యక్షగానానికి మూలమెక్కడో తెలుస్తే ఆశ్చర్యపోతారు._origin of yakshaganam

నేటి యక్షగానంలో ఇతరులు పాడుతుంటారు.పాటకు అనుకూలంగా కొందరు ఆడుతారు కథను నడిపే విధానం ముచ్చటగా ఉంటుంది. తోలుబొమ్మలాలు కూడా యింతే. కథను పాటగా పాడుతుం టారు మాటలు చెపుతూ నడుపుతారు పాత్రలకు ప్రత్యేక పాటలుంటాయి. తేడా అల్లా ఒక విషయంలోనే ఉంటుంది. యక్షగానంలో మనుషులు ఆడతారు. తోలు బొమ్మలాటలో బొమ్మలను ఆడిస్తారు. రెంటినీ పోల్చి చూచినపుడు కథనుచెప్పే విధానము ఒకటి గానే ఉంటుంది. ఈనాడు జక్కుల వారు చేసేనృత్యాలు కన్పించవు. కాని యక్షగానాలు చాలా మంది ఆడుతున్నారు.'జక్కులవారి…

తాండవ నృత్యం ఏలా మొదలైందో తెలుసా ? thandavam

Thandava dance మనుషులు రోజూ పనులు చేసుకోవాలి. పని చేయంది చాలా మందికి జీవితం గడవదు. పొట్ట నిండదు. వారంతా పనిచేస్తూ కష్టాన్ని మరచి పోవాలను కుంటారు, ఏదైనా  పాటపాడుకుంటుంటే మనసు తేలికగా వుంటుంది. హాయి గొలుపుతుంది. ఇలా జానపదుల పాటలొచ్చాయి."వారు కష్టపడే టప్పుడు శరీరం కదులుతుంది. ఆ కదిలిక ఒకే తీరుగా ఉంటుంది. పోట్లు వేస్తారు. కోతకోస్తారు. కుప్పలు వేస్తారు. నూరుస్తారు. దంచుతారు. విసురుతారు. ఒక పనికి శరీరంలో ఒకే విధంగా కదిలించాలి. ఒక పనికి…

కోలాట నృత్యాలు -kolatam(stick dance)

ఆంధ్ర ప్రజాజీవితంలో అన్ని జానపద కళారూపాలతో పాటు ఈ కోలాట నృత్యం కూడ తెలుగు జానపదుల జీవితాలతో పెనవేసుకుకుపోయింది. పెద్దల్నీ, పిల్లల్నీ అందర్నీ అలరించిన కళారూపం కోలాటం. కోలాట నృత్యాలు ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో రాత్రి పూట పొద్దుపోయే వరకూ చేస్తూ వుంటారు. భక్తిభావంతో దేవుని స్థంభాన్ని పట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందూ కోలాటాన్ని ప్రదర్శిస్తారు. ఈ కోలాట నృత్యాలను పెద్ద పెద్ద తిరుణాళ్ళ సమయంలోనూ, దేవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరంగంగా వీథుల్లోనూ ప్రదర్శిస్తారు.…

ఏలపదాలు – ఒక పరిచయం-janapadageyalu

రచన :–దస్తగిరి--- ‘ భారతి ‘ మాసపత్రిక జూన్ 1982 ఏలపదాలు జానపద సాహిత్యానికి సంబంధించిన ఒక రూప వైవిధ్యం. ఈ పదాల సృష్టీ, గానమూ ‘ కవిల ’ తోలేటప్పుడే జరుగుతుంది కనుక, వీటిని ‘ కవిల ‘ పాటలని కూడా అంటారు. సేద్యం చేసేటప్పుడు, బండి తోలేటప్పుడుకూడా వీటిని పాడుతుంటారు. దాదాపు యివన్నీ రెండులైన్ల పదాలే. కవిలిబానను బావిలో ముంచుతారు. మునిగిన బానను పైకి తెచ్చి కాలువలో గుమ్మరిస్తారు.ఇవి రెండు చర్యలు. బానను ముంచాటానికి…

సినిమా పుట్టింది ఎలాగో మీకు తెలుసా?

సినిమాలకు మూలకారణం తోలుబొమ్మలాట. ఆ తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందాం ఉపయోగించే బొమ్మను తయారుచేసే పదార్థాల్ని బట్టి బొమ్మలాటలు 5 రకాలుగా ఉన్నాయి1. తాళ్ల బొమ్మలాటలు (Maricnsttes or sering Peppes). తండుగు బొమ్మలాటలు (Glove Puppets). 3. ఆ బొమ్మలాటలు (Rod Peppers. 4. తోలుబొమ్మలు (Leather Puppets) 5. ఇతరాలు (others) అని ఐదు రకాలు అట్ట బొమ్మలు, కీలుబొమ్మలు, రేకు బొమ్మలు, బుట్టబొమ్మలు అని మరలా నాలుగు రకాలున్నాయి. ప్రాచీన కాలంలో చక్రవర్తులు, మతావలంలు,…

అల్లుళ్లకు అల్లెం ఎందుకు పెడతారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

అల్లెం అల్లెం అనేది రాయలసీమ ప్రాంతంలో ఒక ఆచారంగా ఉంది. కుమార్తెకు వివాహం చేసిన తరువాత అల్లుణ్ణి ఆరు నెలలు తమ యింటిలో ఉంచుకొని మంచి ఆహారాన్ని వ్వడాన్ని "అల్లెం పెట్టడం" అంటారు. ఆరుమాసాలు బాగా పౌష్టికాహారాన్నిచ్చి బలంగా తయారుచేస్తే కూతురి కడుపున ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారని వారి నమ్మకం. ఆచార విశేషాలు పాతకాలంలో అన్నిప్రాంతాల్లో చాలా చిన్న వయసులో పెళ్ళి చేసేవారు.కొందరు అమ్మాయి యుక్తవయస్కురాలు కాకముందే చేస్తే కొందరు ఆ తర్వాత 3,4 ఏళ్లకే….. సరే…

బుర్రకథ-burrakatha

Burrakatha జానపద ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్ర కథ. కథకుని చేతిప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీర గాథలు, త్యాగమూర్తుల కథలు బుర్ర కథల ఇతివృత్తాలవుతాయి.ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తోంది. కుటుంబ నియంత్రణ, రాజకీయ ప్రచారం, ప్రజలను విజ్ఙానవంతులను చేయడం వంటి కార్యక్రమాలలో ఇది బాగా వాడబడింది.జంగంకథ, పంబలకథ, జముకులకథ, పిచ్చుకుంట్ల కథ, తరువాతవచ్చింది.డాలు, కత్తితో పాడే ప్రధాన కథకుడికి పిచ్చిగుంట్ల కథలో ఇద్దరు…

హరికథ

హరినామాన్ని కథగా ప్రచారం చేయడమే హరికథ.  పురాణాలలో నారదుడు  హరి నామాన్ని ప్రచారం చేసినట్లు, దానివల్ల మొదటి కథకుడు నారదుడే అని కొంత మంది అభిప్రాయం. ఈ ప్రదర్శన కళ ఆంధ్రదేశంలో అన్ని జానపద కళారూపా లతో కలసి ప్రదర్శింపబడుతూ నేటికీ మంచి ప్రజాధారణ పాందిన కళగా చెప్పవచ్చు. ఈ కళారుూపం అటు పండితుల్ని ఇటు పామరుల్ని కూడా రంజింప చేయగల శక్తి కలిగినది. ఈ కళకు ఆంధ్ర ప్రాంతాల్లో మంచి వన్నె తెచ్చిన వారు 'ఆదిభట్ల…