విస్కోసిటి సృష్టించిన కళాకోవిదుడు పద్మశ్రీ కృష్ణారెడ్డి_master printmaker krishna reddy.

చతుషష్టికళల్లో చిత్రకళ ఒకటి ! ఇది దృశ్యకళ ! ఆలోచనకు నైపుణ్యాన్ని జోడించి ఒక అర్థాన్ని అందించే ఈ కళ అందరికి సాధ్యం కాదు. మనిషి ఆశాజీవి ! ఈ క్రమంలో ప్రాచీన కాలం నుండి తన దైనందిక జీవితంలో సంతోషాన్ని కొత్తదనాన్ని వెదుక్కుంటూ అందుకు వివిధ మార్గాలను అనుసరించాడు. వీటిలో కొన్ని ప్రయోజనం ఆశించి కొనసాగించాడు. మరి కొన్ని సౌందర్యదృష్టితో కొనసాగించాడు. ఈ నేపథ్యంలో చిత్రకళ అనేది ప్రయోజనాన్ని అందిస్తూనే సౌందర్యాన్ని కూడా ఒలికిస్తున్న కళ…