అనంతపురంజిల్లాలో వికసించిన ప్రబంధ, ఆధ్యాత్మిక సాహిత్యం

Vemana ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేసినపుడు 16వ శతాబ్దంలో వసు చరిత్ర రాసిన రామరాజ భూషణుడు కొంతకాలం పెనుకొండలో నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. వసుచరిత్రలో ఆయన వర్ణించిన కోలాహల పర్వతమే పెనుకొండ అనీ, సుక్తిమతీనదే చిత్రావతి నది అని చెపుతారు.17వ శతాబ్దంలో పాఠకులకు ఆసక్తి పెంచే 'శుకసప్తతి' కథా కావ్యాన్ని రాసిన 'పాలవేకరి కదిరీపతి' ఈ జిల్లాలోని కదిరి ప్రాంతంవాడనేందుకుచారిత్రక ఆధారాలున్నాయి. ఈ కావ్యంలో ఆనాటి సామాజిక పరిస్థితులు పుష్కలంగా కనిపిస్తాయి. అదే 17వ శతాబ్దంలోనే సమాజంలోని…