“శ్రీరాముడు స్వయంగా చెక్కిన వీరాంజనేయస్వామి విగ్రహం ఇక్కడ ఉంది- Veeranjaneya swami temple

శ్రీ గండి క్షేత్రం. Pic source google "యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ | బాష్పవారి పరిపూర్ణలోచనం, మారుతిం నమత రాక్షసాంతకమ్" || ఎక్కడెక్కడ శ్రీరామకీర్తనం, రామనామస్మరణం జరుగుతుంటుందో అక్కడక్కడ శ్రీ ఆంజనేయస్వామి చేతులు జోడించి, ఆనందంతో వింటూ ఉంటాడని ఆర్షవచనం. అంతటి మహోన్నతమైన శ్రీరామభక్తుడు ఆంజనేయుడు. అందుకు నిదర్శనంగా మనభారతదేశంలో గల దేవాలయాలలో ఎక్కువభాగం ఆంజనేయుని దేవాలయాలే నిర్మించబడినవి. ఇది అక్షరసత్యం. మహామహిమాన్వితుడైన ఆంజనేయుని ఆలయాలలో ముఖ్యమైనదిగా పేరుగాంచి, పవిత్ర పాపాఘ్నినది…