నాచనసోమన Naachanasomana

_పిళ్లా కుమారస్వామి 9490122229 ‌‌ ‌ నాచనసోమన కడపజిల్లా కమలాపురం తాలూకాలోని తుడుమలదిన్నె లో జన్మించారు. ఆయన ఉత్తరహరివంశమనే ప్రబంధకావ్యాన్ని రచించారు. ఇది జనాదరణ పొందిన కావ్యం. నాచన సోమన 14వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత పొందిన కవులలో ఒకరు. విజయనగర సామ్రాజ్య పరిపాలకుడైన వీర బుక్కరాయలు నాచన సోమనకు పోషకునిగా వ్యవహరించారు. బుక్కరాయల నుండి ' పెంచకల దిన్నె' అగ్రహారాన్ని బహుమానంగా పొందాడు. అది పూర్వపు జమ్మలమడుగు తాలూకాలో వుండేది. నాచనసోమన సాహిత్యంలో  తిక్కన యుగానికి చెందిన కవి. సోమన కాలాన్ని గురించి…

హేతువాది, సంఘసంస్కర్త యోగి వేమన- veemana

బంగారు లేడి ఉండదని తెలియని రాముడు దేవుడెలాగయ్యాడు? కనక మృగము భువిని కద్దులేదనకుండతరుణి విడిచిపోయె దాశరధియుతెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?విశ్వదాభిరామ వినుర వేమ. విగ్రహారాధనను విమర్శిస్తూ…. పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టిచెలగి శిలల సేవ జేయనేల?శిలల సేవ జేయ ఫలమేమికలుగురా?విశ్వధాభిరామ వినురవేమ. కులవిచక్షణలోని డొల్లతనం గురించి…. మాలవానినంటి మరి నీటమునిగితేకాటికేగునపుడు కాల్చు మాలఅప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?విశ్వదాభిరామ వినుర వేమ. ఆ కాలం పరిస్థితులను బట్టి చూస్తే…వేమన గొప్ప హేతువాది అని గ్రహింపవచ్చు. సమాజంలో ఎంతో దృఢంగా పాతుకుపోయిన ఆచారాలను, భావాలను…