22మందికి సినీ అవకాశం కల్పించిన నటీమణి పసుపులేటి కన్నాంబ -kannambha

నిలువెత్తు విగ్రహంతో, మరువలేని అద్భుతమైన, విస్పష్టమైన వాచకంతో,అద్భుతమైన నటనా పటిమతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అందాల నటీమణి కన్నాంబ. కన్నాంబ ప్రసిద్ద రంగస్థల నటి, గాయని. చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ. కన్నాంబ 5 అక్టోబర్‌ 1911 న కడప పట్టణంలో జన్మించింది. ఆమె తండ్రి వెంకట నరసయ్య, తల్లి లోకాంబ. తండ్రి కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండేవారు. వారికి కన్నాంబ ఒక్కటే కూతురు. కన్నాంబ ఎక్కువ కాలం వాళ్ల అమ్మమ్మగారింటఏలూరులోనే…