వేణునాదం పుస్తక సమీక్ష పార్ట్ 2 డా|| ప్రభల జానకి – Nagasuri.

నార్ల వారంటే ఆరాధనవెతికి వెతికి సంపాదించిన 'నార్ల' వారి వ్యాసాలను కుట్టి దాచుకున్న పుస్తకం ఈనాటికీ తన వద్ద ఉందని మురిపెంగా నాగసూరి గారు చెబుతారు.''కమలాక్షి - చూపులు కాకి చూపులు'' ''పేరు గంగా భవాని - తాగుబోతే నీటి చుక్కలేదు''. అంటూ నార్ల వారి హెడ్డింగులకు ఆకర్షణ అధికం కదా! ఈ వ్యాసాల్లో చాలా భాగం ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీలను విమర్శించినా, జయప్రకాష్‌ నారాయణ, సునీల్‌ కుమార్‌ ఛటర్జీల మొదలైన విలువైన అంశాలు చాలానే ఉన్నాయంటారు. వీటితో…

వేణునాదం పుస్తక సమీక్ష డా|| ప్రభల జానకి – Nagasuri.

వేణునాదంలో జీవనరాగ వైవిధ్యం. రాయలసీమ లోని ఓ మారుమూల కుగ్రామం లో జన్మించి జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూసి ఆకాశవాణి లో ఉన్నతస్థాయి ఉద్యోగం నిర్వహిస్తున్నారు. ఆయన జీవిత మజిలీలు వివరిస్తూ రాసిన వేణునాదం పై సమీక్ష. కరోనా అందించిన ఆశించని విశ్రాంతి అక్షరం మీద ప్రేమతో దాచుకున్న అనేక వ్యాసాలను తిరిగి చదువుకొనే అవకాశం కల్పించింది. 2013 ప్రాంతంలో ఆంధ్రప్రభ ఆదివార సంచికలలో 'ముద్ర' పేరున నాగసూరి వేణుగోపాల్‌ గారి నాలుగైదు సమీక్ష, వ్యాసాలను…

గాంధేయమే జాతికి దారి దీపం

అతడు విడిచిన బాణం - గాంధేయం అది బౌద్ధ రేఖల సమాహారం అహింసకు ప్రతిరూపం మానవాళికెప్పుడూ అది శిరోధార్యం. మిన్ను విరిగి మీద పడినా చలించని ధీరత్వానికి ప్రతీకతను. అదే నేడు సత్యాగ్రహమై నిలిచింది. నమ్మిన సత్యానికి బలైనవాడు మతోన్మాదుల గుండెలకు సింహస్వప్నమై నిలిచిన వాడు జాతీయ జెండా నిండుగా రెపరెపలాడుతోంది జనగనమణ గీతంలో ప్రతిజ్ఞా సారంలో అక్షరమై నిలిచింది ఆయనే నేటి సమాజానికి ఆదర్శం. విలువలు అఘాతంలోకి పడిపోతున్న వేళ అతని కర్రే మనకు ఆలంబన…

సాహిత్యంలో శాస్త్రీయభావాలు

Thinking scientifically “ఏది సత్యం ఏదసత్యంఓ మహాత్మా ఓ మహర్షి" అని శ్రీశ్రీ ప్రశ్నించాడు. మరి ఆ సత్యాన్ని తెలియజేసేదేమిటి ? సైన్సు. సైన్సు అంటే శాస్త్రం.ప్రతి రోజు టీవీల్లో జ్యోతిష్యశాస్త్రం, హస్త సాముద్రిక శాస్త్రం ఇలా చెప్పింది, అలా చెప్పింది అనిచెబుతుంటారు. చాలా మంది అవి కూడా సైన్సే అనే భావించే అవకాశం ఉంది.సైన్సు ఆధునిక పరిణామం. పందొమ్మిదో శతాబ్దం వరకు సైన్సును తత్వశాస్త్రంలో భాగంగా చూశారు.అంతకుముందు కనుగొన్న సత్యాలను పందొమ్మిది శతాబ్దంలో విడదీసి వాటిని…

విమర్శకుని బాట

Srujana nedu,27.12.2020 సమాజంలో వున్న అనేక రుగ్మతలను చూసో, సమాజం ఇలా వుండకూడదని భావించో, సమాజాన్ని ప్రతిఫలించాలనో రచయిత రచన చేస్తాడు. ఆ రచనను చదివిన పాఠకునికి సమాజాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలవుతుంది.సాహిత్యం సమాజాన్ని మార్చుతుందా? అని చాలామంది అడుగుతుంటారు. వాస్తవానికి సాహిత్యం, సామాజిక మార్పు పరస్పర సంబంధం కలిగి వుంటాయి. దీని గుర్తించిన బుద్ధుడు తన ధర్మాలను కథల రూపంలో వివరించే ప్రయత్నం చేశాడు.అలాగే ఇలాంటి ప్రయోజనం కోసమే పంచతంత్ర కథలు,ఈసప్ కథలు…

కథా కాహళి కె.సుభాషిణి కథలు-    K.Subhashini

                                                    సుభాషిణి  పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, కర్నూలులో ఉద్యోగబాధ్యతలు నిర్వ హిస్తున్నారు.  ఈమె రాసిన దాదాపు నలబైఐదు కథలు రెండు సంకలనాలుగా వచ్చాయి. సుభాషిణి కథలలో ప్రధానంగా వస్తువైవిధ్యం మూడు ధోరణులలో కనబడుతుంది. మొదటి  సంపుటి “మర్మమెల్లా గ్రహించితిని తల్లీ” లోని…

రాయలసీమ  దళిత జీవితం, సాహిత్యం

                చాతుర్వర్ణ  హిందూమత వ్యవస్థలో ఏ స్థాయిలోనూ చోటులేక సాంఘిక జీవన చట్రం చివరి అంచులకు నెట్టబడి వెలిగా జీవించవలసిందిగా నిర్దేశింపబడిన వాళ్లు దళితులు. అంబేద్కరిజం పునాదిగా దళితవాదం రూపు దిద్దుకొంది.కులాన్ని కేవలం ఒక సాంఘిక విషయంగా కాక ఒక రాజకీయ ఆర్థిక దళిత వాదంలో ప్రధానమైంది దళిత అణచివేత రాజకీయాలు ప్రాతిపదికగా దళిత సాహిత్యం వచ్చింది               రాష్ట్రంలో దళిత ఉద్యమం దశదిశలా వ్యాపించినప్పటికీ, రాయలసీమలో  మాత్రం ఆ ఉద్యమం తలెత్తడం, విస్తరించడం. దళిత చైతన్యం పెరగడం వంటి…

చిత్తూరు జిల్లా – వందేళ్ళ కథా సారథులు-chitoor jilla vandella katha sardhulu.

చిత్తూరు జిల్లాలో ఆధునిక కథానికకు ఆద్యుడు పి.రాజగోపాలు నాయుడు.ఆయన కథకులుగానే కాక ఆధునిక సాహిత్య ఒరవడికి తెరతీసిన వ్యక్తి. నాటకాలు , వ్యాసాలు , కథలు , నవలలు  ఎక్కువగా వ్రాయడమేకాక విమర్శనా గ్రంథాలు వెలువరించిన వ్యక్తిగా కూడా వారికి మంచి గుర్తింపు వుంది .  చిత్తూరు జిల్లా నడిబొడ్డున ఒక రాజకీయ పాఠశాలను నడిపారు.  చిత్తూరు జిల్లా కళాపరిషత్ ను ఏర్పాటు చెయ్యడం ద్వారా జిల్లా యువకులలో చైతన్యవంత మైన కదలికను తీసుకువచ్చి ఎందరినో కథకులుగా…