నేటి యక్షగానంలో ఇతరులు పాడుతుంటారు.పాటకు అనుకూలంగా కొందరు ఆడుతారు కథను నడిపే విధానం ముచ్చటగా ఉంటుంది. తోలుబొమ్మలాలు కూడా యింతే. కథను పాటగా పాడుతుం టారు మాటలు చెపుతూ నడుపుతారు పాత్రలకు ప్రత్యేక పాటలుంటాయి. తేడా అల్లా ఒక విషయంలోనే ఉంటుంది. యక్షగానంలో మనుషులు ఆడతారు. తోలు బొమ్మలాటలో బొమ్మలను ఆడిస్తారు. రెంటినీ పోల్చి చూచినపుడు కథనుచెప్పే విధానము ఒకటి గానే ఉంటుంది. ఈనాడు జక్కుల వారు చేసేనృత్యాలు కన్పించవు. కాని యక్షగానాలు చాలా మంది ఆడుతున్నారు.'జక్కులవారి…