రాయలసీమ  దళిత జీవితం, సాహిత్యం

                చాతుర్వర్ణ  హిందూమత వ్యవస్థలో ఏ స్థాయిలోనూ చోటులేక సాంఘిక జీవన చట్రం చివరి అంచులకు నెట్టబడి వెలిగా జీవించవలసిందిగా నిర్దేశింపబడిన వాళ్లు దళితులు. అంబేద్కరిజం పునాదిగా దళితవాదం రూపు దిద్దుకొంది.కులాన్ని కేవలం ఒక సాంఘిక విషయంగా కాక ఒక రాజకీయ ఆర్థిక దళిత వాదంలో ప్రధానమైంది దళిత అణచివేత రాజకీయాలు ప్రాతిపదికగా దళిత సాహిత్యం వచ్చింది               రాష్ట్రంలో దళిత ఉద్యమం దశదిశలా వ్యాపించినప్పటికీ, రాయలసీమలో  మాత్రం ఆ ఉద్యమం తలెత్తడం, విస్తరించడం. దళిత చైతన్యం పెరగడం వంటి…

చిత్తూరు జిల్లా – వందేళ్ళ కథా సారథులు-chitoor jilla vandella katha sardhulu.

చిత్తూరు జిల్లాలో ఆధునిక కథానికకు ఆద్యుడు పి.రాజగోపాలు నాయుడు.ఆయన కథకులుగానే కాక ఆధునిక సాహిత్య ఒరవడికి తెరతీసిన వ్యక్తి. నాటకాలు , వ్యాసాలు , కథలు , నవలలు  ఎక్కువగా వ్రాయడమేకాక విమర్శనా గ్రంథాలు వెలువరించిన వ్యక్తిగా కూడా వారికి మంచి గుర్తింపు వుంది .  చిత్తూరు జిల్లా నడిబొడ్డున ఒక రాజకీయ పాఠశాలను నడిపారు.  చిత్తూరు జిల్లా కళాపరిషత్ ను ఏర్పాటు చెయ్యడం ద్వారా జిల్లా యువకులలో చైతన్యవంత మైన కదలికను తీసుకువచ్చి ఎందరినో కథకులుగా…

సీమ చారిత్రక గేయాలు విన్నారా?Seema geyalu.

బుడ్డావెంగళరెడ్డి               మానవసేవే మాధవసేవగా భావించి కరువు కాటకాలు సంభవించినపుడు సాటివారికి తన సర్వస్వాన్ని ధారపోసిన దానకర్ణుల పైన జానపదులు భక్తి ప్రపత్తులతో పాటలు పాడుకుంటారు. రాయలసీమలో వెంగళరెడ్డి, సుద్దపల్లి లక్షుమ్మ, సుద్దపల్లి రామచంద్రారెడ్డి, యాదళ్ళ నాగమ్మ, చిన్న అండూరి మొదలైన వారు దానకర్ణులుగా ప్రసిద్ధి పొందారు. వీరి దాతృత్వాన్ని ప్రశంసించ కథాగానాలున్నాయి. ఈ కథా గానాల్లో బుద్దా వెంగళరెడ్డి గేయం ప్రశస్తమైనది. ఈ కథాగానానికున్న వ్యాప్తి సీమలో మరి ఏ ఇతర గానానికి లేదు. రాయలసీమ జిల్లాలలో…

తొలి తెలుగు పదం పుట్టింది ఎక్కడో తెలుసా ? First telugu word .

           ‌                    తొలి తెలుగు పదం కర్నూలు జిల్లాలో లభించడం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మలుపు.కందెనవోలు చరిత్ర తెలుగు సాహిత్య చరిత్రలోనే సువర్ణాక్షరాలుగా లిఖించదగ్గది. దీనికి కారణం లేకపోలేదు. ప్రపంచంలోనే తొలి తెలుగుపదం ' అన్ ధిర లోహము ' అనగా ఆంధ్రలోకము అనే పదం కర్నూలు జిల్లా కన్నమడకలలో లభించినది. ఇది అత్యంత ప్రాచీన శాసనంగా గుర్తించారు. తొలి తెలుగుపదం ' నాగబు ' అని నిర్ధారించినప్పటికీ అంతకుముందే ' ఆంధ్రలోకము ' అనే…

రాయలసీమ  దళిత జీవితం, సాహిత్యం

                చాతుర్వర్ణ  హిందూమత వ్యవస్థలో ఏ స్థాయిలోనూ చోటులేక సాంఘిక జీవన చట్రం చివరి అంచులకు నెట్టబడి వెలిగా జీవించవలసిందిగా నిర్దేశింపబడిన వాళ్లు దళితులు. అంబేద్కరిజం పునాదిగా దళితవాదం రూపు దిద్దుకొంది.కులాన్ని కేవలం ఒక సాంఘిక విషయంగా కాక ఒక రాజకీయ ఆర్థిక దళిత వాదంలో ప్రధానమైంది దళిత అణచివేత రాజకీయాలు ప్రాతిపదికగా దళిత సాహిత్యం వచ్చింది.               రాష్ట్రంలో దళిత ఉద్యమం దశదిశలా వ్యాపించినప్పటికీ, రాయలసీమలో  మాత్రం ఆ ఉద్యమం తలెత్తడం, విస్తరించడం. దళిత చైతన్యం పెరగడం వంటి…

రాయలసీమ నుండి వచ్చిన మొట్టమొదటి దళిత కథ ‘ చిరంజీవి ‘కథ-chiranjeevi katha.

   గుత్తి రామకృష్ణ        గుత్తి రామకృష్ణ రాసిన 'చిరంజీవి'కథ సాధన పత్రికలో 1941 మార్చి 26 సంచికలో ప్రచురించబడింది.ఇది రాయలసీమలో మొట్టమొదటి దళిత కథ.అగ్రవర్ణ వ్యవసాయదారులు  దళితులకు అప్పులిచ్చి వడ్డీ మీద వడ్డీలు లెక్కలు కట్టి వాళ్ళతో వంశపారంపర్యంగా వెట్టి చాకిరీ చేయించుకొనే భూస్వామ్య దుర్మార్గాన్ని ఈ కథ బట్టబయలు చేస్తుంది . దళితులకు  స్వంత జీవితమే లేకుండా చేసిన సాంఘిక , ఆర్థిక పరిస్థితుల్ని ఈ కథ చిత్రించింది .               వెంకటరాముని ముత్తాత తన పెండ్లికి రెడ్డి…