సిరిపి ఆంజనేయులు.

సాహిత్యం మంటే మక్కువ వీరికి. తనకున్న చాలా ఆస్తి ని దానం చేసి ఎన్నో మంచి కార్యాలకు తోడ్పాటును అందించారు. ప్రకృతి వైద్యం పట్ల ఎనలేని నమ్మకం . ప్రకృతి వైద్యం గురించి విపరీతంగా ప్రచారం చేశారు.


శ్రీ సిరిపి ఆంజనేయులు 1891జూన్ 1న అనంతపురం జిల్లా ధర్మవరం లో జన్మించారు.వీరి తల్లిదండ్రులు నారమ్మ , రామన్న.
ధర్మవరము వీధిబడుల లోను, మిషన్ వారి పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు.
కలకత్తా యందలి ‘నిఖిల భారత సాహిత్య విద్యా పీఠము’న కథానిక, నవలా రచనా విభాగమునకు చెందిన ప్రత్యేక పట్టా 1921లో పొందారు.

శ్రీ సీరిపి ఆంజనేయులు చదివిన ‘మిషను’ వారి బడిలో 1911 నుండి 1920 వరకు తర్వాత 1920 నుండి 1925 వరకు దర్మవరం మాడలిక మాధ్యమిక పాఠశాలలో ఉపాధ్యాయులు గా పనిచేశారు. 1925-56వరకు అనంతపురము లో మహిళా శిక్షణ పాఠశాల నందు పనిచేసిపదవీవిరమణ పొందారు. చిరకాలము ఆంధ్ర భాషా సేవకే కృషి చేశారు.
సాహిత్య సరస్వతి” అను బిరుదుపొందారు. ధర్మవరములో ‘విజ్ఞాన వల్లికా గ్రంథమాల’ సంస్థ స్థాపించి తన రచనలనే కాకుండా ఇతరుల రచనలను పుస్తకాలుగా తీసుకొచ్చెవారు.

విజ్ఞానవల్లి , ప్రకృతిమాత, విద్యార్థి తదితర పత్రికలకు వీరు సంపాదకత్వము వహించారు. వాటిని సమర్థవంతంగా నడిపి పలువురి ప్రశంసలందుకొన్నారు.
చారిత్రాత్మికాంశములను పరిశోధించి గ్రంథస్థ మొనరిం చిరి. వీరు వ్రాసిన చరిత్ర గ్రంథములలో ముఖ్యమైనవి. 1) విద్యా నగర చరిత్రము 2) విద్యానగర వీరులు 3) ధర్మవర చరిత్రము 4) అనంతపుర మండల ఆదిమవాసుల చరిత్ర 5) చిక్కప్ప యొడయరు లేక చిక్కన్నమంత్రి 6)ముసలమ్మముక్తి.
అప్పట్లో పాఠకులు నవలలు, నాటకము లందు ఆసక్తిని కల్గి ఉన్నారని తెలుసుకొని సిరిపి వారు తమరచనా పోకడల దృష్టి అటువైపుకు కూడా సారించారు. ‘శారద’ అనబడు వీరి అపరాధ పరిశోధక నవలకు మంచిపేరు లభించినది. తదుపరి వీరు వీరవిలాసము , కుముడవల్లి అను నాటకాలను రచించారు. కుముదవల్లి నాటక మును శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల వారు తమ తొమ్మిదవ గ్రంథం గా ప్రచురించారు.
పై గ్రంథాలేకాక 1) గౌతమ బుద్ధ చరిత్ర 2) సీతా రామావధూత చరిత్ర 3)అన్యాపదేశము మొదలైన కృతులను వీరు రచించిరి.

వీరు తమ విజ్ఞాన వల్లికా గ్రంథమాల సంస్థ ద్వారా శ్రీ నారునాగనార్యుడు, శ్రీ వేదం వేంకటకృష్ణశర్మ , శ్రీ కుంటి మద్ది శేషశర్మ , శ్రీ కల్గోడు అశ్వత్థరావు , శ్రీ విద్వాన్ విశ్వం మున్నగు ప్రముఖ రాయలసీమ కవుల రచనలను ముద్రించారు. సిరిపి సాహిత్యపోషణే కాక గొప్పదాత. భూరిదానము లిచ్చిన త్యాగమూర్తులు వీరు. ఆంధ్రప్రదేశ్ సర్వోదయ పక్ష భూదాన సమితికి 72 ఎకరాలు 1957వ సం॥న విరాళంగా ఇచ్చారు. భారత రక్షణ నిధికై అప్పట్లో రూ.1116/-లను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి ద్వారా అందజేశారు. 1949వ సం॥ లో ధర్మవరము నందు ‘ఆంజనేయపురం’ అనుపేరుతో ఓ ప్రాంతం నెలకొల్పారు. ధర్మవరమునందు కళాశాల భవనాల నిర్మాణమునకు 24 ఎకరాల భూమిని దానంచేశారు.
ప్రకృతి వైద్యమును నమ్మేవారు. నిర్విరామంగా ప్రకృతి వైద్యము గూర్చి ప్రచారముచేసేవారు.

ధర్మవరములో 1919లో ఊరి జాతర పేరుతో నోరు లేని జంతువులను బలిఇచ్చారట. ఆ మహాఘాతుక కార్యము కవిగారి హృదయమును కలచివేసింది . ఈసందర్భంగా సీరిపి వారు ‘కరుణగీత’ పేర రచన వెలువరించారు.
అనంతపురం జిల్లాలో వీరి శిష్యులు అనేక మంది పెద్ద పెద్ద ఉద్యోగములందు స్థిరపడ్డారు.

శ్రీ సీరిపి ఆంజనేయులు తన 83వ ఏట జబ్బుపడి తన స్వగృహములో 27-11-1974 వ తేదిన తనువు చాలించారు. వారి భార్య సీరిపి సావిత్రిమ్మ .
ఈమె కూడ భర్త మరణించిన ఒక సంవత్సరము లోపేతనువు చాలించారు . వీరికి సంతానంలేదు.తన జీవితమును సాహిత్యసేవకు దానధర్మాలకు అంకితం చేశారు.

సోర్స్ ;- శ్రీ కల్లూరు అహోబలరావు రచన రాయలసీమ రచయితల చరిత్ర 2విభాగం.

సేకరణ;-చందమూరి నరసింహా రెడ్డి . ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s