Pic source TTD సనాతన హైందవ ధర్మప్రచారంలో… సప్తగిరి సచిత్రమాసపత్రిక. ప్రజలలో సత్ప్రవర్తన, సదాచారం, ధర్మాచరణ వంటి వాటిని ప్రేరేపించి ముందుకు నడిపించే విషయంలో ధార్మిక పత్రికల స్థానం ప్రత్యేకం. అందులోను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురిస్తూవున్న ధార్మిక మాసపత్రిక స్థానం మరింత విశిష్టమైనది. ఈ పత్రిక పూర్వాపరాలను పరిశీలిద్దాం.శేషాచలపతి ఐన శ్రీనివాసుని దర్శించ వచ్చే వేలాది యాత్రికులకు దేవస్థానం చేస్తున్న చేయనున్న సౌకర్యాల వివరాలను ప్రపంచంలో నలుమూలల్లో భక్తులకు తెలియజేయటంతో పాటు క్షేత్ర మహిమ, తదితర…