కొండారెడ్డి బురుజు నిర్మించిందెవరు ? Kondareddy buruju.

రాయలసీమ ముఖద్వారం……చరిత్రకు నిలువెత్తు దర్పణం….చారిత్రక నిర్మాణ వారసత్వం…..కొండారెడ్డి బురుజు…! ఈ బురుజు చాలా సినిమాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకించి కథానాయకుడు తన పొగరును పౌరుషాన్ని చూపెడుతూ తొడగొట్టి సవాల్ చేయాలి అంటే అందుకు కొండారెడ్డి బురుజు అడ్డా కావలసిందే. అప్పుడే సీన్ పండుతుంది. సినిమా జయాపజయాల మీద ప్రభావం చూపిస్తున్న ఈ బురుజుని ఎప్పుడు ఎవ్వరు నిర్మించారు అని చెప్పడానికి కచ్చితమైన శాసనాలు…లిఖిత ఆధారాలు లభ్యం కావడం లేదు.పరిశోధకులు నేటికిని అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ బురుజు నిర్మాణం విషయమై…

సీమ చారిత్రక గేయాలు విన్నారా?Seema geyalu.

బుడ్డావెంగళరెడ్డి               మానవసేవే మాధవసేవగా భావించి కరువు కాటకాలు సంభవించినపుడు సాటివారికి తన సర్వస్వాన్ని ధారపోసిన దానకర్ణుల పైన జానపదులు భక్తి ప్రపత్తులతో పాటలు పాడుకుంటారు. రాయలసీమలో వెంగళరెడ్డి, సుద్దపల్లి లక్షుమ్మ, సుద్దపల్లి రామచంద్రారెడ్డి, యాదళ్ళ నాగమ్మ, చిన్న అండూరి మొదలైన వారు దానకర్ణులుగా ప్రసిద్ధి పొందారు. వీరి దాతృత్వాన్ని ప్రశంసించ కథాగానాలున్నాయి. ఈ కథా గానాల్లో బుద్దా వెంగళరెడ్డి గేయం ప్రశస్తమైనది. ఈ కథాగానానికున్న వ్యాప్తి సీమలో మరి ఏ ఇతర గానానికి లేదు. రాయలసీమ జిల్లాలలో…

తొలి తెలుగు పదం పుట్టింది ఎక్కడో తెలుసా ? First telugu word .

           ‌                    తొలి తెలుగు పదం కర్నూలు జిల్లాలో లభించడం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మలుపు.కందెనవోలు చరిత్ర తెలుగు సాహిత్య చరిత్రలోనే సువర్ణాక్షరాలుగా లిఖించదగ్గది. దీనికి కారణం లేకపోలేదు. ప్రపంచంలోనే తొలి తెలుగుపదం ' అన్ ధిర లోహము ' అనగా ఆంధ్రలోకము అనే పదం కర్నూలు జిల్లా కన్నమడకలలో లభించినది. ఇది అత్యంత ప్రాచీన శాసనంగా గుర్తించారు. తొలి తెలుగుపదం ' నాగబు ' అని నిర్ధారించినప్పటికీ అంతకుముందే ' ఆంధ్రలోకము ' అనే…

కుందేరు,కుందూనది_kundu river

కుందేరు - కుందూ ను సంస్కృతంలో కుముద్వతి అంటారు. కుముద్వతి అంటే తెల్ల కలువ తీగ - సీతారాముల కుమారుడు కుశుడి భార్య పేరు కూడా కుముద్వతి. కర్నూలు జిల్లాలో సున్నపు నేలల మీదుగా ప్రవహించటం వల్ల తెల్లగా ఉన్న నీటి వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతమే రేనాటి సీమ.   కుందేరు కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రమల కనుమలలో పుట్టి దక్షిణ దిశలో ప్రవహించి వైఎస్ఆర్ కడపజిల్లా , కమలాపురం  సమీపంలో పెన్నా నదిలో కలుస్తుంది.…

సీమ సాహితి’, సామాజిక స్ఫూర్తి – పాండురంగారెడ్డి.-pandurangareddy

Pandurangareddy రాయలసీమ ప్రాంత సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలలో ఉపాధ్యాయ రంగం, పత్రికా రంగం, వామపక్ష భావజాల నేపథ్యంగా వచ్చి పనిచేసిన అనేకమంది గత దశాబ్దాల కాలంగా చూశాం. అలాంటి వారిలో వైవిధ్యమైన వ్యక్తిగా, కాదు శక్తిగా బి.పాండురంగారెడ్డి సీమ చరిత్రపుటలలో నిలుస్తారు. ప్రగతిశీల భావాజాలంతో వివిధ సంఘాలలో పని చేయడంతోనే ఆగి పోకుండా ఒక నిర్దిష్ట ప్రాంత వెనుకబాటుతనం పై గళమెత్తాడు.సీమ సమకాలీన ఉద్యమాలలో క్రియాశీలకంగా పని చేసాడు. అన్నింటికీ మించి సీమ సాహిత్య ఉద్యమానికి సీమ…

మ్యాప్ చెప్పే సీమ చరిత్ర- Rayalaseema map

1840ల నాటి ఈ రాయలసీమ మ్యాప్ ద్వారా ఎన్నో చారిత్రక విషయాలు 1840 map సీడెడ్ డిస్ట్రిక్ట్స్ - 1928లో రాయలసీమ అనే పేరు పెట్టకముందు వరకు ఈ ప్రాంతాన్ని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లేదా దత్త మండలాలు అని పిలిచేవారు2.రెండు జిల్లాలు - చిత్రంలో కేవలం బళ్లారి మరియు కడప జిల్లాలు మాత్రమే కనిపిస్తాయి. అప్పటికి కర్నూలు పూర్తి జిల్లాగా ఏర్పడలేదు. అనంతపురం బళ్లారి జిల్లాలో భాగం మరియు చిత్తూరు ఆర్కాటు రాజ్యంలో ఉండేది.కడప జిల్లా -…