Inscriptions రేనాటి చోళులు కడపవాసులే రేనాటి చోళులు కడప జిల్లా వాసులేనని, రేనాటి ధనుంజయుడి తొలి రాజధాని ఎరికల్ అయి ఉండొచ్చునని శిలాశాసనాల ద్వారా పరిశోధకులు నిర్ధరణకు వచ్చారు. ఎరికల్ పదం కాలక్రమేణా ఎరికల్లు, ఎరిగల్లు, ఎరికాల్వ, ఎరిగల్గా రూపాంతరం చెంది ఎర్రగుడి (ఎర్రని ఇటుకలతో నిర్మించిన పాత గుడి)గా మారిందని తెలిపారు. ఎర్రగుడి ప్రస్తుతం కమలాపురంలో ఉంది. రేనాటి చోళులు కర్ణాటకలోని నిడుగల్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారన్న గత అంచనాలకు భిన్నంగా తాజా శాసనాలు సూచిస్తున్నాయని…