సైన్స్ గురించి గాంధీ గారి ఆలోచన ఏంటీ?- about science gandhi.

బారిస్టర్ సైన్స్ దృష్టి******************         ప్రత్యేక ఉపోధ్గాతం  అవసరం లేని వ్యక్తిగా,సుదీర్ఘకాలం  పలుపుస్తకాలు,  వ్యాసాలు,కాలమ్స్ రాస్తూ,పాపులర్ సైన్స్ రచయితగా, మీడియావిశ్లేషకులుగా,సాహితీ విమర్శకులుగా,ఆకాశవాణి ప్రయోక్తగా సుపరిచితులైన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు నిత్య సాధకులు. మరుగున పడ్డ అనేక అంశాలను వెలికి తీసి,వాటి వైశిష్ట్యాన్ని నలుగురికి చేరవేయాలన్న తపనతో నిరంతరం  చదువుతూ,శోధిస్తూ, వ్రాస్తూ ఉంటారు..            సైన్స్ పట్ల మక్కువ జర్నలిజం వల్ల అబ్బిన విశ్లేషణ, అన్వేషణ వెరసి అందరూ సామాన్యంగా చూసే అంశాలు ఆయన దృష్టికోణం లో చాలా భిన్నంగా…

పల్లె ప్రజల పలుకు బడులకు పట్టం కట్టిన ముగ్గురాళ్ళ మిట్ట కథలు-Mugguraallamitta

ఆర్ సి  కృష్ణస్వామి రాజు జీవిత బీమా సంస్థలో అభివృద్ధి అధికారి గా పనిచేస్తూ  మధ్యలో వదిలేసిన తన సాహితీ ప్రస్థానాన్ని మళ్లీ కొనసాగిస్తూ గత రెండేళ్లుగా 150 పైగా కథలు రాశారు. వాటిల్లో తనకు నచ్చిన 18 కథలను 'ముగ్గురాళ్ళ  మిట్ట' పేరుతో కథా సంపుటిని తీసుకొచ్చారు. ఇందులో చాలా కథలు వివిధ సమస్యల నుంచి పురస్కారాన్ని పొందినవే. ఆయన చెబుతున్నట్లు ఇందులోని కథలన్నీ ఆయన బాల్యం, ఊరు, కుటుంబం నేపథ్యంలో జరిగిన సంఘటనల నుంచి…

పడుగూ పేకల మధ్యన కవితా జీవనం-Radheya

భారతదేశానికి నాగరికత ఎప్పుడు వచ్చిందో  తెలియదు కాని ,ప్రపంచీకరణ బీజాలు మాత్రం 1991 ఆర్ధిక సంస్కరణలతో వచ్చి పడ్డాయి.బయటి వ్యక్తులని మనదేశంలోని వ్యాపారాలకు ఆహ్వానించడం వంటి ప్రణాళికలు దేశాన్ని కనబడకుండా లోపల నుంచి వేరుతొలుచే పురుగుల్లా తినేసాయి.అలా నష్ట పోయిన ప్రభావం ఎక్కువగా చేతి వృత్తుల మీద పడింది.అలాంటి ఒక వృత్తి చేనేత రంగం.వాళ్ల స్థితి గతుల మీద అలాగే  వాళ్ల కి సంబంధించిన కష్టాల మీద రాయబడిన కవిత్వం కూడా తెలుగులో విరివిగానే ఉంది.అయితే అందరికన్నా…

అనంత చైతన్య స్వరాలు- Anantha swaraalu

         అమెరికా రచయిత ఆప్షన్ సింక్లెయిర్ సాహిత్యమంతా ప్రచారమేనన్నారు.అయితే ప్రచారమంతా సాహిత్యం కాదు. సాహిత్య సంఘాల పని సాహిత్యకారులను ప్రోత్సహించడమే కాదు ప్రజాసాహిత్యాన్ని అభివృద్ధి చేయటం కూడా.        సాహితీ స్రవంతి గత పదహైదు సంవత్స రాలుగా తెలుగు రాష్ట్రాలలో సాహితీ సృజన కారులను ప్రోత్సహిస్తూ సామాజిక చైతన్య సాహిత్యాన్ని ప్రోదిచేస్తూ ఉంది. అరసం, విరసంల తదనంతరం సాహిత్యోద్యమం కొనసాగించేందుకుదీక్షబూని ఉంది.“పాతది పనికిరాదు / సరికొత్త తరం కావాలి /…

అనంత రైతులకు కుడిఎడమల నిలిచిన కవి నర్సిరెడ్డి-Narisireddy

"మీ గుండెల్లో ఎక్కడైనా/ చీమ కనుగుడ్డంత కారుణ్యముంటే/ మాక్కొంచెం తడినివ్వండి/ మా పొలాల గుండె గదుల్లోంచి/ కావల్సినన్ని గింజలు తోడి పోయకుంటే అప్పుడడగండి" అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరిన యాముల నర్సిరెడ్డి సోమందేపల్లి మండలంలోని చాకర్లపల్లి లో యాములసుశీలమ్మ , చక్కీ రప్ప దంపతులకు జూన్ 11న 1976 లో జన్మించారు.తండ్రి చక్కీరప్ప టీచర్ గా పనిచేసేవారు. అయినప్పటికీ ఆయన ఉదార స్వభావం వల్ల, వ్యవసాయానికి అధికంగా ఖర్చు చేయడం వల్ల నర్సిరెడ్డి చదువు అనేక కష్టాలకడలిలో…

సిద్ధాంత బలంగల కవి పిళ్లా కుమారస్వామి- Kumara Swami

పిళ్లా కుమారస్వామి అనంతపురం జిల్లాలో ఒక సాహితీ యాక్టివిస్ట్.సాహితీ స్రవంతి బాధ్యులు. అనంతపురం జిల్లాలో సాహితీ సంస్థలు అధికమై,రచయితలు గత కొంతకాలంగా ఎవరికి వాళ్ళుగా ఉంటున్న నేపథ్యంలో,కుమారస్వామి తనదైన పద్ధతిలో జనాన్ని సమీకరించుకొని ప్రజాసాహిత్యకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతినెలా అనంతపురంలో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేగాక కుమారస్వామి చాలా కుదురుగా తన రచనావ్యాసంగాన్ని కూడా కొనసాగిస్తున్నారు. కుమారస్వామి వామపక్షవాది. అభ్యుదయసాహితీపరుడు. అందువల్ల ఆయన సాహిత్యం అభ్యుదయ సాహిత్యంలో అంతర్భాగం.కుమారస్వామి రచించిన 50 కవితలు రాయలసీమ ప్రాంత కరువు,వ్యవసాయం,…