కె.వి.రెడ్డి సినీ ప్రస్థానం. Kvreddy

తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో పలు విజయవంతమైన, విమర్శకులు ఆణిముత్యాలుగా అభివర్ణించిన పలు సినిమాలు తీసిన దర్శకుడు. అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. దర్శకునిగా దాదాపు మూడు దశాబ్దాల కాలం పనిచేశాడు.అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీపంలో తేళ్ళమిట్ట పల్లెలో 1912 జూలై 1న కె.వి.రెడ్డి జన్మించాడు. అతని పూర్తి పేరు కదిరి వెంకట రెడ్డి.…

పి.యస్. రామకృష్ణారావు సినీ జీవితం.p.s.ramakrishanarao

రామకృష్ణారావు 1918, అక్టోబర్ 12 న కర్నూలులో జన్మించాడు. తన చదువులను మధ్యలోనే నిలిపివేసి 1936లో వేల్ పిక్చర్స్ సంస్థలో సహాయ ఎడిటర్‌గా సినీ రంగంలో ప్రవేశించాడు. 1939లో హెచ్.ఎం.రెడ్డి సినిమా మాతృభూమితో స్వతంత్ర ఎడిటర్ గా మారాడు. ఆ తరువాత స్టార్ పిక్చర్స్ సంస్థలో హెచ్.ఎం.రెడ్డి, హెచ్.వి.బాబు ల వద్ద సహాయదర్శకునిగా పనిచేశాడు.హెచ్.వి.బాబు దర్శకత్వం వహించిన కృష్ణప్రేమ చిత్రానికి సహకార దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణకు, అందులో కథానాయిక భానుమతికి పరిచయం పెరిగి, అది ప్రణయంగా మారి…

🎧🎤 స్వరరాగ గంగా ప్రవాహం జిక్కీ 🎼🎶 jikki

జిక్కీ పాట పరవశంలో తేలియాడే ప్రతి నిమిషం ఆనందంగా గడిచిపోతుంది. ప్రతి మనిషి ఏదో ఒకపాట ఏదో ఒక సందర్భంలో పులకించేలా చేసి ఉంటుంది, పరవిశించి ఉంటాడు. అదే పాట గొప్పతనం. పాట పాడి పదిమందినీ మెప్పించటం ఏమీ చిన్న విషయం కాదు. అందుకు పడే శ్రమ వినేవారికంటే పాడేవారికే ఎక్కువ. గాయనీగాయకులు గళం నుంచి సుతిమెత్తగా జాలువారే సుస్వరాల గంగాఝరి. అలనాటి మధురగీతాలు ఇప్పటి తరాన్నీ మైమరిపింప చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. రాత్రి వేళ…నిశబ్దాన్ని మీటుతూ…

టిటిడి, సినీరంగానికి సేవలందించిన బి.నాగిరెడ్డి.నేడు వర్ధంతి. B.Nagi reddy.

బొమ్మిరెడ్డి నాగిరెడ్డి ప్రఖ్యాత సినిమా నిర్మాత. ఈయనను బి.నాగిరెడ్డి అని పిలుస్తారు. ఉత్తమ కళాత్మక విలువలను వ్యాపారానికి జోడించి మంచి సినిమాలు తీసిన నిర్మాత. బి.యన్.రెడ్డి కడప జిల్లాలోని ప్రొద్దుటూరు వద్ద పొట్టిపాడు గ్రామంలో అమ్మమ్మ వారింట్లో 02-12-1912న జన్మించాడు. ఈయన స్వస్థలం, సింహాద్రిపురం మండలంలోని ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై.కొత్తపల్లె) గ్రామం. బి.నాగిరెడ్డి అన్న బియన్ రెడ్డి. తండ్రి నరసింహారెడ్డి ఎర్రగడ్డలను(ఉల్లిపాయలు) విదేశాలకు ఎగుమతి చేసేవాడు. బి నాగిరెడ్డి1950లో చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించాడు.షావుకారు చలన చిత్రం…

22మందికి సినీ అవకాశం కల్పించిన నటీమణి పసుపులేటి కన్నాంబ -kannambha

నిలువెత్తు విగ్రహంతో, మరువలేని అద్భుతమైన, విస్పష్టమైన వాచకంతో,అద్భుతమైన నటనా పటిమతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అందాల నటీమణి కన్నాంబ. కన్నాంబ ప్రసిద్ద రంగస్థల నటి, గాయని. చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ. కన్నాంబ 5 అక్టోబర్‌ 1911 న కడప పట్టణంలో జన్మించింది. ఆమె తండ్రి వెంకట నరసయ్య, తల్లి లోకాంబ. తండ్రి కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండేవారు. వారికి కన్నాంబ ఒక్కటే కూతురు. కన్నాంబ ఎక్కువ కాలం వాళ్ల అమ్మమ్మగారింటఏలూరులోనే…

బహుముఖ ప్రజ్ఞాశాలి టి.జి.కమలాదేవి-kamaladevi

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఆమె బాల్యం నుంచే నటనలో అధ్బుతమైన ప్రతిభ ను కనపరిచింది. ఆమె నటనకే పరిమితము కాలేదు. సినీ గాయని గా, క్రీడాకారిణి గా, రంగస్థల నటి గా, రేడియో గాయని గా అనేక రంగాల్లో పేరు గడిచింది. కమలాదేవి అందం అభినయం శ్రావ్యమైన గొంతు ఆమె సొంతం. ఆమె తన గానంతో,నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను మైమరపించింది. రంగస్థలం, చిత్రసీమ, ఆకాశవాణి, క్రీడారంగం వంటి నాలుగు మాధ్యమాల్లో నిలదొక్కుకున్న వ్యక్తి కమాలదేవి.…

రాజశేఖర్ కు అడ్డు చెప్పిన జీవిత- Jeevitha Indian actress

Jeevitha ఆశ్లీలతకు చోటు లేకుండా చక్కటి అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందమైన అలంకరణ తో కన్పిస్తుంది. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం ఈ పాట వినగానే జీవిత రాజశేఖర్ గుర్తుకొస్తారు. అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం అంటూ రాజశేఖర్ తెగ ముచ్చటగా చెబుతాడు. ఇలా చిత్రాల్లో ప్రేమ లో పడ్డ ఈ జంటకు నిజ జీవితం లో పెళ్లి చేసుకోవడానికి కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారు. తర్వాత ఆదర్శ జంటగా…

తొలి తరం కథానాయకుడుఉమామహేశ్వరరావు-Umamheswararao

సినిమాల్లో నటించాలని ఆరాటపడి చాలా డబ్బు ఖర్చు చేసి తన కోరిక తీర్చుకొన్నాడు. మంచి నటుడు గా గుర్తింపు పొందినప్పటికి ఎక్కువ కాలం సినిమా రంగంలో ఉండలేక పొయారు. వెల్లాల ఉమామహేశ్వరరావు తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. కడప జిల్లాకు చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది, రంగస్థల నటుడు, రచయిత, నాటకకర్త, ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. "లేపాక్షి" అనే పేరుతో డాక్యుమెంటరీ నిర్మించాడు. వెల్లాల ఉమామహేశ్వరరావు1912, ఆగష్టు 30 న…

బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి సినిమా దర్శకుడు-B.N.Reddy film director.

బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు నిర్మాత. ఈయనను బి.యన్.రెడ్డి అని పిలుస్తారు. ఉత్తమ కళాత్మక విలువలను వ్యాపారానికి జోడించి మంచి సినిమాలు తీసిన దర్శకుడు. బి.యన్.రెడ్డి కడప జిల్లాలోని పులివెందులలోని కొత్తపల్లి గ్రామంలో లో 16.11.1908న జన్మించాడు. వీరి తండ్రి నరసింహారెడ్డి ఎర్రగడ్డలను(ఉల్లిపాయలు) విదేశాలకు చేసేవాడు. బి.యన్.రెడ్డి1927లో చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించాడు.1928 లో వాహిని పిక్చర్స్ స్థాపించి దేశభక్తిని ప్రభోదించే వందేమాతరం సినిమాలు తీశారు. 1951లో మల్లేశ్వరి సినిమాను ఎన్టీ రామారావు భానుమతిలను…

బాలసుబ్రహ్మణ్యం కు సినిమాలో పాడే చాన్స్ ఇచ్చిందెవరో తెలుసా- Actor Padmanabham

Padmanabham పద్మనాభంప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. ఈయన 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా (ఇప్పటి వై యస్సార్ జిల్లా) పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు.ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి…