అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు గ్రామానికి చెందిన పోలప్ప నారాయణమ్మల కుమా రుడు. 1999లో భారత జన విజ్ఞాన సమతి ఆధ్వర్యంలో ప్రభుత్వం గతంలో నిర్వహించిన అక్షర దీక్ష కార్యక్రమం ద్వారా పరిచయమైన కంచు కంఠంపాటలద్వారా - చదువు ఆవశ్యకతను చైతన్యాన్ని కలిగించాడు. ఇతని గళం... గర్జించే మేఘం! ఇంటర్మీడియేట్ తో చదువు ఆపేశాక అమ్మకు కిడ్నీ దెబ్బతినడంతో ఇల్లు గడవడం కష్టమైంది. అప్పుడు ప్రజా వైద్యశాలలో దినకూలీగా పనిచేస్తూ ఓ వైపు ఇంటిని పోషించుకుంటూ మరోవైపు నాటకాలు, పాటలలో ఆసక్తి చూపాడు.…