అంతంత మాత్రమే రవాణ సౌకర్యమున్న మారుమూల కుగ్రామంలో జన్మించి ఆ కాలంలోనే ఉన్నత చదువులుచదివి ఉన్నత స్థాయికి చేరుకొని సౌమ్యుడు గా పేదల పక్షపాతి గా పేరుగడించారు.రైతుల సమస్యలపై , రాయలసీమ సమస్యలపై తనదైన శైలిలో పోరాటం సాగించారు. యువకుల్లో నవచైతన్యం నింపారు. ప్రజాచైతన్యం కోసం తన కలాన్ని కదిలించారు. పాత్రికేయులు గా పనిచేశారు. హిందూపురం పార్లమెంట్ మెట్ట మెదటి పార్లమెంట్ సభ్యులు గా ఎన్నికయ్యారు.కదిరి గళాన్ని డిల్లీలో వినిపించిన మొదటి వ్యక్తి కడపల వెంకటరామకృష్ణారెడ్డి. కె.వి.రామకృష్ణారెడ్డి…