విస్తీర్ణం:1,125 చ.కి.మీ. లు

జనాభా :21.15 లక్షలు (1971),పురుషులు 10.86 లక్షలు, స్త్రీలు 10.20 లక్షలు

జన సాంద్రత : చ.కి. మీ కు 111 మంది

ముఖ్య కేంద్రం : అనంతపురం

మౌర్యులు, పల్లవులు, చాళక్యులు, రాష్ట్రకూటులు, చోళులు, విజయనగర రాజులు, మొగలాయీలు. బ్రిటిష్వారు మొదలైన వారు పాలించిన ఈ ప్రాంతం చారిత్రకంగానే కాకుండా వజ్రాలకు, శిల్పాలకు పేరెన్నిక గన్నది. 1882 లో ఈ ప్రాంతం అనంతపురం జిల్లాగా అవతరించింది.

భౌగోళిక స్వరూపం : ఈ జిల్లా దత్త మండల జిల్లాలలో దక్షిణ భాగాన చిట్టచివరిది. ఉత్తరాన కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రం దక్షిణాన కర్నాటక రాష్ట్రం, తూర్పున చిత్తూరు, కడప జిల్లాలు, పశ్చిమాన కర్నాటక రాష్ట్రం దీని సరిహద్దులు. జిల్లా స్వరూపాన్ని బట్టి దీనిని ఉత్తరప్రాంతం మధ్యప్రాంతం, పీఠభూమిప్రాంతం అని మూడుభాగాలుచేయవచ్చు. రాష్ట్రంలోని అనావృష్టి ప్రాంతాలలో ఇది మొదటి జిల్లా, దీనికి కారణం దక్షిణ భారత ద్వీపకల్పంలో దీని భౌగోళికపరిస్థితే, జిల్లా ఉత్తర ప్రాంతమైన గుత్తి, తాడిపత్రి తాలూకాలలో ఎక్కువభాగం నల్ల రేగడినేలలు. దక్షిణ భాగమైన హిందూపూరు, మడక శిర తాలూకాలు మైసూరు పీఠభూమిలో భాగాలు, జిల్లాలో ఎర్ర ఇసుక, ఎర్రనేల, ఎర్రరేగడి, నల్లనేల, నల్లరేగడి, నల్ల ఇసుక నేలలు అని ఆరు విధాలయిన నేలలు ఉన్నాయి. జిల్లాలో పేర్కొనదగిన కొండలు ముచ్చు కోట. నాగ సముద్రం, మటల్లప్ప కొండలు.

శీతోష్ణస్థితి, వర్షపాతం: వేసవిలో వేడి ఎక్కువ. పీఠభూమి ప్రాంతం తక్కిన ప్రాంతం కన్నా చల్లగా ఉంటుంది. గాలిలో తేమతక్కువ. దైనిక గరిష్ఠ ఉష్ణోగ్రత 12.5C, కనిష్ట ఉష్ణోగ్రత 21.5°C, సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత 40.6 అత్యల్ప ఉష్ణోగ్రత 12.2°C. రాష్ట్రమంతటిలోను అత్యల్ప వర్షపాతం గల జిల్లా ఇదే. సంవత్సరంలో వర్షంపడే సగటు రోజులు 39.9, సగటు వర్షపాతం 545 మి.మీ. పెనుగొండలో అత్యధిక వర్షపాతం,
కళ్యాణ దుర్గంలో అత్యల్ప వర్షపాతం ఉంటాయి.
నదులు: ముఖ్యమైన నది పెన్నా నది. ఇతర నదులు చిత్రావతి, దాని ఉపనది. కుశావతి, స్వర్ణముఖి, తడికలేరు, పండమేరు, మద్దిలేరు, పాపాఘ్ని మొదలైనవి.

అడవులు: అడవుల విస్తీర్ణం 1,93,690 హెక్టార్లు, అంటే జిల్లా విస్తీర్ణంలో 10.1 శాతం అడవి ప్రాంతం. రాష్ట్రమంతటిలో తక్కువ అడవులున్న జిల్లా ఇదే. ఉన్న అడవులు ఆర్ధికంగా విలువైనవి కావు. జిల్లా అడవులలో చాలాభాగంలో చెట్లు లేవు. కదిరి, పెనుగొండ తాలూకాలలో మాత్రం దట్టమైన అడవులున్నాయి. కలప, వెదురు, వంట చెరుకు ఈ అడవుల నుంచి లభిస్తాయి.

ఖనిజ సంపద: ధర్మవరం తాలూకా రామగిరివద్ద బంగారుగని ఉంది. వజ్రకరూర్, లత్తవరం వద్ద వజ్రాలు లభిస్తాయని ప్రతీతి. తాడిపత్రి అనంతపురం రోడ్డు సమీపంలో మేలురకం ముగ్గురాయి లభిస్తుంది. తాడిపత్రి తాలూకాలో సున్నపురాయి లభిస్తుంది.

వ్యవసాయం, వంటలు : మెట్టభూమి ఎక్కువ కాబట్టి ప్రధానమైన పంట జొన్న, ఇతర పంటలు వరి, సజ్జ, కొర్ర, వ్యాపార పంటలు వేరుశెనగ, ప్రత్తి, ఆముదాలు, మిరప, ధనియాలు; పప్పు ధాన్యాలలో ఉలవలు ముఖ్యమైనవి. తోటలలో దానిమ్మ, ద్రాక్ష, జామ ముఖ్యమైనవి. మొత్తం పంటభూమి 5,59,000 హెక్టార్లు, ఆహార పంటల భూమి 3,90,000 హెక్టార్లు. వరి 1,000, హెక్టార్లు, శాశ్వతమైన పచ్చికబయలు 26,000 హెక్టార్లు వ్యవసాయేతర ప్రయోజనాలకు 1,57,000 హెక్టార్లు ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 367 లక్షల టన్నులు. వరి ఉత్పత్తి 1,12,000 టన్నులు, హెక్టారుకు ఉత్పాదక శక్తి 1,869 కి.గ్రా. మొత్తం కమతాలు 2,80,576.

నీటిపారుదల, విద్యుచ్ఛక్తి: జిల్లాలో నదులు వర్షాధారమైనవి. చెప్పుకోదగిన నీటి వనరులు లేవు. జిల్లా మొత్తంలో 1,94,22(8 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. కాలువల ద్వారా 38,596; చెరువుల ద్వారా 58,783: బావుల ద్వారా 88,014; ఆయిల్ ఎలక్ట్రిక్ ఇంజన్ల ద్వారా 11,835 హెక్టార్ల భూమి సాగవుతున్నది. మొత్తం పంట భూమిలో నీటి పారుదల సౌకర్యం గల భూమి 19.6 శాతం. 1980 మార్చినాటికి 736 గ్రామాలకు విద్యుచ్ఛక్తి సౌకర్యముంది.

పరిశ్రమలు : అనంతపురం, గుంతకల్లు, హిందుపూరు పారిశ్రామిక కేంద్రాలు. ఆహా రోత్పత్తుల మిల్లులు, కాటన్ టెక్స్టైల్స్ ప్రధాన పరిశ్రమలు. ఈ జిల్లాలో ఒక ఆయిల్ టెక్నలాజికల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. పరిశ్రమల వార్షిక నివేదిక ప్రకారం ఈ జిల్లాలో 227 పరిశ్రమలు, వాటిలో 7,113 ఉద్యోగులు ఉన్నారు. ఉత్పాదక మూలధనం రూ.660.16 లక్షలు, ఉత్పత్తి విలువ రూ. 3,088.82 లక్షలు. చేనేత తయారీలకు ఈ జిల్లా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ధర్మవరం పట్టు చీరలు,కళ్యాణదుర్గం కంబళ్ళు ఈ జిల్లా ఉత్పత్తులే. ఈ జిల్లాలో చిన్న తరహా పరిశ్రమల కింద 10.15 కోట్లరూపాయల పెట్టుబడితో 1,428 యూనిట్లున్నాయి.

మున్సిపాలిటీలు : 7 – అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, హిందూపురం, కదిరి, రాయదుర్గం, తాడిపత్రి.

రెవెన్యూ డివిజన్లు: 3 అనంతపురం, ధర్మవరం, పెనుగొండ

తాలూకాలు : 11 – అనంతపురం, తాడిపత్రి, గుత్తి, ఉరవకొండ, ధర్మవరం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, కదిరి, మడకసిర, పెనుగొండ.
నగరాలు : 11 – అనంతపురం, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, హిందుపురం, కదిరి, కళ్యాణదుర్గం, పెనుగొండ, రాయదుర్గం, తాడిపత్రి, ఉరవకొండ.

పంచాయతీ సమితులు 16; గ్రామాలు 958; గ్రామ పంచాయతీలు 736.
రవాణా : ‘పి. డబ్ల్యు. డి. నిర్వహణలో 1,620 కి. మీ; జిల్లాపరిషత్, పంచాయతీల నిర్వహణలో 6,120 కి. మీ. పొడవురోడ్లు ఉన్నాయి. 413 కి. మి.ల నిడివి రైల్వేమార్గాలున్నాయి.

సహకార సంఘాలు : జిల్లాలోని మొత్తం సహకార సంఘాలు 1,181. వీటిలో సహ కార సంఘాలు 1,005, చేనేత సహకార సంఘాలు 90, పారిశ్రామిక సహకార సంఘాలు 49, మత్స్యకార్ల సహకార సంఘాలు 11, పాలసరఫరా సహకార సంఘాలు 26.

విద్య : జిల్లాలో 2,198 ప్రాథమిక పాఠశాలలు, 135 అప్పర్ ప్రైమరీ పాఠశాలు, 152 సెకండరీ పాఠశాలలు, 14 జూనియర్ కళాశాలలు, 9 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇవికాక పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్, ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక పాలిటెక్నిక్ కళాశాల కూడా ఉన్నాయి. అక్షరాస్యుల శాతం 23.84. వైద్యం: 15 ఆలోపతి వైద్యశాలలు, 34 డిస్పెన్సరీలు, 50 ఆయుర్వేద వైద్యశాలలు ,3 యునాని వైద్యశాలలు, 1 హోమియోపతి వైద్యశాల ఉన్నాయి.
దర్శించదగ్గ ప్రదేశాలు: ధర్మవరం, పెనుకొండ, లేపాక్షి, గుత్తి, రాయదుర్గం, పెన్న హాబిలం, కదిరి, తాడిపత్రి, ఆలూరుకోన.

శాసనసభ నియోజక వర్గాలు: 14- కదిరి, నల్లమడ, గోరంట్ల, హిందూపురం, మడకసిర, పెనుకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుత్తి, సింగనమల,అనంతపురం,ధర్మవరం,తాడిపత్రి
లోక్ సభ నియోజకవర్గాలు: 2 హిందూపురం, అనంతపురం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s