విలక్షణ నటుడు, తెలుగు ప్రియుడు జయప్రకాష్ రెడ్డి-Jayaprakashreddy

ఆయన ఓ విలక్షణ నటుడు...ఏంమిరా ఆయప్ప అంత గొప్ప నటుడా అనుకోవచ్చు...అవును డైలాగ్స్ చెప్పేతీరు వైవిధ్యమైనది..‘ఏమ్‌... రా... ఏం చాస్తాండావ్, యాడికిపోతాండావ్‌ ఇలా రాయలసీమ మాండలికంలో ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఆయనే జయప్రకాష్ రెడ్డి. విలన్ గా , హస్యనటుడుగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు. జయప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలో 1946 మే 8న జన్మించాడు. తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్…