‌‌

సాళ్వ కృష్ణమూర్తి కర్నూలు జిల్లా, అప్పటి కోవెలకుంట్ల తాలూకా. నొస్సం గ్రామంలో 1930 జూన్ నెల 26వ తేదీన జన్మించారు. తల్లి సీతమ్మ, తండ్రి వెంకట సుబ్బయ్య, బి.ఏ తెలుగులో బొబ్బిలి మహారాజావారి స్వర్ణపతకం, ఎం.ఏ తెలుగు (1950-52) ప్రధమ శ్రేణి పొందారు. సనాతన సంప్రదాయ సూత్రాలను వెతికి పట్టుకొని, వెలికితీసి ఒక
శాస్త్రకావ్య సమన్వయవేత్తగా గుర్తింపు పొందారు.

భారతీయ షడ్దర్శనాలైన సాంఖ్య, వైశేషిక, న్యాయ
యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, ఉత్తర మీమాంస
విశేషించి జైమిని మహర్షి ప్రవర్తింపజేసిన పూర్వమీమాంసా
దర్శనానికి చెందిన వైదిక సంబంధ విషయాలు, మీమాంసా
న్యాయాలు, ఆలంకారికులు చెప్పినట్లు వ్యాస
మహాభారతంలో ఉండవచ్చు. కాని, ఇలాంటి విషయాలను
నన్నయభట్టు ఆంధ్ర మహాభారతంలో కూడ అంతర్గత
సూత్రంగా చేసి రాశాడని నిరూపించారు సాళ్వ కృష్ణమూర్తి. "మహాభారతం ఒక శ్రౌత రూపకం" అంటారు వీరు.
సాళ్వ కృష్ణమూర్తి సిద్ధాంత గ్రంథం 'నన్నయభట్టు
భారతం - పూర్వమీమాంస '(మద్రాసు, 1986). "ఏ భాషలోని
ప్రాచీన సాహిత్యం పరిశీలించినా అందులో కవిత్వం
(Poetry). మతం (Religion) తత్త్వం (Philosophy)
కలిసి ఉంటాయి. కాలక్రమంలో, సామాజికార్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల అవి దేనికదిగా వేరుపడుతూ వచ్చి, ఈనాడు సాహిత్యానికి మత, తత్త్వశాస్త్రాలతో సంబంధం ఉండరాదనే స్థితి ఏర్పడింది. కాని, ప్రాచీన సాహిత్యానుశీలనంలో వీటి ప్రమేయం తప్పనిసరిగా ఉంటుంది." అని వీరి మౌలిక ప్రతిపాదన.
“సారమతింగవీంద్రులు అన్న పద్యం పూర్తిగా
పూర్వమీమాంసాగంధిలమైనదని, భట్టారక భారత విమర్శకు
ఈ పద్యం కీలకమని, ప్రసన్న కథాకలితార్ధ యుక్తిలో ' ప్రసన్న'
శబ్దం స్పష్టార్థం. "అర్థయుక్తి" అనే పదం మీమాంసాన్యాయం,
రుచిరార్థ సూక్తులంటే మీమాంసాసూక్తులు,న్యాయములని
భట్టారక హృదయం!

పతంజలి వ్యాకరణ మహాభాష్య రచనలో
న్యాయ బీజాలను నిక్షిప్త పరచినట్లు, వ్యాస మహర్షి మహాభారత రచనలో పూర్వ మీమాంసా న్యాయాలను, సూక్తులను నిక్షిప్తంచేశాడని, నన్నయ కూడా వ్యాసులవారి బాటలో నడచి తెలుగులోను ఆవిష్కరించారని
వీరి పరిశోధన సారాంశం.
1988-60 ప్రాంతాలలో ముట్నూరి సంగమేశంతో
కలిసి వీరు భారతి పత్రికలో దాక్షిణాత్య, ఔత్తరాహ నాట్య
సంప్రదాయాలపై వ్యాసాలు రాశారు. రాళ్ళపల్లి వ్యక్తిత్వంపై
వచన రచనపై వీరు "భారతి"లో ప్రచురించిన రెండు వ్యాసాలు
(1961-68) వారి చక్కని అభిరుచి, - అనుభూతి - అభివ్యక్తికి
ఉదాహరణలుగా చెప్పవచ్చు.
కళలు అనుభవ ప్రధానములు. కనుక, కళానుభవమే విమర్శ అని అన్నారు. " ప్రబంధ పూర్వకవితా రీతులనే వ్యాసంలో "తెనుగు సాహిత్యము ప్రధానంగా సమయకళ " అని నిర్వచించారు. వ్యాఖ్యాన విషయాలలో నన్నయ మీమాంసకుల వాక్యార్ధ పద్ధతి ననుసరించడంలో
ఆశ్చర్యపడాల్సిందేమీ లేదన్నారు.

పౌరాణిక కథలు స్వభావికంగా 'arche-typal గా ఉంటాయి. తాత్త్వితంగా ప్రతి కథలోను ఏడు భూమిక లుంటాయి. దీనిలో వ్యక్తుల పేర్లు భూమికాంతరంలో మారుతుంటాయి. భరతుడు కృతిని భువనవాజ్మయంపై
సదృశంగా భావించాడు. ఇది యొక తాత్విక రహస్యజ్ఞాన
సంబంధమైన దృష్టి" అనంటారు కృష్ణమూర్తి,
సంస్కృత సాహిత్యంలో కనబడని, నాట్యశాస్త్రం
లోని అర్థక్రియా పద్ధతులు "modes of erotic
expression' పెద్దన మనుచరిత్రలో ఉన్నట్లు గుర్తించారు.
ఆయన రాసిన ఇతర సాహిత్య వ్యాసాలలో "నన్నయ వైదిక ధర్మనిష్ట,పోతన భాగవతము ప్రతీకాత్మకత,భావ సంకీర్తన సీసత్రిశతి, కోరాడ రామకృష్ణయ్య కాళిదాస నాటక పరామర్శ,వైష్ణవం- భాగవతసంప్రదాయం ,ఎట్టన హరివంశము - శ్రీ కృష్ణతత్త్వము, సాహిత్య విమర్శన సంప్రదాయము_ వ్యాఖ్యానసంప్రదాయములు ముఖ్యంగా పేర్కొనదగినవి.
ప్రబంధకవులపై, కావ్యాలపై వీరెన్నో రేడియో ప్రసంగాలు చేశారు.నాట్యశాస్త్రం పదబంధ పారిజాతం వంటి గ్రంథాలను భారతిలో సమీక్షించారు. 1955 ప్రాంతాలలో ఎస్.కె. అనే పుటాక్షరాలతోను, 'హలాయుధశర్మ అనే కలం పేరులోను
సమీక్షలు వ్రాశారు.
ఉద్యోగ విరమణానంతరం 1988-1996 మధ్య
చెన్నైలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ లో పనిచేశారు.
ఆ కాలంలో వీరు ఎ హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ ను రెండు
సంపుటాలలో (1994) ప్రకటించారు. సాహిత్య చరిత్ర
లిఖించారు. తాళ్లపాక చిన తిరుమాలాచార్యుల సంకీర్తన
లక్షణ గ్రంథాన్ని The Tunes of Divinity (A
Treatise an Hymnody in Telugu) అనే పేరుతో
ఆంగ్లానువాదమే కాక, భారతీయ ప్రాచీన సంగీత
సంప్రదాయాన్ని జోడిస్తూ కర్ణాటక సంగీతంలో పదకవితా
వాజ్మయంపై విస్తృత వ్యాఖ్యానానంతో 1990లో రెండు
సంపుటాలుగా ప్రచురించారు.
కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో వీరు 2003-04
మధ్యకాలంలో సీనియర్ రీసర్చ్ అసోసియేట్ గా పనిచేశారు.
ఈ కాలంలో వీరు జయదేవుని గీత గోవింద కావ్యాన్ని
తెలుగులోకి, ఆంగ్లంలోకి అనువదించారు. అలాగే, క్షేత్రయ్య, అన్నమయ్య, త్యాగరాజు, ప్రకారం సారంగపాణి మొదలైన వాగ్గేయకారుల యాభై సంకీర్తనలు స్వతంత్రంగా
ఎన్నుకొని వాటి నాట్యానుకూలతపై ప్రతిపద చర్చ చేస్తూ భరత, కూచిపూడి సంప్రదాయాల కనుగుణంగా తెలుగులోనూ,
ఆంగ్లంలోను వ్యాఖ్యానించారు. ఇది వెలువడవలసి ఉంది.
వీరి వ్యాసాలు జర్నల్ ఆఫ్ మ్యూజిక్ అకాడెమీ
(మద్రాసు)లోను, త్రివేణి ఆంగ్ల పత్రికలోనూ, జాతీయ,
అంతర్జాతీయ సదస్సులలో సమర్పించారు. వీరి జ్యోతిశ్శాస్త్ర
ప్రజ్ఞ శ్రీనాథుని జాతక చక్రనిర్మాణంలో వ్యక్తమైనది. నన్నయ సామాజిక అక్షర రమ్యతపై Syllabic Melody అనే వ్యాసం రాశారు. యక్షగానాలు తెలుగువారి గీతరూపకాలు (Music Opera) అన్నారు. సంగీత రచనల్లో గల ఛందోగతులపై, లయపై పరిశోధన వ్యాసాలు రాశారు. విశ్వనాథ గేయ కవిత్వమైన కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి రచనల్లో గల ప్రతీకాత్మక, లయాత్మక విన్యాసాలను ఆవిష్కరించారు.
__ముదివేడు ప్రభాకరరావు
        (సేకరణ: పిళ్లా కుమారస్వామి)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s