రేనాటి చోళులు కడపవాసులే

నాటి ఎరిగల్‌ ఊరే నేటి ఎర్రగుడి.వెలుగులోకి తెచ్చిన శాసనాలు రేనాటి చోళులు కడప జిల్లా వాసులేనని, రేనాటి ధనుంజయుడి తొలి రాజధాని ఎరికల్‌ అయి ఉండొచ్చునని శిలాశాసనాల ద్వారా పరిశోధకులు నిర్ధరణకు వచ్చారు. ఎరికల్‌ పదం కాలక్రమేణా ఎరికల్లు, ఎరిగల్లు, ఎరికాల్వ, ఎరిగల్‌గా రూపాంతరం చెంది ఎర్రగుడి (ఎర్రని ఇటుకలతో నిర్మించిన పాత గుడి)గా మారిందని తెలిపారు. ఎర్రగుడి ప్రస్తుతం కమలాపురంలో ఉంది. రేనాటి చోళులు కర్ణాటకలోని నిడుగల్‌ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారన్న గత అంచనాలకు…

శ్రీకృష్ణదేవరాయలు బోయ వారా? srikrishanadevarayalu.

విజయనగర సామ్రాజ్య చరిత్ర గురించి ప్రత్యేకించి శ్రీకృష్ణదేవరాయల గురించి అసంఖ్యాకమైన గ్రంథాలు, కావ్యాలు వెలువడ్డా యి. అయినప్పటికీ ప్రజా బాహుళ్యంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత చరిత్ర దీనికి సంతృప్తికర సమాధానమివ్వలేకపోతున్నది. రాయల కులం విషయంలో పెద్ద సందిగ్ధత కొనసాగుతున్న ది. దేశంలో కులం ఒక చారిత్రక వాస్తవం. ఎంతటి చక్రవర్తులైనా కులం అనే ఈ సామాజిక చట్రంలో ఉండి తీరవలసిందే! రాయల వారసులు గా ఘనమైన వారసత్వము సొంతం చేసుకోవడం ద్వారా వర్తమానం లో ప్రభావశీలంగా…

శాతవాహనులు కర్నూలు వారా? నోలంబులే కురబలా?Sathavahanas belong to Kurnool?Kurabas are nolambs?

భౌగోళికంగా చూసినట్లయితే రాష్ట్రంలో  ఎంతో ప్రాచీనత గల ప్రాంతం రాయలసీమ. ఆర్కెమిక్ స శకానికి చెందిన వివిధ రాతి కుటుంబాలను ఇనుము మాంగనీసు, అభ్రకం, బంగారం , వజ్రములు వంటి ఖనిజ విశేషాలను ఈ జిల్లాల్లో గుర్తించారు. కొంత మంది భూ విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం కర్నూలు దాని పరిసర ప్రాంతాలు అతి ప్రాచీనకాలంలో జలమయమైనవిగా భావిస్తారు అప్పటికి మానవజాతి పుట్టలేదు. నల్లమల, ఎర్రమల, శేషాచలం కొండలు, తూర్పు కనుమలు విశేషంగా ఈ జల్లాల్లో పరివ్యాప్తి చెందాయి…

అనంతపురం జిల్లా సింహగిరిచరిత్ర మీకు తెలుసా? simhagiri history?

              అనంతపురం జిల్లాలో ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల మధ్య గల ఊరే మడకశిర. ఇది చారిత్రక ప్రాశస్త్యం గల ప్రాంతం. మరాఠా రాజుల పరిపాలన తర్వాత మడకశిర పాలెగాళ్ళ సంస్థానంగా పేరుగాంచింది. ఆ సమయంలో నిర్మించిన కోటలు, బురుజులతో అలరారిన ‘సింహగిరి’ కాల క్రమంలో మడకశిరగా రూపాంతరం చెందింది. ఇలాంటి మడకశిర ప్రాచీన చరిత్రను గ్రంథస్థం చేసిన ఘనత శ్రీ కరణం సత్యనారాయణరావుకి దక్కుతుంది. బహు భాషా వేత్తలైన…

స్వాతంత్ర్యోద్యమం – అనంతకవిత్వం – anantha kavitwam.

అనంత సాహిత్య చరిత్ర గురించి మనకు దొరికే ఆధారాలు తక్కువ. స్వాతంత్ర్యోద్యమం కాలంనాటి సాహిత్యం దొరికేది కొంత. అదీ పప్పూరి రామచారిగారి “ సాధన” పత్రికనుంచే ఎక్కువ దొరుకుతుంది. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, పప్పూరి రామాచార్యులు , విద్వాన్ విశ్వం, చిలుకూరి నారాయణ రావు, బెళ్ళూరి శ్రీనివాస మూర్తి , కుంటిమద్ది శేషశర్మ, హెచ్.నారాయణరావు , కల్లూరి వెంకట నారాయణ ,ఎ.సి. నరసింగరాజు, బత్తలపల్లి నరసింగరాజు, కలచవీడు శ్రీనివాసాచార్యులు, ఎల్లమరాజు నారాయణభట్టు, టి. గురుమూర్తి, పంచాంగం సూరప్ప, జె…