యాభ్యాసం. తనకు పరిచయం అయిన సంజీవులను కమ్యూనిస్టుపార్టీ  తీర్చిదిద్దింది. స్టడీసం ఘాల ద్వారా,పార్టీ, ప్రజాసంఘాలు ప్రచురించే సాహిత్యం చదివించడం,చర్చించడం ,రేకెత్తిన ప్రశ్నలకు సదాశివన్, రాజశేఖర రెడ్డి, వి.కె.ఆది నారాయణ రెడ్డి ద్వారా సమాధానపరుస్తూ ఆయనను సామాజికవిజ్ఞాన విద్యావంతునిగా తీర్చి దిద్దింది  అట్లా ఏర్పడిన మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంతో ఈయన  పార్టీ నిర్వహించిన భూఆక్రమణ పోరా టాల్లో, వ్యవసాయ కూలీ పోరాటాల్లోను…