ముస్లింలు ఆరాధించే హిందూ దేవాలయం రాయలసీమ లో ఉంది-Hindu temple.

ఊరకుంద ఈరణ్ణ స్వామి వీరు ప్రసిద్ధ శైవ యోగులు. 1610 వ సంవత్సరంలో కౌతాళం అనే గ్రామం లో జన్మించారు. అసలు పేరు హిరణ్యులు. ఈ వూరు కర్నూలు సమీపాన ఆదోనీకి దగ్గరలో వుంది. తమ పన్నెండవ ఏట అడవిలో ఆవులను మేపటానికి వెళ్లినప్పుడు ఒక సిద్ధుడు వీరి వద్దకు వచ్చి గురుబోధ చేశారు.దైవధ్యానంలో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గడపమన్నారు. బాలుడైన స్వామి వారు ఆ అశ్వత్థ వృక్షం క్రింద సమాధి స్థితి లో కూర్చుని, నరసింహ…

“శ్రీరాముడు స్వయంగా చెక్కిన వీరాంజనేయస్వామి విగ్రహం ఇక్కడ ఉంది- Veeranjaneya swami temple

శ్రీ గండి క్షేత్రం. Pic source google "యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ | బాష్పవారి పరిపూర్ణలోచనం, మారుతిం నమత రాక్షసాంతకమ్" || ఎక్కడెక్కడ శ్రీరామకీర్తనం, రామనామస్మరణం జరుగుతుంటుందో అక్కడక్కడ శ్రీ ఆంజనేయస్వామి చేతులు జోడించి, ఆనందంతో వింటూ ఉంటాడని ఆర్షవచనం. అంతటి మహోన్నతమైన శ్రీరామభక్తుడు ఆంజనేయుడు. అందుకు నిదర్శనంగా మనభారతదేశంలో గల దేవాలయాలలో ఎక్కువభాగం ఆంజనేయుని దేవాలయాలే నిర్మించబడినవి. ఇది అక్షరసత్యం. మహామహిమాన్వితుడైన ఆంజనేయుని ఆలయాలలో ముఖ్యమైనదిగా పేరుగాంచి, పవిత్ర పాపాఘ్నినది…

గుత్తి కోట రహస్యం-gooty kota.

కొండల పైనే కోటలు ఎందుకు కడతారు ముందుగా తెలుసుకోవాలి . శత్రువులు , క్రూరమృగాల నుంచి రక్షణ కోసం. ఇలాంటి వాటిని అధ్యయనం చేస్తే చరిత్ర తెలుస్తుంది. అలాంటి చరిత్ర కలిగిన గుత్తి కోట గుట్టు ను ఇప్పుడు తెలుసుకుందాం. గుత్తి ఆంద్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఒక చిన్న పట్టణం.జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుత్తి పట్టణానికి తూర్పున ఉన్న రెండు కొండల మధ్య దాదాపుగా 300 మీటర్ల ఎత్తున ఉంది గుత్తి…

గండికోట చరిత్ర -Gandikota history

గండికోట వైఎస్‌ఆర్ జిల్లా, జమ్మలమడుగు మండలం లోని గ్రామం.ఇది మండల కేంద్రమైన జమ్మలమడుగు నుండి పడమర దిశగా 14 కి. మీ. దూరంలో ఎర్రమల పర్వత శ్రేణిపై ఉంది.పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి…

తిరుమలకు తొలిగడప దేవుని కడప-Devuni kadapa.

Pic source wikipedia రాష్ట్రంలో ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలున్నాయి. వాటిలోని ప్రముఖ ప్రాంతాలలో కడప జిల్లాకు చెందిన దేవునికడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం ఒకటి విశేషఖ్యాతిగల, పురాణ ప్రసిద్ధిగల పర్యాటక ప్రాంతంగా ఈ ఆలయానికి ఎంతో పేరుంది. దీన్ని తిరుమలకు తొలి గడపగా భావిస్తారు. తిరుమల క్షేత్రపాలకుడు వరాహస్వామి అయితే, ఈ క్షేత్రపాలకుడు హనుమంతుడు. ఇలాంటి మరెన్నో విశేషాలున్నాయి. దీని గురించి కడప కైఫీయత్తు లలో సమాచారం ఉంది జనమేజయుని ప్రతిష్ఠ దేవునికడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ మూలవిరాట్ను…

పేరుకు ముందు రెడ్డి పెట్టుకోవడానికి కారణమిదే -Reddy

చిత్తూరు,కడప ,అనంతపురం, నెల్లూరు జిల్లాలో చాల కుటుంబాలు చిత్తూరు జిల్లా రెడ్డెమ్మ తల్లి ని ఆరాదిస్తున్నారు. చాలా మందికి వారి పేరు ముందు రెడ్డి, రెడ్డెమ్మ అని పెట్టుకొంటారు. రెడ్డెమ్మ గుడి రెడ్డెమ్మ కొండ లో ఉంది.ఇది చెర్లోపల్లి సమీపంలో ఉంటుంది. చెర్లోపల్లె, చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలానికి చెందిన గ్రామం. ఇక్కడి రెడ్డెమ్మ కొండ లోని "రెడ్డెమ్మ దేవత" చాల శక్తులు కలదని ప్రజల నమ్మకం . చెర్లోపల్లి లోని రెడ్డెమ్మ కొండకు ఇతర రాష్ట్రాల…

వల్లూరు కోట

పుష్పగిరి తాడిపత్రి -కడప రహదారిలో యర్రగుంట్ల, కమలాపురం దాటిన తరువాత వల్లూరు అనే చిన్న పట్టణం వస్తుంది. ఇప్పుడు చిన్న పట్టణం అయినా దాదాపు 250 సంవత్సరాలు ములికినాటి సీమ ప్రధాన పట్టణాలలో ఒకటిగా, నల్గొండ నుండి కోలార్ వరకు ఒంగోలు నుండి గుత్తి వరకు విస్తరించి కొంత కాలం స్వతంత్య్ర రాజ్యంగా ఉన్న కాయస్థ రాజ్యానికి వల్లూరు రాజధాని. ప్రస్తుత కడపజిల్లా కళ్యాణీ చాళుక్యుల పాలనలో ఉండగా, కళ్యాణి చాళుక్య ప్రభువైన త్రైలోక్యమల్ల మహారాజు /…

తిరుమల మొక్కులు ఏలా చెల్లించాలి-Tirumala srivari mokkulu.

మొక్కుబడుల దేవుడు. Pic source ttd శ్రీవేంకటేశ్వరస్వామి ఆపద మొక్కులవాడనేది లోకప్రసిద్ధం. అనాదిగా రాజులు, రాణు లెందరో స్వామికి మొక్కులు చెల్లించారు. పల్లవరాణి స్వామివారి వెండి విగ్రహాన్ని ఆలయానికి బహూకరించింది. ఆయనే పవళింపు సేవలందుకొనే భోగశ్రీనివాసమూర్తి, భగవంతుడికి మనకి కలిగినంతలో తృణమో పణమో సమర్పిస్తామని మొక్కుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. మొక్కు అంటే ప్రార్థన, మొక్కుబడి అంటే ప్రార్ధించ బడింది అని అర్థాలు. "నా మొక్కు నెరవేరితే నేను కృతజ్ఞతగా చెల్లించబోయేది" అని భక్తుడు స్వామితో ఒక…

ఓం నమో శ్రీ వేంకటేశాయ తిరుమల శ్రీవారి ఆలయచరిత్ర, విశేషాలు5 -TTD history 5

ఘంట మండపం :- బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్యగల ప్రదేశం. బ్రహ్మది సకల దేవతాగణాలు స్వామి వారి సందర్శనకు వేచిఉండే ప్రదేశం. దీనినే మహామణి మండపం అంటారు.శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి.. దానికి ఎదురుగా ఉన్న గరుడ మందిరాన్ని అనుసంధానిస్తూ ఘంటా మండపం నిర్మితమైంది చంద్రగిరి వాస్తవ్యుడు, విజయనగర సామ్రాజ్య మంత్రివర్యుడు అమాత్యమల్లన ఈ మండపం నిర్మాణం మొదలు పెట్టించి క్రీస్తుశకం 1417 ఆగస్టు 25 నాటికి పూర్తి చేయించినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి. దీనిని…

ఓం నమో శ్రీ వేంకటేశాయ తిరుమల శ్రీవారి ఆలయచరిత్ర, విశేషాలు4 -TTD history 4

భాష్యకార్ల సన్నిధి :- ఇందులో శ్రీమద్ రామానుజాచార్యులు గారి విగ్రహం ఉంటుంది. శ్రీవారికి ఏం ఏం కైంకర్యాలు ఏవిధంగా చేయాలో మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి. తన 120 సం.ల కాలంలో 3 పర్యాయాలు తిరుమలకు మోకాళ్ళ మీద వచ్చాడు. అలా వస్తున్నపుడు ఆయన ఆగిన ప్రదేశమే మోకాళ్ళ పర్వతం. ఈనాటికి కాలినడకన వచ్చే భక్తులు ఈ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కడం గమనించవచ్చు. ప్రధాన వంటశాల (పోటు) :- విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు…