ఎస్. గంగప్ప అనంతపురం జిల్లా'నల్లగొండ్రాయనిపల్లె'లో 8-11-1936న జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ (ఆనర్సు), ఎం.ఏ (తెలుగు) డిగ్రీలు పొందారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. వివిధ ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు.
     కోలాచలం శ్రీనివాసరావు నాటక రంగానికి చేసిన అవిరళమైన కృషి గురించి చాలామందికి తెలీని రోజుల్లో కోలాచలం శ్రీనివాసరావు సాహిత్య సమాలోకనము అనే అంశం తీసుకొని పిహెచ్.డి.కోసం పరిశోధించి పుస్తకంగా వెలువరించారు. మరుగునపడినరత్నాన్ని అపూర్వమైన విశేషాంశాలతో ప్రకాశింపజేశారు.
     గంగప్ప పదకవితపై ఎంతో కృషిచేసి పదిపుస్తకాలు రాశారు.క్షేత్రయ్య గురించి సంక్షిప్ర గ్రంథం వెలువరించారు. సారంగపాణిపై తెలుగు వారు ఎందుకో అంత దృష్టి పెట్టలేదు.
తెలుగులో పదకవిత అనే పుస్తకం ఆంధ్రప్రదేశ్ సాహిత్య
అకాడమీ బహుమతి పొందింది. తెలుగు వాగ్గేయ కారులు,
సిద్ధేంద్రయోగి పురందరదాను" అన్నమాచార్య, ప్రముఖ
వాగ్గేయ కారులు - తులనాత్మక అధ్యయనం - పదసాహిత్య
పరిమళం - అన్నమాచార్య సంకీర్తన సుధ" వంటి పుస్తకాలు
రాయడమే కాకుండా మనపదకవితను Telugulo
Pariskavitha పేరుతో ఆంగ్లంలో రాశారు. పదకవిత,
తెలుగు నాటకం, జానపద వాజ్మయంపై ఎక్కువ రచనలు
చేసిన గంగప్ప ప్రాచీనాధునిక సాహిత్యాలపై తమదైన
దృక్పథంతో విశ్లేషణలు చేశారు.
       గంగప్పుకు జానపద వాజ్మయమంటే మరింత మక్కువ.1976లోనే తెలుగు దేశపు జానపద గీతాలు అనే పుస్తకంలో ఎన్నిక చేసిన గీతాలు పరిశీలిస్తే ఎంత పరిశోధన చేశారో తెలుస్తుంది. జానపద గేయరామాయణం, జాతికి ప్రతిలింబం -శాస్త్రజానపద సాహిత్యం జానపద గేయాలు (లఘువివరణతో)జానపద వీరగాథా వాజ్మయం.. జానపద వచనవాజ్మయం, బుర్రకథ మొదలైన పుస్తకాలు జానపద సాహిత్య వైభవాన్ని వెల్లడిస్తాయి. 
     సాహిత్యోపన్యాసకులు, సాహిత్య సుధ,
తెలుగు నాటకం", "సాహిత్య సమాలోచన సాహిత్యాను
శీలనం " వంటి పుస్తకాలు గంగప్ప విమర్శనా శక్తిని వెల్లడిస్తే,
వేయి పడగలు - విశ్లేషణాత్మక విమర్శ " అనే పుస్తకం ఆయన
సద్విమర్శన ప్రతిభను ప్రతిబింబిస్తుంది. యుజిసి బృహత్
పరిశీలన ప్రణాళిక అనుసరించి తెలుగు నాటకం-సామాజిక చైతన్యం " పై రాసిన పుస్తకం తెలుగు సాహిత్యానికి
కొత్త వెలుగు.
__ద్వానా శాస్త్రి
         ( సేకరణ:పిళ్లా కుమారస్వామి)
          

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s