డా.కేశవరెడ్డి-Dr Kesava Reddy.

డాక్టర్ పెనుమూరు కేశవరెడ్డి             నవలా రచయిత . తెలుగు నవలా సాహిత్యంలో ప్రముఖ స్థానం సంపాదించు కున్నారు.  స్వస్థలం:చిత్తూరు. జీవితం తెలుగు జిల్లా గడిచింది నవలా . కాని  వైద్య  వృత్తిలో  భాగంగా నిజామాబాద్ డిచ్ పల్లి లో చివరివరకూ జీవితం గడిచింది.  జానపద కథా కథనశైలిలో పల్లీయపదాలను శిష్ట్ల వ్యవహారికాన్నీ కలగలపి ఆయన  కథ  చెప్పే  తీరు పాఠకులకు  విశేషంగా  నచ్చింది . బీర సాగు గురించి దోపిడీ కి గురైన వర్గాల గురించి తాత్త్విక…

విమోచన పత్రిక సంపాదకుడు హెచ్చార్కె-HRK

Pic source emesco books HRK           కవి , రచయిత , పాత్రికేయులు . ప్రజా ఉద్యమాలని , సాహిత్యాన్ని జీవితంగా చేసుకున్న తరంలో ఒకరు . స్వస్థలం కర్నూలు జిల్లా , విప్లవోద్యమంలో పన్నెండేళ్లు పని చేసి  రెండేళ్లు జైలు జీవితం అనుభవించారు . విరసంలో చరుకుగా పని చేశారు . ఆ తర్వాత పాత్రికేయునిగా ప్రస్థానం . ఈనాడు దినపత్రికలో కీలక బాధ్యతలు పోషించి స్వచ్ఛంద విరమణ పొందారు . ఒక్కొక్కరాత్రి , నకులుని…

నిరంతర సాహితీ కృషీవలుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య

Vallampati venkatasubbaiah              సాహిత్యం సమాజాన్ని జాగృతపరుస్తుంది. ప్రభావితం చేస్తుంది! ఉత్తమ సాహిత్యం వల్ల అత్యుత్తమ సమాజం ఆవిష్కృతమవుతుంది. సమాజికపరమైన అన్ని అంశాలమీదా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తన ప్రభావాన్ని చూపే సాహితీవిమర్శకు సాహిత్యంలో  ఓ ప్రత్యేకస్థానం ఉంది.తన హెచ్చరికల ద్వారా సాహిత్యాన్ని పక్కదారులు పట్టనీయకుండా, క్రమపరుస్తూ ఉత్తమ సాహిత్యంగా మలచగలుగుతున్నది విమర్శే! అందువల్ల విమర్శకులు  పరోక్షంగా సాహిత్యాన్ని  చాలా వరకు ప్రభావితం చెయ్యగలుగుతారు.             ఆధునిక సాహిత్య విమర్శకులలో చిత్తూరు జిల్లాలో ముఖ్యులు వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు. డా|| కొత్వాలు…

శశిశ్రీ కి ఆపేరు పెట్టిందెవరో తెలుసా ? -sasisri

      Sasisri              దాదాపు అరవై వసంతాలు నింపుకొని, అస్తమించిన శశిశ్రీ, సాహిత్యా కాశంలోని శశియే! ఈయన అసలు పేరు షేక్ బేపారి రహమతుల్లా.కడప జిల్లా సిద్ధవటం జన్మస్థలం. కార్యక్షేత్రం కడప నగరం.              ఆధునిక కవిగా, జీవితాన్ని దృశ్యీకరించే కథారచయితగా, సీనియర్ జర్నలిస్టుగా మంచి పేరు పొందిన శశిశ్రీ వక్త గా కూడా ప్రసిద్ధుడు.ఈయన గురువు సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు.ఆయనే ఈయనకు ' శశిశ్రీ ' అని నామకరణం చేశారు.శశిశ్రీ చివరి రోజుల్లో తనగురువు గారి జీవిత…

కడప జిల్లా నేపథ్యం కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి-Kethu Viswanatha Reddy.

                Kethu viswanaadhareddi  ‌‌        కేతు విశ్వనాథరెడ్డి  కడప జిల్లాలో యర్రగుంట్ల మండలంలోని రంగశాయిపురం గ్రామంలో జన్మించారు. ఈయన, ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలు తిరిగి, చివరికి కడప గడప చేరారు.తన వ్యక్తిత్వపు మూలాలను, తన కథల మూలాలను కడపజిల్లాలోని పల్లెపట్టుల చరిత్రలో, తెలుగు సామాజిక పరిణామాల్లో నిరంతరం వెదుక్కుంటున్న కథకుడీయన.ఆయన కథలన్నింటికీ దాదాపు మధ్యతరగతి జీవితమే కథా వస్తువు. సీమ ప్రాంత కరువు స్థితిని తెలిపే కథలు కూడా రాశారు. రచయితకు జీవితానుభవంతో…

రాయలసీమ  కరువు పై రాసిన తొలి కథారచయిత ఎవరో తెలుసా?

తొలి దళితకథా రచయిత గుత్తి రామకృష్ణ                                   స్వాతంత్ర్య సమర యోధుడు, అనంతపురం జిల్లా కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరు,జిల్లా తొలిపాత్రికే యుడు , రాయలసీమ కరువు ను చిత్రించిన తొలి కథా రచయిత గుత్తి రామకృష్ణ 1915,జూలై13న అనంతపురం పట్టణంలోని అంబారపు వీధి లోని గుత్తి వెంకటప్ప, నారాయణమ్మ దంపతులకు జన్మించారు.      ఆయన తన  జీవితమంతా  సమాజం కోసం అంకితం చేశారు.ఎంత చేసినా తనకు సంబంధం లేదన్నట్లుగా నిమిత్తమాత్రుడిగా జీవితం గడిపిన ధన్యజీవాయన.     ఆయన  బోర్డు…

సాహితీమూర్తికల్లూరు అహోబలరావు-kalluru ahobalarao

ప్రతి భారతీయుడూ ఏదో ఒకవిధంగా భారతమాత దాస్యశృంఖలాలను తెగగొట్టడానికి ఎంతో కొంత ప్రయత్నించారు. ఈ పోరాటంలో కవులు, రచయితల పాత్ర కూడా ఉదాత్తమైందే. అప్పట్లో ఏ ప్రాంత కవులు ఆ ప్రాంత స్వాతంత్య్ర సమర సంఘటనలకు ప్రాధాన్యమిచ్చి, తమ అక్షరయజ్ఞం కొనసాగించారు. కవులు ఉత్తేజితులై ఉద్యమాలకు తమ రచనలతో ఊపిరిపోశారు.సాహితీమూర్తులు స్వాతంత్య్రోద్యమాన్ని అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ ఆవిష్కరించారు. తెలుగునాట అన్ని మారుమూలల నుంచి కూడా ఈ స్వాతంత్య్రోద్యమ కవితా స్రవంతి చైతన్యవంతంగా,ప్రబోధాత్మకంగా పోరాటపటిమను ప్రేరేపిస్తూ సాగింది. కవి…

అక్షరాల్లో ఆత్మను ఆవిష్కరించిన ప్రజాకవి!తరిమెల అమరనాథ్ రెడ్డి-Tarimala Amarnathareddy

"కవిత్వం దృశ్య వస్తువుల్లో అదృశ్య వస్తువుల్ని చూసే నేత్ర విద్య"అన్నారు శేషేంద్ర శర్మ.అలాంటి దృశ్య వస్తువుల్లో అదృశ్య వస్తువులను చూసి అనితరసాధ్యంగా స్పందించిన నిఖార్సయిన కవి,నిబద్ధత కలిగిన సంఘసేవకులు,తరిమెల అమరనాథ్ రెడ్డి.ఆయన మాట్లాడితే కవిత్వం జలజలా పూలు రాలినట్టుంటుంది.ఆయన మాండలిక భాషపలికితే గలగలా సెలయేరు పారినట్టుంటుంది.ఆయన నవ్వితే హాస్యం వెన్నెల కురిసినట్టుంటుంది.ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు ,ప్రజల మనిషి తరిమెల నాగిరెడ్డి ఆశయాలను పుణికిపుచ్చుకున్న తరిమెల అమరనాథ్ రెడ్డి అనంతపురంలో మానవతా రక్తదాతల సంస్థను స్థాపించి పేద ప్రజలకు…

జి.వెంకటకృష్ణ- venkatakrishna

జి.వెంకటకృష్ణ కథకులు, కవి, విమర్శకులుగా ప్రసిద్ధులు. ఏది రాసినా మనసు పెట్టి రాస్తారు. నిజాయితీ నిక్కచ్చితనం ఆయన సొంతం. రాయలసీమ రచయితగా బహుజనుడిగా ఆయన రచనకు మాటకు ఎంతో విలువుంది.అనంతపురం జిల్లాలో బూడిదగడ్డపల్లె (గోరంట్ల మండలం) లో పుట్టారు. హైస్కూల్, (బెస్తరపల్లి కంబదూరు మండలం) ఇంటర్, కళ్యాణదుర్గంలోనూ చదివారు. డిగ్రీ బెంగళూరులో బెంగళూరు యూనివర్సిటీ, ఎం.ఏ. ఎం.ఫిల్ (చరిత్రలో) శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురంలో చదివారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా చేరి యిప్పుడు…

నేటివిటీ సొబగు ను పొదివిపట్టుకొని కవిత్వరచన సాగిస్తున్న పల్లిపట్టు నాగరాజు-Nagaraju Pallipattu

Pallipattu Nagaraju పల్లిపట్టు నాగరాజు కవితలన్నింటినీ కవిసంగమం లో ఫాలో  అవుతున్నాను  దగ్గరగా. యువకవుల్లో రాష్ట్రస్థాయిలో  ప్రతిభా వంతుడైన కవి పల్లిపట్టు. బడుగు వర్గాల,దళిత బహుజనుల బతుకుల్లోని కడగండ్లను కళ్ళకు కట్టినట్లు మాండలికభాష యాసల్లో ప్రాంతీయపలుకుబడి నుడికారాల నేటివిటీ సొబగు ను పొదివిపట్టుకొని కవిత్వరచన కొనసాగిస్తున్నాడు.ఇదివరకు వచ్చిన అనేక కవితలలో అత్యంత శక్తివంతమైన వ్యక్తీకరణలతో తనదైన ప్రత్యేక కవితాశిల్పంతో ప్రవహిస్తున్న కవి.ఎక్కడ అన్యాయం,సామాజికమైన అణచివేత, అగ్రవర్ణాల ఆధిపత్యధోరణి,ప్రభుత్వాల వివక్ష కనిపించినా "చిరుతపులి" లా విరుచుకుపడతాడు సత్యాగ్హంతో,ధర్మావేశంతో,విప్లవకవిలా..పవిలా.(పవి అంటే…