YSR తెలుగు తల్లి'రాజ'తిలకం మేరు నగధీరుడు సువర్ణాంధ్రలో నవ్యాధ్యాయ సృష్టికర్త. రాయలసీమలో రాజకీయ మేధోగుణ సంపన్నుడిగా అంచలంచెలుగా ఎదిగిన మేరు నగధీరుడు డాక్టర్ వై.యస్ .రాజశేఖరరెడ్డి !తెలుగింటి రాజసం. ఆంధ్రావని వైభవానికి దర్పణం..ఆయన విశ్వరూపు రేఖావిన్యాసం!ప్రత్యర్ధులను సైతం చిరునవ్వు తో గెలిచి..అధినాయకత్వానికే వెన్నుదన్నుగా నిలిచి..జాతీయ రాజకీయాలపైనే చెరగని ముద్ర వేసిన ఘనత సొంతం చేసుకున్న రైతన్న ముద్దు బిడ్డ..పులివెందుల పులి బిడ్డవై.యస్. రాజశేఖరరెడ్డి! ఇంటిల్లిపాదికీ సమవర్తిగా..సేద్య సీమలో రైతుబిడ్డగా ..పేదల గుండెల్లో రాజన్నగా..రాయలసీమకే రాజమకుటమై..తెలుగు గడ్డకే దివ్యతేజమై…