హనుమ జన్మభూమి అంజనాద్రి
ఆధారాలు చూపిన తితిదే

Pc: enaadu

తిరుమల వేంకటాచలాన్నే ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రిగా శ్రీరామనవమి పర్వదినాన తితిదే అధికారికంగా ప్రకటించింది. తిరుమలలోని నాదనీరాజనం మండపంలో బుధవారం తితిదే అధికారులతో కలిసి సమావేశమైన పండిత పరిషత్‌ ఈ మేరకు తమ పరిశోధనల ఫలితాలను వెల్లడించింది. చారిత్రక, వాంగ్మయ, భౌగోళిక, శాసనపరమైన ఆధారాలతో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు పండిత పరిషత్‌ ఛైర్మన్‌, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధరశర్మ స్పష్టం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి హనుమంతుడి జన్మస్థలంపై వినిపిస్తున్న వాదనలకు తగిన ఆధారాలు లేవని వెల్లడించారు. తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, తితిదే ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పండితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమంతుడి జన్మస్థలంపై ఇక్కడున్న ఆధారాలను మురళీధరశర్మ ప్రకటించారు.

Pc bbc.com


శాసనాధారాలివి..
వాజ్ఞ్మయ, శాసన ఆధారాల ప్రకారం వాల్మీకి రామాయణానికి తమిళ అనువాదమైన కంబ రామాయణంలో, వేదాంత దేశికులు, తాళ్లపాక అన్నమాచార్యులు తమ రచనల్లో వేంకటాద్రిని అంజనాద్రిగా వర్ణించారు. స్టాటన్‌ అనే అధికారి క్రీ.శ.1800లో తిరుమల గుడి విశేషాంశాలను సంకలనం చేసి ‘సవాల్‌-ఏ-జవాబ్‌’ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో అంజనాద్రి అనే పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టిన చోటని ప్రస్తావించారు. వేంకటాచల మహాత్మ్యం గ్రంథం ప్రమాణమే అని చెప్పడానికి రెండు శిలాశాసనాలు తిరుమల ఆలయంలో ఉన్నాయి. మొదటి శాసనం క్రీ.శ. 1491 జూన్‌ 27కు చెందింది. రెండో శాసనం క్రీ.శ.1545 మార్చి 6వ తేదీకి చెందింది. తురుష్కుల దండయాత్ర సమయంలో శ్రీరంగంలోని ఉత్సవబేరాన్ని అక్కడినుంచి కొందరు తరలించారు. గోపణార్యుడనే విజయనగర ప్రతినిధి దాన్ని మళ్లీ శ్రీరంగంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆయన అంజనాద్రి నుంచి వాటిని తిరిగి తీసుకొచ్చినట్లు శ్రీరంగంలోని శిలాశాసనం పేర్కొంటోంది.
భౌగోళికంగానూ..
సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు అంజన పర్వతంలో నివసించే కపి వీరులను రప్పించమని ఆజ్ఞాపించాడు. కిష్కింధ రాజ్యమే అంజన పర్వతమైతే ఇలా ఆదేశించడంలో ఔచిత్యం లేదు. ఝార్ఖండ్‌లోని గుమ్ల హంపికి 1240 కి.మీ., గుజరాత్‌లోని డాంగ్‌ 666 కి.మీ., హరియాణాలోని కైథల్‌ 1626 కి.మీ., మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌ 616 కి.మీ.ల దూరంలో ఉంది. కిష్కింధకు 336 కి.మీ.ఉన్న అంజనాద్రి ఇదేనని స్పష్టమవుతోంది.
పండిత పరిషత్‌ సభ్యులు వీరు..
ఈ వాదనను నిరూపించేందుకు ఏర్పాటైన పండిత పరిషత్‌కు.. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వీసీ మురళీధరశర్మ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి సన్నిధానం సుదర్శనశర్మ, ఆచార్యులు రాణి సదాశివమూర్తి, జానమద్ది రామకృష్ణ, శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రెమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తుశాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌, తితిదే ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి ఆకెళ్ల విభీషణశర్మ సభ్యులుగా ఉన్నారు.

పురాణాలనుబట్టి..

శ్రీమద్రామాయణంలోని సుందరకాండలో, అనేక పురాణాల్లో, వేంకటాచల మహాత్మ్యంలో, ఇతర కావ్యాల్లో హనుమంతుడి జన్మ వృత్తాంతాన్ని చక్కగా వర్ణించారు. స్కాంద, వరాహ, బ్రహ్మాండాది పురాణాల నుంచి వివిధ అంశాల సంకలనమైన వేంకటాచల మహాత్మ్యం గ్రంథం హనుమంతుడి పుట్టుకను తెలియజేస్తుంది. శ్రీనివాసుడి నివాసమైన వేంకటాచల ప్రస్తావన 12 పురాణాల్లో ఉంది. వేంకటాచల క్షేత్రాన్నే త్రేతాయుగంలో అంజనాద్రిగా పిలిచేవారు.

Pc whatsapp

మతంగ మహర్షి సూచనల మేరకు ఆకాశగంగ ప్రాంతంలో అంజనాదేవి తపస్సు చేయడంతో పుత్రసంతానం కలిగిందని స్కాంద పురాణంలో ఉంది. తదనుగుణంగా ఈ కొండకు అంజనాద్రి అని పేరువచ్చింది. సూర్యబింబాన్ని పట్టుకునేందుకు బాలాంజనేయుడు ఇక్కడినుంచే లంఘించాడు. శ్రీరాముడి దర్శనానంతరం సీతాన్వేషణలో భాగంగా తిరిగి కొండకు వచ్చి అంజనాదేవిని చూశాడు.

(ఈనాడు,21.4.2021)

టిటిడి ఈవో డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. భగవత్‌ సంకల్పంతోనే రామనవమి నాడు హనుమంతుని జన్మస్థానాన్ని తిరుమలగా నిరూపించామని తెలిపారు. పండితులతో కూడిన కమిటీ పౌరాణిక, వ్మాయ, శాసన, భౌగోళిక ఆధారాలను సేకరించి నిర్ధారించిందని వెల్లడించారు. ఆధారాలతో కూడిన నివేదికను ఈ రోజు మీడియాకు విడుదల చేశామని, టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని వివరించారు. త్వరలో పుస్తక రూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని హనుమంతుని జన్మస్థలంగా చెబుతున్నారని, దీన్ని కూడా శాస్త్రీయంగా పరిశీలించామని, అక్కడ కిష్కింద అనే రాజ్యం ఉండొచ్చని, హనుమంతుడు అంజనాద్రి నుంచి అక్కడికి వెళ్లి సుగ్రీవునికి సహాయం చేసినట్టు భావించవచ్చని తెలియజేశారు. గుజరాత్‌, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో హనుమంతుడు జన్మించినట్టుగా ఎలాంటి ఆధారాలూ లభించలేదని చెప్పారు. ప్రస్తుత నివేదికపై టిటిడి బోర్డులో చర్చిస్తామని, ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వంతో, దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి హనుమంతుడు జన్మించిన స్థానంలో ఆలయం నిర్మించి అభివృద్ధి చేస్తామని తెలిపారు.
(ప్రజాశక్తి,21.4.2021)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s