సీమ నేల తల్లి ( పాట )

సాకీ:- మద్రాసు మహానగరంలోశ్రీబాగ్ సదనంలోపురుడు పోసుకొనెను సీమ!రాణకెక్కెను రాయల సీమ !!ఆనాడే తొలికేకయినదిసీమస్వరం!ఈనాటికి పొలికేకయినదినిరంతరం!! పల్లవి:-రాయలేలిన సీమరతనాల సీమయనిరసరమ్య రాగాలు తీసేమురాళ్ళరప్పల సీమనీమరచేము !!రా!! 1వ చరణం:-శ్రీశైల మల్లన్నశేషాద్రి వెంకన్నఒంటిమిట్ట రామన్నకదిరి నరసింహన్నచల్లంగ కాపాడు"చల్లకుండ"రా సీమకఱవులెన్ని కలచినాసురకల్పతరువు సీమ!!రా!!2వ చరణం:-సీమశౌర్యపతాకమేసైరా నరసింహారెడ్డివిశ్వజనుల మేల్కొల్పెనువిశ్వకవి వేమన్నఅచ్చతెనుగు పాటలతోఅలరించెను అన్నమయ్యకాలజ్ఞానం పలికికళ్ళుతెరిపించెను వీరబ్రహ్మం!!రా!!3వచరణం:-అలనాడు అలుముకొనెనుగడియడవుల కానలు !అందుకే నెలకు మూడుఅమృతపు జడి వానలు!!పసిడి పచ్చల సౌరులుపరిమళించె నానాడుపైరుపంటల సిరులుపొంగి పొరలె నాడు!!రా!!4వచరణం:-ఈనాడు కొండలన్నిబోడికొండలాయెనానాటికి తరులు లేకగిరులు చిన్నబోయెవరుణ కరుణ వర్షించకవాగులువంకలు…