ఏలపదాలు – ఒక పరిచయం-janapadageyalu

రచన :–దస్తగిరి--- ‘ భారతి ‘ మాసపత్రిక జూన్ 1982 ఏలపదాలు జానపద సాహిత్యానికి సంబంధించిన ఒక రూప వైవిధ్యం. ఈ పదాల సృష్టీ, గానమూ ‘ కవిల ’ తోలేటప్పుడే జరుగుతుంది కనుక, వీటిని ‘ కవిల ‘ పాటలని కూడా అంటారు. సేద్యం చేసేటప్పుడు, బండి తోలేటప్పుడుకూడా వీటిని పాడుతుంటారు. దాదాపు యివన్నీ రెండులైన్ల పదాలే. కవిలిబానను బావిలో ముంచుతారు. మునిగిన బానను పైకి తెచ్చి కాలువలో గుమ్మరిస్తారు.ఇవి రెండు చర్యలు. బానను ముంచాటానికి…