కోదండ రామాలయం, ఒంటిమిట్ట

కోదండ రామాలయం, ఒంటిమిట్ట Ontimitta kodandaramaswami temple ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. దీనిని 16వ శతాబ్దం లో చోళులు నిర్మించారు.విజయనగర రాజులు,మట్లిరాజులు, అభివృద్ధి చేశారు.ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ…