🎼 సంగీత, సాహిత్య సౌరభాల “రాళ్లపల్లి” జయంతి నేడు.Rallapalli✒️

రాళ్లపల్లి అనంతకష్ణ శర్మ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా (నేటి కంబదూరు మండలం)లోని రాళ్లపల్లిలో 1893 జనవరి 23న జన్మించారు. తల్లి అలమేలు మంగమ్మ వద్ద సంగీతం, తండ్రి కృష్ణమాచార్యుల వద్ద సంస్కృతాంధ్ర కావ్యాలు నేర్చారు. ఆయన తల్లి అలివేలు మంగమ్మ సంగీత గురువులు. ఆమె సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళ భాషలలోని భజన కీర్తనలు, పెళ్ళి పాటలు, జోలపాటలు, పూజ పాటలు కథా గేయాలు చిన్ననాడే శర్మగారికి నేర్పింది. మేనమామ గారి ప్రోత్సాహంతో ఫిడేలు వాయించడం…

పెనుకొండ వాసి పెయింటింగ్స్ సాలార్ జంగ్ మ్యూజియం చేరాయి.C.N.Venkatrao

సి.యన్.వెంకటరావు రాయలసీమ రమ్య చిత్రకారుడు సి.యన్.వెంకటరావు శ్రీ సి.యన్. వెంకటరావు అంధ్రప్రదేశ్ యందు సుప్రసిద్ధ చిత్రకారులు శ్రీ నారాయణరావు సత్యభామాబాయి అను పుణ్యదంపతులు వీరి తల్లిదండ్రులు. అనంతపురం జిల్లా పెనుగొండ లో నివశించారు. వేలూరు, నెల్లూరులందు విద్యాబ్యాసము.బాల్యము నుండి యే వీరికి చిత్రకళయందు అభిరుచి మెండు తత్పలితముగా అంజనేయుని చిత్రములను తరచుగా వేయుచుండెడివారు. చెన్నపట్టణము చిత్రకళా పాఠశాల యందు మూడు సంవత్సరాలు శిక్షణ పొంది యోగ్యతా పత్రము పొందిరి, అనంతరము అనంతపురమందలి పురపాలకోన్నత పాఠశాలయందు చిత్రకళాధ్యాపకులుగా చేరి…

ఇతని గళం గర్జించే మేఘం

అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు గ్రామానికి చెందిన పోలప్ప నారాయణమ్మల కుమా రుడు. 1999లో భారత జన విజ్ఞాన సమతి ఆధ్వర్యంలో ప్రభుత్వం గతంలో నిర్వహించిన అక్షర దీక్ష కార్యక్రమం ద్వారా పరిచయమైన కంచు కంఠంపాటలద్వారా - చదువు ఆవశ్యకతను చైతన్యాన్ని కలిగించాడు.  ఇతని గళం... గర్జించే మేఘం!  ఇంటర్మీడియేట్ తో  చదువు ఆపేశాక అమ్మకు కిడ్నీ దెబ్బతినడంతో ఇల్లు గడవడం కష్టమైంది. అప్పుడు ప్రజా వైద్యశాలలో దినకూలీగా పనిచేస్తూ ఓ వైపు ఇంటిని పోషించుకుంటూ మరోవైపు నాటకాలు, పాటలలో ఆసక్తి చూపాడు.…

ఉరుముల వాయిద్యం కళా సాంప్రదాయం – Vurumula naatyam

ఉరుముల నృత్యం అనంతపురము జిల్లాలో ప్రసిద్ధమైంది. జిల్లా సరిహద్దులలోని కర్ణాటక ప్రాంతాలకు విస్తరించింది. మాలల లోని ఒక తెగవారు ఈ కళారూపాన్ని సంప్రదాయంగా అనుసరిస్తారు. ఉరుములకు వీరణము అనే పేరు కూడా ఉంది. జానపద ప్రదర్శన కళారూపాలలో బృంద నృత్యానికి ఇది చెందుతుంది వాయిస్తూ, పాడుతూ నృత్యం చేస్తారు ఉరుము వాయిద్యాన్ని మేఘగర్జనలకు నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది. ప్రకృతిలో ఇలాంటి దృశ్యాలను చూసి జానపదులు ఉరుములు తయారు చేసి ఉంటారు. ఉరుములు వాయించే సందర్భంలో కుంచెల…

విస్కోసిటి సృష్టించిన కళాకోవిదుడు పద్మశ్రీ కృష్ణారెడ్డి_master printmaker krishna reddy.

చతుషష్టికళల్లో చిత్రకళ ఒకటి ! ఇది దృశ్యకళ ! ఆలోచనకు నైపుణ్యాన్ని జోడించి ఒక అర్థాన్ని అందించే ఈ కళ అందరికి సాధ్యం కాదు. మనిషి ఆశాజీవి ! ఈ క్రమంలో ప్రాచీన కాలం నుండి తన దైనందిక జీవితంలో సంతోషాన్ని కొత్తదనాన్ని వెదుక్కుంటూ అందుకు వివిధ మార్గాలను అనుసరించాడు. వీటిలో కొన్ని ప్రయోజనం ఆశించి కొనసాగించాడు. మరి కొన్ని సౌందర్యదృష్టితో కొనసాగించాడు. ఈ నేపథ్యంలో చిత్రకళ అనేది ప్రయోజనాన్ని అందిస్తూనే సౌందర్యాన్ని కూడా ఒలికిస్తున్న కళ…

1967 తర్వాత 53 ఏళ్ల కు పద్మశ్రీ దక్కించు కొన్న ‘అనంత’జిల్లా-Padmashri award dalawai chalapathi rao.

అనంత కలికితురాయి దళవాయిచలపతిరావుచిన్న పల్లెటూరు ను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడమే కాకుండా ఓ గుర్తింపు తెచ్చిపెట్టాడు. భారత దేశంలో ఆ గ్రామానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. దశదిశలా వ్యాపింపజేశారు. కళాసంపద సువాసనలు గుప్పించారు. అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకొని గ్రామానికేకాదు ,జిల్లా,రాష్ట్రానికే పేరు సంపాదించారు. అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మలాట కళాకారులు దళవాయిచలపతిరావు.ఈయనకు 2020 సంవత్సరానికి కళాకారుల విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. తోలుబొమ్మలాటకే ఓ గుర్తింపు. చలపతిరావు…

కలంకారి కళా నిపుణుడు కాచిరెడ్డి- kachireddy siva prasada reddy.

ఒక కళ చిరస్మరణీయం కావడానికి అది ప్రతిఫలించే విధంగా ఉండాలంటే ఒక వ్యక్తి భావనా శక్తి పై ఆధారపడి ఉంటుందనే వాస్తవానికి చక్కటి నిదర్శనం కలంకారి కళలో రాష్ట్రపతి చేతుల మీదుగా రెండు సార్లు జాతీయ అవార్డు అందుకొన్న మన రాయలసీమ రత్నం కాచిరెడ్డి శివప్రసాదరెడ్డి.మనుషుల్లో సృజనాత్మకత వికసించడానికి మనిషి మనిషిగా జీవించడానికి సాంస్కృతిక చైతన్యం అవసరం. సాంస్కృతిక చైతన్యం అనేక రూపాల్లో ఉంటుంది. అందులో కళారూపం ఒకటి. రాయలసీమ సాహిత్యంలో ఇలా ఎన్నో కళలు రూపుదిద్దుకున్నాయి.…