రాయలసీమ ఇన్ఫో డాట్ ఇన్ వెబ్సైట్ రాయలసీమ వాసులకు, రాయలసీమ పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగినవారికి, పరిశోధన చేయాలనుకున్న వారందరికీ సరైన సమాచారం అందించడానికి ఏర్పడినది. దీనిని ప్రజా ప్రయోజనం కోసం మాత్రమే ఏర్పాటు చేయడమైనది. ఇది వెబ్ వార్తా పత్రిక కాదు. ఇది ఒక లైబ్రరీ లాగా అందుబాటులో ఉన్న సమాచారం కేంద్రం లాంటిది. ఇందులో పొందు పరిచిన అంశాలన్నీ దాదాపు నిర్ధారించిన విషయాలే ఉన్నాయి. ఇందులో ఎవరైనా తమకు తెలిసిన అంశాలను పొందుపరచాలని భావిస్తే మమ్మల్ని సంప్రదిస్తే వాటిని ఇందులో పొందుపరచడానికి తోడ్పడగలం.
Editorial Board

చందమూరి నరసింహారెడ్డి
9440683219
కలం పేరు : చందమూరి.
ప్రస్తుత వృత్తి వ్యాపారం , అనంతపురము జిల్లా కదిరి నివాసం. 1988నుంచి 2000వరకు ఈనాడు రిపోర్టర్ గా బుక్కపట్టణం, పుట్టపర్తి, కదిరి లో పనిచేశారు . 1996లో రాష్ట్ర స్థాయిలోఉత్తమ గ్రామీణ విలేఖరి గా ప్రథమ బహుమతి లభించింది. ఖాసాసుబ్బారావు అవార్డు పొందారు . కదిరి లో 1996నుంచి2000వరకు ఖాద్రీ న్యూస్ రీడర్ గా పనిచేశారు . 1999నుంచి2004వరకు కదిరి శాసనసభ్యులు యం.యస్.పార్థసారథి పిఏ గా పనిచేశారు . రచనా వ్యాసంగం హాబి గా కొనసాగిస్తున్నారు .

పిళ్ళా విజయకుమారస్వామి రెడ్డి
కలం పేరు : పిళ్లా కుమారస్వామి , పిళ్ళా విజయ్.
ఎల్ఐసి లో అబివృద్ది అధికారిగా కదిరిలో పనిచేస్తున్నారు.ప్రవృత్తిరీత్యా ఈయనకథలు,కవిత్వం,సమీక్షలు రాస్తున్నారు.వీరు ప్రపంచీకరణ పైపోటెత్తిన కవితాసముద్రం(విమర్శ వ్యాసం), ఆధునికసాహిత్య పరిణామక్రమం, మట్టిపోగు(కవిత్వం), లెనిన్ జీవిత కథనం, శుకసప్తతి కథలు,విశద(సాహిత్య విమర్శ వ్యాసాలు) మొదలైన గ్రంధాలను రచించారు.