రాయలసీమ నీటి ప్రాజెక్టుల పై నిర్లక్ష్యం ఎందుకు?Seema projects.

ఈ మధ్య పలు ప్రాజెక్టుల మీద రేగిన వివాదల దృష్ట్యా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(KRMB) ఆంధ్రా,తెలంగాణా ఇరు రాష్ట్రాలను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరియు ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టుల కు సంబంధించి వివరాలు ముఖ్యంగా డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డిపిఆర్)లు సబ్మిట్ చెయ్యమని ఆదేశించింది. KMRB అనేది పవర్ లేని ఒక ధర్మకర్త లాంటిది. నేరుగా వారు ఏ ఆదేశాలు ఇవ్వలేరు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు ఇంకా అవార్డు కాలేదు కాబట్టి ఇరు రాష్ట్రాలు…

సీమ ప్రాంతానికి 500 టి.యం.సీలు కేటాయించడం పాలకుల కనీస బాధ్యత- Allocate 500 tmc water for rayalaseema.

నికరజలాలు ప్రాంతాల వారిగా పంపిణీతో - సమగ్ర వికేంద్రీకరణ.ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తీర్ణం 394.88 లక్షల ఎకరాలు. అందులో కోస్తాంధ్ర జిల్లాలు విస్తీర్ణం 229.08 (58.01%) లక్షల ఎకరాలు ఉండగా రాయలసీమ నాలుగు జిల్లాల విస్తీర్ణం165.80 (41.99%) లక్షల ఎకరాలు ఉంది. జనభా పరంగా కోస్తాంధ్రలో 3.52 (69.92%) కోట్లమంది ఉండగా, రాయలసీమలో 1.51 (30.08 %) కోట్ల మంది ఉన్నారు. ఆంధ్రలో వ్యవసాయ యోగ్యమైన భూమి 119.17(54.63) లక్షల ఎకరాలు ఉండగా, రాయలసీమలో 98.95 (45.37%) లక్షల…

ఎత్తిపోతల పథకం లో జ్యాప్యం రాయలసీమ కు శాపం . Rayalaseema water projects.

పర్యావరణ అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీచేయడం రాయలసీమ వాసులకు తీరని ద్రోహంగా పరిగణించాలి. ముందస్తు అనుమతులు లేకుండా పనులు మొదలు పెట్టడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొనడం విచారకరం. పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ వాసుల ఆశాకిరణం. తరతరాలుగా రాయలసీమ ప్రాంతంలో కరవు నెలకొని రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.…

హంద్రీనీవా ద్వారా ప్రాజెక్టులు నింపండి.Handreneeva

హంద్రీనీవా కాలువ కదిరి ప్రాంతంలో 30వేల ఎకరాల్లో పంటలు పండించే మార్గముంది, పట్టించుకోరేం? ( చందమూరి నరసింహారెడ్డి.9440683219) కరుకు కరువుకు ఆలవాలము రాయలసీమ జిల్లాలు .ఇక్కడ నిత్యం కరువు సర్వసాధారణమే . రాయలసీమ జిల్లాల్లో అనంతపురం జిల్లాలో పరిస్థితి మరింత దారుణం. భారతదేశంలో థార్ ఎడారి తర్వాత అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతం అనంతపురం జిల్లా .అందువల్లనే ఈ జిల్లాలో కరువు నివారణ పథకం ఈ కార్యక్రమం కొనసాగుతోంది.నెర్రెలు బారిన నేలలు బీటలు వారిన బతుకులు అనంతపురం…

అనంతపురం జిల్లాలో ఆనకట్టలు- projects in ananthapuram

తుంగభద్ర ఎగువకాలువ         25 లక్షల ఎకరాల వర్షాధార సాగుభూమి ఉన్న ఈ జిల్లాలో ఒక లక్షా నలభైవేల ఎకరాలకు ఈ కాలువ ద్వారా సాగునీరు అందించడానికి రూపొందించారు.         ఏవిధంగా అయితే కోస్తా ప్రాంతంలో నీటి వనరులు కల్పించి కరువులను పారదోలినారో, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా నీటి వనరులను కల్పించి కరువులను పారదోలాలని బ్రిటిష్ వారు ఆలోచించారు. ఆ రోజుల్లో అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలోని ఆలూరు, పత్తికొండ ప్రాంతాలు బళ్లారి…

20 టీఎంసీల కెపాసిటీతో గాలేరు-నగరిపై ప్రాజెక్టు- Project on galeru nagari

 దశాబ్దాల కాలం పాటు నీటి ఎద్దడిని ఎదుర్కొంటోన్న రాయలసీమలో మరో నీటి ప్రాజెక్టు నిర్మితం కాబోతోంది. పోతిరెడ్డి పాడు ద్వారా కృష్ణా జలాల వరద జలాలు, అదనపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం..తాజాగా మరో రిజర్వాయర్‌ను నిర్మించడానికి ప్రతిపాదనలను రూపొందిస్తోంది. హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా- కడప జిల్లాలో ఈ రిజర్వాయర్‌ను నిర్మించడానికి అవసరమైన కసరత్తు చేపట్టింది ప్రభుత్వం. రాయలసీమ నీటి ఎద్దడిని నివారించడం ద్వారా తాను…

నాలుగు ప్రాజెక్టులు_four projects

గండికోటకు మరో 10వేల క్యూసెక్కులకు టన్నెల్ గాలేరు-నగరి, హంద్రీనీవా అనుసంధానానికి రూ.5,036 కోట్లు Galeru Nagari Canal near Gandikota Reservoir                   Hundri neeva canal గాలేరు నగరి సుజల స్రవంతి పథకు నుంచిహంద్రీనీవా సుజల స్రవంతిని అనుసంధానించేలా ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు రూ. 5,098 కోట్లతో పాలనామోదం ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన పరిశోధన, నిర్మాణ పనులు కలిపి చేసేందుకు వీలుగా…

కుందేరు,కుందూనది_kundu river

కుందేరు - కుందూ ను సంస్కృతంలో కుముద్వతి అంటారు. కుముద్వతి అంటే తెల్ల కలువ తీగ - సీతారాముల కుమారుడు కుశుడి భార్య పేరు కూడా కుముద్వతి. కర్నూలు జిల్లాలో సున్నపు నేలల మీదుగా ప్రవహించటం వల్ల తెల్లగా ఉన్న నీటి వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతమే రేనాటి సీమ.   కుందేరు కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రమల కనుమలలో పుట్టి దక్షిణ దిశలో ప్రవహించి వైఎస్ఆర్ కడపజిల్లా , కమలాపురం  సమీపంలో పెన్నా నదిలో కలుస్తుంది.…

రాయలసీమ లో కాలువలు Rayalaseema canals

హంద్రీ_నీవా సుజల స్రవంతి కాలువ       ఈ ప్రాజెక్టు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలలో 602500 ఎకరాలకుసాగునీరు అందించటానికి రూపొందించిన పథకం. దీన్లో ఒక టిఎంసి లోపు నీరు కూడా పారడంలేదు.దీని మార్గంలో హంద్రీ,పెన్నా, చిత్రావతి, పాపాగ్ని, మాండవ్య, బాహుదా,గార్గేయ నదులు ఉన్నాయి . . ఈ కాలువ కాలువ రాయలసీమలోని నాలుగుజిల్లాలకు సాగునీటినందిస్తుంది. క్షామానికి గురౌతున్న ఈ నాలుగు జిల్లాలుఈ ప్రాజెక్టు వల్ల కొంత సాగునీటి సౌకర్యం పొంది, కరువు కోరల…