పైడి లక్ష్మయ్య__

పైడి లక్ష్మయ్య ఏప్రిల్ 26, 1904 తేదీన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో పేరూరి అచ్చంపల్లి గ్రామంలో ముసలప్ప, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య ముగించి అనంతపురంలోని దత్తమండల కళాశాలలో 1932లో తెలుగు ప్రధానాంశంగా బి.ఏ. డిగ్రీ పొందారు. మద్రాసులో న్యాయశాస్త్రం పూర్తి చేసి 1937లో న్యాయవాదవృత్తిని స్వీకరించాడు.వీరు స్థానిక పరిపాలనా రంగంలో ప్రజా ప్రతినిధిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.1942 నుండి 1947వరకు అనంతపురం జిల్లా బోర్డు అధ్యక్షులుగా వుండి జిల్లా అభివృద్ధికి కృషి చేశారు.…

గంగిశెట్టి లక్ష్మీనారాయణ

గంగిశెట్టి లక్షీనారాయణ పరకల్లు గ్రామం, అనంతపురం జిల్లాలో 1947వ సంవత్సరంలో శ్రీమతి జింకా రుక్మిణమ్మ, జింకా గంగిశెట్టిలకుజన్మించారు. నేలనపడ్డ 10 నెలలకే కన్నతండ్రి గతిస్తే అంతా తానై కాపాడినవారు పితామహులు జింకా చెన్నరాయప్ప. 'విమర్శయనగా ఒక కావ్యాన్ని విషయీకరించుకొని రాయు మరొక కావ్యమ"ను రాళ్ళపల్లి గారి నిర్వచనాన్నిఆదర్శంగా తీసుకుని 'సమగ్ర సాహిత్య అధ్యయన విధానా నికి మరో పేరే విమర్శ' అని గట్టిగా నమ్మే వారిలోగంగిశెట్టి లక్ష్మీ నారాయణ ఒకరు. అన్వయ విమర్శకంటే, సైద్ధాంతి క విమర్శను…

శాస్త్ర సాంకేతిక సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి సర్దేశాయి_ Sardesai

Sardesai thirumala rao ఆస్పరి మండలం ఆలూరు తాలూకాలోని జోహరాపురంలో 1928 లో జన్మించారు సర్దేశాయి తిరుమల రావు(Sardesai). వీరి చదువంతా ఆదోని, అనంతపురంలలో సాగింది. రాచుపుటాణా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. విద్యార్థిగా ఉన్నప్పుడే తెలుగు, సైన్సుల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. 1954 లో కెమిస్టుగా అనంతపురంలోని తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో చేరి అక్కడే జూలై 31, 1983 లో ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ పొందారు. తమ 30…

ఖాసా సుబ్బారావు అవార్డు అందుకున్న చందమూరి- kaasaa subbarao award,Chandamuri Narasimha Reddy

Chandamuri Narasimha Reddy receiving kasa subbarao award అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంసిద్దరాంపురం గ్రామానికి చెందిన చందమూరినరసిరెడ్డి, లక్ష్మినారాయణమ్మ దంపతులకు ఐదవ సంతానంగా చందమూరి నరసింహారెడ్డి08-09-1968న జన్మించారు.        హైస్కూలు విద్యవరకు సిద్దారాంపురం లో వున్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తిచేశారు. ఇంటర్‌ను పెనుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోచదివారు. అనంతపురం లో వున్న యస్.యస్. బి.ఎన్ కాలేజీలో బిఎస్సీ చదివారు.   డిగ్రీ పూర్తయ్యాక ఈనాడు దినపత్రికకు బుక్కపట్నంలో విలేకరిగా పనిచేస్తూ ఆర్టీసి కాంప్లెక్స్…

ఆ అవార్డు ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి భారతీయునికి దక్కింది-Alan Turing award.

అలన్‌ ట్యూరింగ్‌ అవార్డు అందుకొన్న ఏకైక భారతీయుడు రాజ్ రెడ్డి చిన్న పల్లెటూరు నుంచి బాల్య జీవితం ఆరంబించి అగ్రరాజ్యంలో ఓ వెలుగు వెలుగు తున్నాడు. రాయలసీమ వాసులకు కూడ పూర్తి తెలియని ఓ గ్రామాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియజేశారు. మొకవోని ఆయన పట్టుదలను అభినందించాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతగాలేని ఆరోజుల్లో ఆరంగం వైపు దృష్టి మరల్చడం ఆయన ముందు చూపుకు నిదర్శనం. యువతకు మార్గనిర్దేశకుడు డి. రాజ్ రెడ్డిఅలియాస్ రాజగోపాల్ రెడ్డి. కాటూరు అన్నది…

K. BalagopalHuman rights activists హక్కుల పోరాటం ఆ బాలగోపాలం

K.Balagopal ఇరవై ఐదేళ్ల ఉద్యమ ప్రస్థానంలో నిత్యం పాలకులతో పోరాటమే. వేలాదిమంది విద్యార్ధులకు మానవ హక్కులపై చైతన్యం రగిలించిన స్ఫూర్తి ప్రదాత. రాష్ట్రంలోని తాడిత, పీడిత జనాలకు అండగా, కార్మికవర్గాని చేదోడువాదోడుగా అటు ప్రజా వేదికలపైన, ఇటు న్యాయస్థానాల్లోనూ నిలబడిన హక్కుల నేత. హింస ఎవరు చేసినా ఒకటే దానికి వ్యతిరేకంగా నిలవడమే ఆయన లక్ష్యం. పీపుల్స్ వార్, ఫ్యాక్ష్యనిస్టులు ,పాలకులు ఎవరూ చట్టవ్యతిరేకమైన చర్యలు చేసినా పధ్ధతి కాదని హక్కులు కాలరాసే స్వేచ్ఛ ఎవరికీ లేదని…

ప్రపంచ గణిత మేధావిలక్కోజు సంజీవరాయ శర్మ-Lakkoju Sanjeevaraya SharmaIndian mathematician.

Lakkoju Sanjeevaraya SharmaIndian mathematician.photo source wikipedia. గణితశాస్త్రాన్ని, ప్రాచీనకాలంనుండి ఎంతోమంది భారతీయులు అభివృద్ధి పరుస్తూ వచ్చారు. భారతీయ గణిత ఆవిష్కరణల్లో ముఖ్యమైనవిగా సున్నా వాడకం, బీజగణితం వంటివాటిని చెబుతారు. వరాహమిహిరుడుఆర్యభట్టు-ఖగోళ శాస్త్ర గణనలు కచ్చితంగా చేసినవాడు.యతి వృషభుడు - తిలోయపన్నత్తి అనే గణిత, ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని రాసిన జైన మత ఆచార్యుడు.బ్రహ్మగుప్తుడు -అంక గణితంలో సున్న భావన తెచ్చుటకు దోహద పడినవాడు . శ్రీధరుడు - గోళం యొక్క ఘనపరిమాణం కనుగొనుటకు ఉత్తమ సూత్రములు…

విజ్ఞాన గని ఆచార్య తూమాటి దొణప్ప-tumaati donappa

tumaati donappa ఆయన మన విజ్ఞాన గని. తెలుగు ,ఇంగ్లీష్ కన్నడ , సంస్కృత భాషలో మంచి పట్టుంది .పువు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఈయన చిన్న వయసులోనే కవితలు ,పద్యాలు రాసి వినిపించేవారు. గ్రామీణ జీవన విధానం పై ,జానపదుల పై ఈయన విస్తృతమైన పరిశోధనలు జరిపారు .మంచి రంగస్థల నటుడు .ఉత్తమ అధ్యాపకులు.., ఆదర్శ పరిశోధకులు…., ప్రసిద్ధ భాషావేత్త…., పరిపాలనా దక్షులు…, జానపద సాహిత్య సంగ్రాహకుడు….తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి పేరొందిన ఆచార్య తూమాటి…