🎼 సంగీత, సాహిత్య సౌరభాల “రాళ్లపల్లి” జయంతి నేడు.Rallapalli✒️

రాళ్లపల్లి అనంతకష్ణ శర్మ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా (నేటి కంబదూరు మండలం)లోని రాళ్లపల్లిలో 1893 జనవరి 23న జన్మించారు. తల్లి అలమేలు మంగమ్మ వద్ద సంగీతం, తండ్రి కృష్ణమాచార్యుల వద్ద సంస్కృతాంధ్ర కావ్యాలు నేర్చారు. ఆయన తల్లి అలివేలు మంగమ్మ సంగీత గురువులు. ఆమె సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళ భాషలలోని భజన కీర్తనలు, పెళ్ళి పాటలు, జోలపాటలు, పూజ పాటలు కథా గేయాలు చిన్ననాడే శర్మగారికి నేర్పింది. మేనమామ గారి ప్రోత్సాహంతో ఫిడేలు వాయించడం…