అనంతపురం పిటిసీ స్టేడియం

ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి క్రీడా స్టేడియం మన అనంతపురం స్టేడియం . అవును అప్పుడు బెంగళూరులో కూడ స్టేడియం లేదు .

అనంతపురం పేరు వినగానే ఎవరికైనా అరుదైన పోరాటాలు, కరవు ,రికార్డులకు నెలవుగా ఉండే ప్రాంతం గుర్తుకువస్తుంది. ఆ ఒరవడిలోనే జిల్లా కేంద్రంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియం కూడా అరుదైన రికార్డులో ఒకటిగా చోటు దక్కించుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన స్టేడియం నిర్మాణం ఇలా జరిగింది..

అచిర కాలంలోనే ఓ క్రీడాధామంగా మారి ఎంతో మంది క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేసింది. మరెన్నో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ఉత్సవాలకు వేదికగా మారిన ఈ స్టేడియాన్ని ప్రభుత్వం కాకుండా ప్రైవేటు వ్యక్తులు నిర్మించారంటే ఆశ్చర్యం కలగకమానదు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని ప్రధాన క్రీడా మైదానాలలో ఒకటిగా నిలిచిన నీలం సంజీవరెడ్డి స్టేడియం.. నేటికీ వివిధ రాష్ట్ర స్థాయి క్రీడల కు వేదికగా ఉంటోంది.

వాకర్స్ కు ఇప్పుడు ప్రధాన కేం ద్రంగా మారింది. ఉదయం 5 గంటలైతే చాలు ఆరోగ్యం కోసం పరుగులు పెట్టే నగరవాసుల్లో అత్యధికులు ఈ స్టేడియంలోనే ఉంటారు. వీరిలో పెద్ద స్థాయి రచయితలు, కవులు, జిల్లా స్థాయి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు ఉంటున్నారు.

స్వాతం త్ర్యం వచ్చిన తొలిరోజుల్లో క్రికెట్ క్రీడ పట్ల పెద్ద పట్టణాల్లో మాత్రమే క్రేజ్ ఉండేది. 1950 తర్వాత దేశమంతటా మోజు పెరిగింది. ఆ రోజుల్లో క్రికెట్ ఆడేందుకు అనువైన క్రీడా మైదానాలు కూడా పెద్ద స్థాయిలో ఉండేవి కావు ఎక్కడైనా క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయంటే కామెంటరీ వింటూ రేడియోల ముందు జనం అతుక్కుపోయేవారు. ట్రాన్సిస్టర్లను చెవులకు ఆనించుకుని రోడ్డుపై తిరిగేవారు.

జె.ఎస్.సల్దానా ఐపీఎస్

సల్దానా గారి రాకతో …

1950 తర్వాత అనంతపురంలో క్రికెట్ పురుడు పుసుకోంది. ఆ రోజుల్లో అనంతపు రానికి చెందిన ఉత్తర్కర్ జ్ఞానేశ్వరరావు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసి, జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహిస్తూ వచ్చారు.

ఆ సమయంలోనే క్రికెట్ ఆడేందుకు అనువైన స్థలం కోసం అన్వేషణ కూడా మొదలైంది. అనుకోని విధంగా క్రీడలన్నా క్రీడాకారులన్నా అభిమానం కురిపించే ఐపీఎస్ అధికారి జె.ఎస్.సల్దానా… జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం వారి అన్వేషణకు కలిసి వచ్చింది.

ఎస్పీని కలిసి పోలీస్ ట్రైనింగ్ కళాశాల (పీటీసీ) కి చెందిన మైదానం నుంచి కొంత స్టేడియం నిర్మాణానికి కేటాయించాలంటూ జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరుపున జ్ఞానేశ్వరరావు, తదితరుల విన్నపంపై ఎస్పీ సల్దానా సానుకూలంగా స్పందించారు.

కేవలం ఆరు నెలల్లోనే నిర్మాణం పూర్తి

పోలీసు ట్రైనింగ్ కళాశాల స్థలం నుంచి కొం త మేర స్టేడియంకు కేటాయించి 1961లో నిర్మాణాన్ని చేపట్టారు.

చెన్నైకు చెందిన చిదంబరం (ప్రస్తుత మాజి కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మం త్రి చిదంబరానికి ఈయన తాత) సాయంతో స్టేడియం నిర్మాణానికి పునాదులు పడ్డాయి

రిజర్వ్ పోలీసుల శ్రమదానంతో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్రంలోనే తొలి క్రీడామై దానం నిర్మాణం పూర్తి చేసుకోగలిగింది.

హిందూపురానికి చెందిన బస్సు ఓనర్ శ్రీకంఠయ్య, ఆర్పీజీటీ బస్సు యజమాని బాలకృష్ణన్, ఉరవకొండ బస్సు ఓనరు దండా వెంకయ్య తదితరులు రూ.ఒక లక్ష సేకరించి అన్ని వసతులు సమకూర్చారు.

స్టేడియం నిర్వహణ విషయంలో ఎస్పీ సల్దానా, జ్ఞానేశ్వరరావును కార్యవర్గ సభ్యులుగా కొనసాగిస్తూ అప్పటి పీటీసీ ప్రిన్సిపాల్ ఆనందరామ్ చేతుల మీదుగా వారికే అప్పగించారు.స్టేడియంకు మంచి పేరు పెట్టాలని భావించి ఈ కళ నిజం చేసిన సల్దాన గారి పేరు పెట్టాలన్నప్పుడు దానికి సల్దాన గారు ఒప్పుకోలేదు .పేరు కోసం ఎప్పుడు పని చేయకూడదు అనేది ఆయన గొప్ప ఆలోచన. జిల్లాను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసిన నీలం సంజీవరెడ్డి పేరును అందరూ ప్రతిపాదించారు. దీంతో ఆ పేరుతోనే మైదానాన్ని ఆవిష్కరించారు.

అనంతకు వచ్చిన స్టార్ క్రికెటర్లు

జిల్లా కేంద్రంలో స్టేడియం నిర్మాణమైన సమయానికి ఒక్క హైదరాబాదు మినహా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోని 23 జిల్లాలు, కర్ణాటక రాజధాని బెంగుళూరుతో సహా మరెక్కడ క్రికెట్ మైదానం ఉండేది కాదు టర్ఫ్ వికెట్ కావడం తో అంతర్జాతీయ స్థాయి ఆటలకు వేదికగా మారింది .దీంతో 1962, 1964, 1971 వరకు ఈ స్టేడియం పలు రంజీ మ్యాచ్ లకు వేదికగా మారింది.

అప్పటి క్రికెట్ భారత జట్టు కెప్టెన్ అజిత్ వాడేకర్ , పాలీ ఉమ్రీగర్ రమాకాంత్ దేశాయి, చందూ బోర్డే , సర్దేశాయి దిలీప్ తదితరులు ఈ మైదానంలో తమ ఆట తీరును ప్రదర్శించి అనంత వాసులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తారు.

ప్రధానంగా చైనా యుద్ధ సమయంలో స్టార్ క్రికెటర్లను ఈ మైదా నానికి రప్పించి క్రికెట్ ఆడించడం ద్వారా-వచ్చినమొత్తాన్ని ఎన్ డీఎఫ్ (నేషనల్ డిఫెన్స్ ఫండ్)కు అనంత వాసులు విరాళం గా అందజేశారు.

సల్దానా బదిలీపై మరో ప్రాంతానికి వెళ్లిపోవడం, స్వతహాగా గాయకుడైన జ్ఞానేశ్వరరావు పూర్తిగా సంగీతానికే పరిమితం కావడంతో ఈ స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణ సన్నగిల్లుతూ వచ్చింది.జిల్లాలో ఆర్డీటీ స్టేడియం ఏర్పాటైన తర్వాత నీలం సంజీవరెడ్డి స్టేడియంలో రంజీ మ్యాచులు జరగడం తక్కువైపోయింది.

సల్దానా గారు ఈ స్టేడియం నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు. చరిత్రలో ఓ IPS officer and District SP ఊరూరు తిరిగి cricket క్లబ్స్ ఏర్పాటు చేసి పోటీలను నిర్వహించడమే కాకుండా వాటిలో స్వయంగా పాల్గొన్న వారులేరు,రారు కూడా .

తానే స్వయంగా మూడు రాష్ట్రాలు తిరిగి నిధులు సమకూర్చుకుని అర్ధరాత్రి తన వాహానంలో సింగనమల వెళ్ళి చీకటిలో పొలాల్లొ పడి ఆ గడ్డిని తీసుకు వచ్చి స్టేడియం టర్ఫ్ చేసిన మహనీయుడు.

తనమీద గౌరవంతో మొత్తం రిజర్వ్ పోలీసులు, ప్రజలు 180 రోజుల శ్రమదాన ఫలితం మన అనంత స్టేడియం .అసలు ఇటువంటి యస్ పీ కూడా ఉంటారా అనే విధంగా ఈ మహానుభావుడు ఈ మైదానంలోనే కూర్చొని పని చేసుకుంటూ చేయిస్తూ చరిత్ర సృష్టించారు.

అందుకే వారి జ్ఞాపకార్ధం జె.ఎస్.సల్దానా ఐపీఎస్ విగ్రహాన్ని స్టేడియంలో ఏర్పాటు చేయాలన్నది క్రీడాకారుల ఆకాంక్ష,

సల్ధాన గారి ఈ ప్రయాణంలో పక్కనే ఉండి మన అనంత స్టేడియం కళను నిజం చేసిన వ్యక్తి ఉత్తర్కర్ జనేశ్వరరావు గారి సేవలు మరువలేనివి . ఆయన ఈ వయసులో కూడ కళ్ళకు కట్టినట్టు మనకు ఈ ప్రయాణం వివరించడం మన అదృష్టం.

అనంతపురం అరుదైన జ్ఞాపకాలు.1964 లో పీటీసీ గ్రౌండ్స్ లో భారత దేశపు ప్రముఖ క్రికెటర్లు ఆడిన మ్యాచ్ స్కోర్ బుక్. ఒక్క సారి పేర్లు చదవండి చరిత్ర తెలుస్తుంది.
Bombay vs Rest of India 28.3.1964

inputs from Sri gnaneswar rao Garu , Sri Murali Garu , Sri Roddam Prabhakar Rao Garu

discover ananthapuram ఫేస్బుక్ వాల్ నుంచి సేకరణ.

discover ananthapuram facebook page …. saveananthapuram respectforsaldhana ananthapuram ptcstadium APPolice saldhanaIPS cricketinananthapuram

2 comments

 1. Dear Sri Gneswar ,
  Greetings to you sir,
  let me introduce myself ,
  Iam Dr.K.Raghunath from Hyderabad,
  my sir name is K and that stands for Kalyandurg ,we are from Anantapur.
  We used to reside in 2nd road Newtown and often used to come to your shop .
  My brothers Narayanamurthy ,Chandrasekhar and Srinivasamurthy all used to play cricket and all of us we knew you and often used to come to father’s cloth shop near court road turning.
  Also we knew Mr.Mani who used to play cricket.
  As children we used to see cricket matches in Arts college grounds.
  All of us knew very well Raghunath Reddy ,Bhaskar Reddy etc (all brothers)and you and Padma book stall Madhu and the used to go to the famous PTC grounds.
  Now I am thrilled to read the article on Sri Saldhana and our Anantapur cricket .
  Further please be informed that My father Seshagiri rao knew you, and ofcource your father, and my sister Lalithamma and Revathi speak very highly about you on your contributions to music.
  I feel very happy to write you Mr.Jnaneswar and will try to meet you in my next trip to Anantapur.
  Regards
  Dr.K.Raghunath brother of Narayana Murthy .

  Like

  1. సార్
   ఇది జ్ఞానేశ్వరరావు గారు రాసిన ఆర్టికల్ . రాయలసీమ ఇన్ఫో. ఇన్ వెబ్సైట్ లో వాడుకొన్నాం. నా పేరు నరసింహా రెడ్డి . నేను ఈ వెబ్సైట్ నడుపుతున్నా సార్.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s