Pic source emesco books HRK కవి , రచయిత , పాత్రికేయులు . ప్రజా ఉద్యమాలని , సాహిత్యాన్ని జీవితంగా చేసుకున్న తరంలో ఒకరు . స్వస్థలం కర్నూలు జిల్లా , విప్లవోద్యమంలో పన్నెండేళ్లు పని చేసి రెండేళ్లు జైలు జీవితం అనుభవించారు . విరసంలో చరుకుగా పని చేశారు . ఆ తర్వాత పాత్రికేయునిగా ప్రస్థానం . ఈనాడు దినపత్రికలో కీలక బాధ్యతలు పోషించి స్వచ్ఛంద విరమణ పొందారు . ఒక్కొక్కరాత్రి , నకులుని…
Tag: కవి
సాహితీమూర్తికల్లూరు అహోబలరావు-kalluru ahobalarao
ప్రతి భారతీయుడూ ఏదో ఒకవిధంగా భారతమాత దాస్యశృంఖలాలను తెగగొట్టడానికి ఎంతో కొంత ప్రయత్నించారు. ఈ పోరాటంలో కవులు, రచయితల పాత్ర కూడా ఉదాత్తమైందే. అప్పట్లో ఏ ప్రాంత కవులు ఆ ప్రాంత స్వాతంత్య్ర సమర సంఘటనలకు ప్రాధాన్యమిచ్చి, తమ అక్షరయజ్ఞం కొనసాగించారు. కవులు ఉత్తేజితులై ఉద్యమాలకు తమ రచనలతో ఊపిరిపోశారు.సాహితీమూర్తులు స్వాతంత్య్రోద్యమాన్ని అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ ఆవిష్కరించారు. తెలుగునాట అన్ని మారుమూలల నుంచి కూడా ఈ స్వాతంత్య్రోద్యమ కవితా స్రవంతి చైతన్యవంతంగా,ప్రబోధాత్మకంగా పోరాటపటిమను ప్రేరేపిస్తూ సాగింది. కవి…
జి.వెంకటకృష్ణ- venkatakrishna
జి.వెంకటకృష్ణ కథకులు, కవి, విమర్శకులుగా ప్రసిద్ధులు. ఏది రాసినా మనసు పెట్టి రాస్తారు. నిజాయితీ నిక్కచ్చితనం ఆయన సొంతం. రాయలసీమ రచయితగా బహుజనుడిగా ఆయన రచనకు మాటకు ఎంతో విలువుంది.అనంతపురం జిల్లాలో బూడిదగడ్డపల్లె (గోరంట్ల మండలం) లో పుట్టారు. హైస్కూల్, (బెస్తరపల్లి కంబదూరు మండలం) ఇంటర్, కళ్యాణదుర్గంలోనూ చదివారు. డిగ్రీ బెంగళూరులో బెంగళూరు యూనివర్సిటీ, ఎం.ఏ. ఎం.ఫిల్ (చరిత్రలో) శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురంలో చదివారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా చేరి యిప్పుడు…