రాయలసీమ కవితలు3-Rayalaseema kavitalu3

(రాయలసీమ పాట) పల్లవి కాలే కడుపుల చిరునామ….కరువు రక్కసికి వీలునామ…అతుకుల బతుకుల సరంజామ…రాయలేలిన ఈ సీమ….రాయలేని కన్నీటి సీమ ||కాలే|| చరణం 1 రతనాల రాశులెటు పోయెను…వ్యసనాల బతుకులే మిగిలిను…కోటి కష్టాల కడలిలో..తలమునకలై ఎదురీదినా…మెతుకుల కొరకు గతుకుల దెబ్బలు… ఎన్నెన్నొ తగులుతున్నా…ఆగిపోనీ జీవనపోరాటం …సాగుతున్న తీరని ఆరాటం …||కాలే|| చరణం 2: పసిడి పంట పండాలని..ఆలి పుస్తెలమ్మి పని చేసినా.ఎముకల సున్నం కరిగెను…. ఎండమావులే మిగిలెను.ముప్పై ఎకరాలున్నా గానీ….పూటగడవనీ దీనావస్థతలో…అలుపే ఎరుగని హలికుని శ్రమ దానం..అలుసౌతున్నది ఆ…

రాయలసీమ కవితలు2-Rayalaseema kavitalu2

పల్లవి. ఎన్నాళ్ళని వేచి ఉందువు ఓరన్న నీవు రాయలసీమరైతు సోదరా ఓరన్న నీవు రాయలసీమ రైతు సోదరా అనుపల్లవి.. చరణం 1… ఎండిపోయిన పంటభూమి ఇగిరిపోయిన నదులనీళ్ళుబతుకు నీడ్చ భారమయిన బాధతీర్చు నాథుడెవరు? మధ్యయుగం దొరలంతా దగా చేసి దండుకున్న -చేయిచాచి అడగలేదు నిలదీసి అడగలేదుమోచేతి నీళ్ళు విడిచి మొఖమెత్తి నిలవరించినిధులు నీళ్ళు నౌకరికి ఉద్యమాల బాటనడువు. "ఎన్నాళ్ళని" చరణం 2 తమిళతంబి వేరుపడగ బళ్ళారీ బాటమారెతెలుగు రాయల సంస్కృతి కన్నడరాయలగ మారెతుంగభద్ర, బళ్ళారి ఇనపగనులు విడిపోయెకర్నూలు…

రాయలసీమ కవితలు-Rayalaseema kavitalu

చిత్రమేలి రాయల సీమ రతనాల దట్టి పాలూరు భూముల పగడాల పట్టి || పల్ల వి||కాని… కరవు రక్కసి వచ్చి తలపులు తట్టేకరువు బండలు మోయ తలవంచి పెట్టె || అనుపల్లవి|| చిరు ధాన్యములకు చీరా మాగాణిసేరున్న పంటలకు పెన్నామాగాణిపుడమి పులకింతలకు పొద్దు సింగారంకోరినా వరములకు కొంగు బంగారం ||పల్లవి|| దానిమ్మ నారంజ చెరకు వరి తోటల్లోదాసంగములకు దవనంపు ఘుమ ఘుమలుదాసరయ్యులు వచ్చి గోవిందా యనగానేడు- శప్త శపథాలకు కాడు బీడుళ్లు ||పల్లవి|| ముసలమ్మ బందక్క వీరనాగమ్మలుచెరువులకు బలులైరి…