రామకృష్ణారావు 1918, అక్టోబర్ 12 న కర్నూలులో జన్మించాడు. తన చదువులను మధ్యలోనే నిలిపివేసి 1936లో వేల్ పిక్చర్స్ సంస్థలో సహాయ ఎడిటర్‌గా సినీ రంగంలో ప్రవేశించాడు. 1939లో హెచ్.ఎం.రెడ్డి సినిమా మాతృభూమితో స్వతంత్ర ఎడిటర్ గా మారాడు. ఆ తరువాత స్టార్ పిక్చర్స్ సంస్థలో హెచ్.ఎం.రెడ్డి, హెచ్.వి.బాబు ల వద్ద సహాయదర్శకునిగా పనిచేశాడు.
హెచ్.వి.బాబు దర్శకత్వం వహించిన కృష్ణప్రేమ చిత్రానికి సహకార దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణకు, అందులో కథానాయిక భానుమతికి పరిచయం పెరిగి, అది ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది. దాంతో అప్పట్లో కృష్ణప్రేమ, రామకృష్ణప్రేమగా మారిందని జోక్‌ చేసేవారు. 1943లో వీరు ప్రముఖ నటి భానుమతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.ప్రేమ వివాహం కు మొదట భానుమతి తండ్రి అంగీకరించలేదు. భానుమతి అలిగి తిండి మానేసి 15 రోజులు ఇంట్లోనే ఉండిపోవడం తో వారి బంధువులు అందరూ నచ్చజెప్పడంతో తండ్రి అంగీకరించారు.

భానుమతి – రామ‘కృష్ణ ప్రేమ’ వివాహం

‘కృష్ణప్రేమ’ (1943) షూటింగ్లో తొలిసారిగా ఆ చిత్రానికి పనిచేస్తున్న అసోసియేట్ డైరె క్టర్ రామకృష్ణతో భానుమతి ప్రేమలో పడ్డారు. పెళ్లిచేసుకుంటే ఆయన్నే చేసుకోవాలి అనే నిర్ణ యానికి కూడా వచ్చేసింది భానుమతి. వీరి పెళ్లికి భానుమతి తండ్రి ఒప్పుకోలేదు. కారణం అప్పటికి ఆయన జీతం నూటయాభై రూపా యలు, ఆమె జీతం రెండు వేలు. అదీగాక రామకృష్ణ అప్పుడు భానుమతి కంటే సన్నగా ఉండేవారు. తండ్రి వ్యతిరేకించడంతో మనస్తాపానికి గురై పదిహేనురోజులుపాటు అన్నం తినడం మానేసి గౌరీదేవి పటం ముందు మూగగా రోదిస్తూ కూర్చున్నారు. మామూలుగా అయితే గౌరిదేవి వ్రతం నలభైరోజులు చేస్తేనేగాని ఫలితం ఉండదు అలాంటిది పదిహేను రోజులకే భానుమతి స్వప్నం ఫలించింది. రామకృష్ణ తరపు బంధువురాలు కమలమ్మ కల్పించుకుని 8 ఆగస్టు 1943లో వారి వివాహం జరిపించారు. వారి పెళ్లి రిసెప్షన్లో ఆర్.బాలసరస్వతీదేవి రెండు పాటలు పాడి వారి వివాహానికి నిండుదనం తీసుకువచ్చారు. అలా ‘కృష్ణ ప్రేమ’ వారిని జంటగా చేసింది.


భానుమతి 1926 వ సంవత్సరము సెప్టెంబరు 7 ప్రకాశం జిల్లా, ఒంగోలులో జన్మించింది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య, శాస్త్రీయ సంగీత ప్రియుడు, కళావిశారదుడు.
భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరు ప్రాయంనాడే 1939 లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో నటించింది.
ఆమె 1943, ఆగష్టు 8 న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడినది. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.
2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించింది.
పి.యస్ .రామకృష్ణారావు దర్శకుడు గా నిర్మాత గా పలు తెలుగు, తమిళ సినిమాలు నిర్మించారు. ఆయన సినిమాలు కొన్ని తెలుపుతున్నాను.

ప్రేమకథలకు, అందులోనూ విషాదాంత ప్రేమకథలకు చిరునామాగా నిలిచిన‌ కథానాయకుడు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. అటువంటి నాగేశ్వరరావు నటించిన తొలి ప్రేమకథా చిత్రం ‘లైలా మజ్ను’. ఇంకా చెప్పాలంటే… తెలుగునాట ప్రేమకథా చిత్రాలకు నాంది పలికిన సినిమా ఇది. ఏఎన్నార్ మజ్నుగా, భానుమతి రామకృష్ణ లైలాగా దర్శనమిచ్చిన ఈ చారిత్రాత్మక చిత్రంలో… ముక్కామల, సి.ఎస్.ఆర్, కస్తూరి శివరావు, శ్రీరంజని, హేమలత తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. భానుమతి హోమ్ బ్యానర్ భరణి పిక్చర్స్ పతాకంపై ఆమె భర్త పి.ఎస్.రామకృష్ణారావు నిర్మించి, తెరకెక్కించిన ఈ సినిమా… తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
రామకృష్ణారావు 1986, సెప్టెంబరు 7 న మద్రాసులో మరణించాడు.

సేకరణ:- చందమూరి నరసింహారెడ్డి. ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత.

చందమూరి నరసింహారెడ్డి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s