సాహిత్య సేవకులు శ్రీ సిరిపి ఆంజనేయులు -Siripi anjaneyulu.నేడు వీరి జయంతి.

సిరిపి ఆంజనేయులు. సాహిత్యం మంటే మక్కువ వీరికి. తనకున్న చాలా ఆస్తి ని దానం చేసి ఎన్నో మంచి కార్యాలకు తోడ్పాటును అందించారు. ప్రకృతి వైద్యం పట్ల ఎనలేని నమ్మకం . ప్రకృతి వైద్యం గురించి విపరీతంగా ప్రచారం చేశారు. శ్రీ సిరిపి ఆంజనేయులు 1891జూన్ 1న అనంతపురం జిల్లా ధర్మవరం లో జన్మించారు.వీరి తల్లిదండ్రులు నారమ్మ , రామన్న.ధర్మవరము వీధిబడుల లోను, మిషన్ వారి పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు.కలకత్తా యందలి 'నిఖిల భారత…

కల్నల్‌ కాలిన్‌ మెకంజీ కైఫియత్తుల అధ్యయన నిపుణులు కట్టా నరసింహులు.Katta narasimhalu.

కట్టా నరసింహులు కల్నల్‌ కాలిన్‌ మెకంజీ కైఫియత్తులు అధ్యయన నిపుణులు పురాతన ఆలయాల చరిత్ర పరిశోధకులు కట్టా నరసింహులు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి దేవాలయంకు గుర్తింపు తెచ్చిన ప్రముఖులలో విద్వాన్ కట్టా నరసింహులు కూడా ఒకరు.కవి ,రచయిత పరిశోధకుడు విద్వాన్ కట్టా నరసింహులు కడప జిల్లా ఒంటిమిట్టకు రెండు కిలోమీటర్ల దూరంలోని చిన్న కొత్తపల్లి గ్రామంలో 5 ఏప్రిల్ 1947 లో జన్మించారు .వీరి ప్రాథమిక విద్య చిన్నపల్లి గ్రామంలో కొనసాగించారు. ఉన్నత పాఠశాల…

✒️అక్షర ప్రస్థానం సాగించిన కలంయోధుడు ,చైతన్య దీప్తిపప్పూరురామాచార్యులు -papuru

నేడు శ్రీ పప్పూరు రామాచార్యుల వర్థంతి సందర్భంగా … రాయలసీమ అభివృద్ధి కాంక్షతో ముందుకు సాగిన సాహితీవేత్త. చైతన్య దీప్తి , రచయిత, పాత్రికేయ బృహస్పతి పప్పూరు రామాచార్యులు. రాయలసీమ ప్రముఖుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. శ్రీబాగ్‌ ఒడంబడికలో రాయలసీమకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులలో పప్పూరు రామాచార్యులు కూడా ఒకరు. 1896 నవంబర్ 8వ తేదీనఅనంతపురంలో పప్పూరు రామాచార్యులు జన్మించాడు. వీరి తండ్రి నరసింహాచార్యులు, తల్లి కొండమ్మ. ఇతని పూర్వీకులు పప్పూరు నుండి అనంతపురానికి వచ్చి స్థిరపడినవారు కాబట్టి…

సర్దేశాయి తిరుమలరావు

‌ సర్దేశాయి తిరుమలరావు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు జొహరాపురం లో జన్మించారు ఈయన మాతృభాష కన్నడం ఉన్నత విద్య కోసం అనంతపురం వచ్చి దత్తమండలం కళాశాలలో బీఎస్సీ చదివారు రాజస్థాన్లోని బిర్లా కళాశాలలో ఎమ్మెస్సీ రసాయన శాస్త్రం చదివి అక్కడే సాయిబాబా జాతీయ కళాశాలలో ఒక ఏడాది ఉపాధ్యాయుడిగాపనిచేశారు. అనంతపురంలోనే ఉన్న తైలసాంకేతిక పరిశోధన సంస్థలో 1954లో జూనియర్ కెమిస్ట్ గా చేరారు. క్రమక్రమంగా ఎదిగి ఆ సంస్థకే సంచాలకులయ్యారు. 1986లో పదవీ విరమణ చేసి…

నూతలపాటి గంగాధరంNutalapaati gangadharam

నూతలపాటి గంగాధరం చిత్తూరు జిల్లా నాగలాపురం సమీపంలో గల రామగిరి గ్రామం లో డిసెంబర్ 15 1939 న మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. విద్వాన్ చదివి ఉపాధ్యాయునిగా పనిచేశారు సంప్రదాయ సాహిత్యాన్ని చదువుకొని ఆధునిక రచయిత గా ఎదిగిన నూతలపాటి అభ్యుదయ రచయిత. చీకటి నుండి వెలుగులోకి అన్నవి ఆయన కవిత్వ సంపుటాలు.కాగితం పులి అనే నవల రాశారు.శివాజీ కల అనే కథలు కూడా నూతలపాటి రచించారు అంతేగాక నూతలపాటి చాలా విమర్శలు రచించారు.…

నాగపూడి కుప్పుస్వామి

నాగపూడి కుప్పుస్వామి చిత్తూరు జిల్లా వాస్తవ్యులు. వీరు నాగపూడి అనే గ్రామంలో క్రీ.శ. 1865లో జన్మించారు. వీరితండ్రి యజ్ఞనారాయణ శాస్త్రి. మద్రాసు క్రైస్తవ కళాశాలలో చదివి బి.ఏ., పట్టభద్రులై 1918 వరకు న్యాయవాద వృత్తిలోఉన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య విద్యా కళాశాలకువిచారణ కార్యకర్తగా పనిచేశారు. నాగపూడి న్యాయవాద వృత్తిలో ఉన్నప్పటికీ వారికి సాహిత్య వ్యాసంగంపైన ఆసక్తి ఎక్కువ. అందువల్లనే సంస్కృతాంధ్ర సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. 1917-1938 మధ్యకాలంలో వీరు ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, భారతి,…

ఎస్. గంగప్ప

ఎస్. గంగప్ప అనంతపురం జిల్లా'నల్లగొండ్రాయనిపల్లె'లో 8-11-1936న జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ (ఆనర్సు), ఎం.ఏ (తెలుగు) డిగ్రీలు పొందారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. వివిధ ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు. కోలాచలం శ్రీనివాసరావు నాటక రంగానికి చేసిన అవిరళమైన కృషి గురించి చాలామందికి తెలీని రోజుల్లో కోలాచలం శ్రీనివాసరావు సాహిత్య సమాలోకనము అనే అంశం తీసుకొని పిహెచ్.డి.కోసం పరిశోధించి పుస్తకంగా…

సాళ్వ కృష్ణమూర్తి

‌‌ సాళ్వ కృష్ణమూర్తి కర్నూలు జిల్లా, అప్పటి కోవెలకుంట్ల తాలూకా. నొస్సం గ్రామంలో 1930 జూన్ నెల 26వ తేదీన జన్మించారు. తల్లి సీతమ్మ, తండ్రి వెంకట సుబ్బయ్య, బి.ఏ తెలుగులో బొబ్బిలి మహారాజావారి స్వర్ణపతకం, ఎం.ఏ తెలుగు (1950-52) ప్రధమ శ్రేణి పొందారు. సనాతన సంప్రదాయ సూత్రాలను వెతికి పట్టుకొని, వెలికితీసి ఒకశాస్త్రకావ్య సమన్వయవేత్తగా గుర్తింపు పొందారు. భారతీయ షడ్దర్శనాలైన సాంఖ్య, వైశేషిక, న్యాయయోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, ఉత్తర మీమాంసవిశేషించి జైమిని మహర్షి ప్రవర్తింపజేసిన…

గల్లా చలపతి

గల్లా చలపతి 15.7.1948న వెంకటమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య కడప జిల్లా రైల్వే కోడూరులో చదివారు. నెల్లూరులో డిగ్రీ, తిరుపతిలో పి.జి. చేశారు. గల్లా చలపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలోని తెలుగు శాఖలో ఇరవైఎనిమిది సంవత్సరాలు లెక్చరరుగా, అసోసియేట్ ప్రొఫెసరుగా, ప్రొఫెసరుగా, శాఖాధ్యక్షులుగా, పి.జి. పాఠ్యప్రణాళికా సంఘ అధ్యక్షులుగా పనిచేసి ఆచార్యులుగా పదవీ విరమణ చేశారు. సంస్కృతం లోను, చరిత్రలోను కూడా వీరు ఎం.ఏ. డిగ్రీలు పొందారు. 'ఎపిగ్రఫీ'లో (శాసన శాస్త్రం)లో విశేషంగా…

కేతు విశ్వనాథరెడ్డి

‌‌ కేతు విశ్వ నాథరెడ్డి కడపజిల్లా,కమలాపురం తాలూ కా(యర్రగుంట్లమండలం) రంగశాయిపురంలో 10.7.1939న కేతు వెంకటరెడ్డి, నాగమ్మ దంపతులకు జన్మించారు. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యులు, శాఖాధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు. వీరి రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం (1993), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు(1986) లభించాయి. సాహిత్య పరిశోధనకు, సాహిత్యవిమర్శకు సామాజిక శాస్త్రాల సహాయం అనివార్యమని మార్క్సిస్టులు భావిస్తారు. కేతు విశ్వనాథరెడ్డి దృష్టి అనే విమర్శ గ్రంథంలో ఈ సిద్ధాంతాన్నే ప్రతిపాదించి ఈ సిద్ధాంతం ప్రకారమే విమర్శ…