ఎరికల్ – ఎర్రగుడిపాడుerragudipadu,erikal

రేనాటి చోడుల రాజధాని చెప్పలి లో ప్రాచీన అగస్త్యేశ్వర ఆలయం.source: rayalaseema fb 'ఎరికల్' అన్న పదానికి తెలుగు భాషా చరిత్రలో, తెలుగువారి చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి తెలుగు శాసనం కలమళ్ల శాసనం ఎరికల్ ముతురాజు ధనుంజయుడు వేయించగా, ఎర్రగుడిపాడు శాసనంలో కూడా 'స్వస్తిశ్రీ ఎరికల్ముత్తుర్రాజు' అని ఉంటుంది. తొట్టతొలి తెలుగు శాసనాల్లో (కలమళ్ళ, ఎర్రగుడిపాడు, తిప్పలూరు, ఇందుకూరు మొ.) మనకు ప్రధానంగా మూడు సారూప్యతలు కనిపిస్తాయి. అన్నీ కడప జిల్లాలో లభ్యమైనవిఅన్నీ రేనాటి…

గుడిబండకు ఆపేరెలా వచ్చిందో తెలుసా ? Gudibanda.

        ఒకప్పుడు బండకొండగా పేరుగాంచిన ప్రాంతమే నేడు గుడిబండగా పిలువబడుతోంది.క్రీ.పూ. 17వ శతాబ్దం క్రితం గుడిబండ కోటలో  రాహుత్త మహారయ అనే రాజు పరిపాలిస్తుండే వాడు.ఆయన 90ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండపై కొండ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు.        కొండపై సుందరమైన కొలనులు, కోటగోడలు, బందిఖానా, నంది విగ్రహం, ఫిరంగులు, సొరంగాలుఇక్కడ దర్శనమిస్తాయి. పూర్వీకులు చెక్కిన శిలలు, రాతలు నేటికీ దర్శనమిస్తున్నాయి. ఇదేగాకగుడిబండ కొండపై ఉన్న కొలనులో …

ఆ ఊళ్లో నాయకులు లేరు నాయకత్వం ఉంది. pandurangauram.

పాండురంగాపురం ఆ గ్రామం ఆదర్శానికే ఆదర్శమని చెప్పడానికి సందేహం అవసరం లేదు. కృషి ,పట్టుదల ,నీతి,నిజాయితీ , నియమాలు కట్టుబాట్లు తదితర అనేక అంశాలను ఆ గ్రామం నేటికీ అమలు చేస్తోంది . నిక్కచ్చిగా నిజాయితీగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆ గ్రామస్తులు ఐక్యత అనిర్వచనీయం.12-8-1957 న ఈ గ్రామానికి శంకుస్థాపనజరిగింది. 19కుటుంబాలతో గ్రామం ఏర్పడింది. నా 53 సంవత్సరాల జీవితంలో 12సంవత్సరాల ఈనాడు రిపోర్టర్ గా 5 సంవత్సరాల ఎమ్మెల్యే పి.ఎ గా జీవితంలో…

అంతర్జాతీయ ఆద్యాత్మిక కేంద్రం గొల్లపల్లె తెలుసా?- gollapalli .

Pic source vunta somu fb.         నేటి పుట్టపర్తి నాటి గొల్లపల్లి ఒకనాడు చుట్టూ దట్టమైన అడవులుండేవి. ఇప్పుడున్న రోడ్ మార్గం లేదు. కేవలం బండి బాట ఉండేది. కర్నాటనాగేపల్లి నుంచి గొల్లపల్లి కి ఎద్దుల బండిలో వచ్చేవారు. చిత్రావతి ఏరు వస్తే ఊరుదాటి వెళ్లాలంటే గగనమే. బుక్కపట్టణం చెరువు లో నీళ్లు లేకపోతే బుక్కపట్టణం నుంచి చెరువు లో నుంచి నడిచివెళ్లేవారు. కమ్మవారి పల్లి నుంచి పాలు కొత్తచెరువు ,బుక్కపట్టణం…

సోమందేపల్లి కి ఆ పేరెలా వచ్చింది. Somandapalli

అనంతపురం జిల్లా సోమందేపల్లి గ్రామానికి ఆపేరు ఎలా వచ్చిందంటే అల్లసాని పెద్దన తెలుగు కవిత్వానికి మెచ్చిన విజయనగర సామ్రాజ్యాధినేత అయినా శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన మాతృమూర్తి అయినా శ్రీమతి సోమిదేవమ్మ పేరిట అగ్రహారంగా ఇచ్చిన నాటి సోమిదేవమ్మపల్లే నేటి సోమందేపల్లి. విజయనగర సామ్రాజ్యాధినేత విడిది క్షేత్రమైనపెనుకొండ కు సమీప లో ఈ గ్రామం ఉంది. మనుచరిత్రతో ఆంధ్రుల మనసు రంజింప చేసిన అల్లసాని పద అల్లికల స్థానమైన నాటి అగ్రహారం ఈ సోమిదేవమ్మపల్లే..నేటి సోమందేపల్లి.

కదిరి_Kadiri

    కదిరి పరిసర ప్రాంతాలను 3 వ శతాబ్దంలో పల్లవ రాజులు, 7వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజులు పాలించారు. క్రీ.శ 985 _1076  మధ్యకాలంలో పశ్చిమ చాళుక్యులు పరిపాలించారు. కదిరి లో లక్ష్మీనరసింహాస్వామి ఆలయం నిర్మించక ముందు చాళుక్యులు క్రీ.శ. 965-1076 కాలంలో దుర్గాదేవి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. దుర్గాదేవి విగ్రహాన్ని కృష్ణవర్ణశిలతో అతి సుందరంగా చెక్కించి తమకాలపు ప్రత్యేకతను నాటి రాజులు చాటుకున్నారు. వీరి తరువాత క్రీ.శ1191…

పుంగనూరుకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?_punganur

Punganur cows                రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో లో పుంగనూరు అనే ఊరు ఉంది. పుంగనూరు అసలు పేరు పుంగ పురి. ఈ ఊరు పూర్వం పరుశురామ క్షేత్రం గా పేరుగాంచింది. చోళుల కాలంలో దీనిని పులనాడు అనేవారు.            పుంగన్ లేదా పుంగవన్ అంటే తమిళంలోమునిశ్రేష్టుడని అర్థం. ముని పుంగవుడైన వాల్మీకి ఈప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్నారని ప్రతీతి. అందుకే ఆయన పేరుతో…