సీమ నేల తల్లి ( పాట )

సాకీ:- మద్రాసు మహానగరంలోశ్రీబాగ్ సదనంలోపురుడు పోసుకొనెను సీమ!రాణకెక్కెను రాయల సీమ !!ఆనాడే తొలికేకయినదిసీమస్వరం!ఈనాటికి పొలికేకయినదినిరంతరం!! పల్లవి:-రాయలేలిన సీమరతనాల సీమయనిరసరమ్య రాగాలు తీసేమురాళ్ళరప్పల సీమనీమరచేము !!రా!! 1వ చరణం:-శ్రీశైల మల్లన్నశేషాద్రి వెంకన్నఒంటిమిట్ట రామన్నకదిరి నరసింహన్నచల్లంగ కాపాడు"చల్లకుండ"రా సీమకఱవులెన్ని కలచినాసురకల్పతరువు సీమ!!రా!!2వ చరణం:-సీమశౌర్యపతాకమేసైరా నరసింహారెడ్డివిశ్వజనుల మేల్కొల్పెనువిశ్వకవి వేమన్నఅచ్చతెనుగు పాటలతోఅలరించెను అన్నమయ్యకాలజ్ఞానం పలికికళ్ళుతెరిపించెను వీరబ్రహ్మం!!రా!!3వచరణం:-అలనాడు అలుముకొనెనుగడియడవుల కానలు !అందుకే నెలకు మూడుఅమృతపు జడి వానలు!!పసిడి పచ్చల సౌరులుపరిమళించె నానాడుపైరుపంటల సిరులుపొంగి పొరలె నాడు!!రా!!4వచరణం:-ఈనాడు కొండలన్నిబోడికొండలాయెనానాటికి తరులు లేకగిరులు చిన్నబోయెవరుణ కరుణ వర్షించకవాగులువంకలు…

హనుమ జన్మభూమి అంజనాద్రి

హనుమ జన్మభూమి అంజనాద్రిఆధారాలు చూపిన తితిదే Pc: enaadu తిరుమల వేంకటాచలాన్నే ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రిగా శ్రీరామనవమి పర్వదినాన తితిదే అధికారికంగా ప్రకటించింది. తిరుమలలోని నాదనీరాజనం మండపంలో బుధవారం తితిదే అధికారులతో కలిసి సమావేశమైన పండిత పరిషత్‌ ఈ మేరకు తమ పరిశోధనల ఫలితాలను వెల్లడించింది. చారిత్రక, వాంగ్మయ, భౌగోళిక, శాసనపరమైన ఆధారాలతో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు పండిత పరిషత్‌ ఛైర్మన్‌, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధరశర్మ స్పష్టం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి హనుమంతుడి…

వసంత గీతాలాపన

తిరుపతి వెంకట కవులు చెప్పినట్లు కవికి సామాజిక జీవితం బలంగా ఉంటే కవిత్వం మరింత శక్తివంతంగా అభివ్యక్తమవుతుంది. కవిత్వానికి కులం లేదు. మతం లేదు. ఉమాదేవికి సమాజం పట్ల ఎంతో ప్రేమ  ఉంది. సమాజంలో  ఉన్న పేదరికం తొలగిపోవాలని సమాజం పచ్చగా నిండుగా ఉండాలని ఆశిస్తోంది. అందువలన ఆమె కవిత్వంలో అనేక సామాజికాంశాలు కనిపిస్తాయి.కవితా పిట్టలులో బాల కార్మికులుగా మగ్గిపోతున్న బాల్యం గురించి, ఇళ్ల కాపలా దారుల  గురించి ,  కరువుతో వలస పోతున్న జనాల గురించి,…

నాచనసోమన Naachanasomana

_పిళ్లా కుమారస్వామి 9490122229 ‌‌ ‌ నాచనసోమన కడపజిల్లా కమలాపురం తాలూకాలోని తుడుమలదిన్నె లో జన్మించారు. ఆయన ఉత్తరహరివంశమనే ప్రబంధకావ్యాన్ని రచించారు. ఇది జనాదరణ పొందిన కావ్యం. నాచన సోమన 14వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత పొందిన కవులలో ఒకరు. విజయనగర సామ్రాజ్య పరిపాలకుడైన వీర బుక్కరాయలు నాచన సోమనకు పోషకునిగా వ్యవహరించారు. బుక్కరాయల నుండి ' పెంచకల దిన్నె' అగ్రహారాన్ని బహుమానంగా పొందాడు. అది పూర్వపు జమ్మలమడుగు తాలూకాలో వుండేది. నాచనసోమన సాహిత్యంలో  తిక్కన యుగానికి చెందిన కవి. సోమన కాలాన్ని గురించి…

రేనాటి చోళులు కడపవాసులే

నాటి ఎరిగల్‌ ఊరే నేటి ఎర్రగుడి.వెలుగులోకి తెచ్చిన శాసనాలు రేనాటి చోళులు కడప జిల్లా వాసులేనని, రేనాటి ధనుంజయుడి తొలి రాజధాని ఎరికల్‌ అయి ఉండొచ్చునని శిలాశాసనాల ద్వారా పరిశోధకులు నిర్ధరణకు వచ్చారు. ఎరికల్‌ పదం కాలక్రమేణా ఎరికల్లు, ఎరిగల్లు, ఎరికాల్వ, ఎరిగల్‌గా రూపాంతరం చెంది ఎర్రగుడి (ఎర్రని ఇటుకలతో నిర్మించిన పాత గుడి)గా మారిందని తెలిపారు. ఎర్రగుడి ప్రస్తుతం కమలాపురంలో ఉంది. రేనాటి చోళులు కర్ణాటకలోని నిడుగల్‌ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారన్న గత అంచనాలకు…

సాహిత్యంపై మక్కువ పెంచే కథలు

శుకసప్తతి అంటే చిలుక చెప్పిన 70 కథలు కావచ్చు లేదా చిలుక డెబ్బైరాత్రుల్లో చెప్పిన కథలూ కావచ్చు. అయితే పాలవేకరి కదిరీపతి రాసిన శుకసప్తతిపద్యకావ్యంలో 70 కథలు లేవు, 70 రాత్రుల్లోనూ చెప్పలేదు. అయితే ఇందులోనికథలు 70 రోజులు చెప్పినట్లు కావ్యం చివర తెలుస్తూ వుంది. అంటే కొన్ని కథలులభించలేదని గ్రహించాలి.శుకసప్తతి కథ ఏంటంటే .... భర్త ఇంట్లో లేనప్పుడు భార్య ఒక మధ్యవర్తి(దూతిక) ప్రలోభంతో పరపురుషున్ని కలవడానికి ప్రయత్నిస్తూ వుంటుంది. ఆఇంట్లో ఉన్న పెంపుడు చిలుక…

సర్దేశాయి తిరుమలరావు

‌ సర్దేశాయి తిరుమలరావు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు జొహరాపురం లో జన్మించారు ఈయన మాతృభాష కన్నడం ఉన్నత విద్య కోసం అనంతపురం వచ్చి దత్తమండలం కళాశాలలో బీఎస్సీ చదివారు రాజస్థాన్లోని బిర్లా కళాశాలలో ఎమ్మెస్సీ రసాయన శాస్త్రం చదివి అక్కడే సాయిబాబా జాతీయ కళాశాలలో ఒక ఏడాది ఉపాధ్యాయుడిగాపనిచేశారు. అనంతపురంలోనే ఉన్న తైలసాంకేతిక పరిశోధన సంస్థలో 1954లో జూనియర్ కెమిస్ట్ గా చేరారు. క్రమక్రమంగా ఎదిగి ఆ సంస్థకే సంచాలకులయ్యారు. 1986లో పదవీ విరమణ చేసి…

నూతలపాటి గంగాధరంNutalapaati gangadharam

నూతలపాటి గంగాధరం చిత్తూరు జిల్లా నాగలాపురం సమీపంలో గల రామగిరి గ్రామం లో డిసెంబర్ 15 1939 న మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. విద్వాన్ చదివి ఉపాధ్యాయునిగా పనిచేశారు సంప్రదాయ సాహిత్యాన్ని చదువుకొని ఆధునిక రచయిత గా ఎదిగిన నూతలపాటి అభ్యుదయ రచయిత. చీకటి నుండి వెలుగులోకి అన్నవి ఆయన కవిత్వ సంపుటాలు.కాగితం పులి అనే నవల రాశారు.శివాజీ కల అనే కథలు కూడా నూతలపాటి రచించారు అంతేగాక నూతలపాటి చాలా విమర్శలు రచించారు.…

పైడి లక్ష్మయ్య__

పైడి లక్ష్మయ్య ఏప్రిల్ 26, 1904 తేదీన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో పేరూరి అచ్చంపల్లి గ్రామంలో ముసలప్ప, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య ముగించి అనంతపురంలోని దత్తమండల కళాశాలలో 1932లో తెలుగు ప్రధానాంశంగా బి.ఏ. డిగ్రీ పొందారు. మద్రాసులో న్యాయశాస్త్రం పూర్తి చేసి 1937లో న్యాయవాదవృత్తిని స్వీకరించాడు.వీరు స్థానిక పరిపాలనా రంగంలో ప్రజా ప్రతినిధిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.1942 నుండి 1947వరకు అనంతపురం జిల్లా బోర్డు అధ్యక్షులుగా వుండి జిల్లా అభివృద్ధికి కృషి చేశారు.…